AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: విరాట్‌ కోహ్లీకి చేదు అనుభవం.. హోటల్‌ రూంలోకి చొరబడిన ఆగంతకుడు.. గదినంతా వీడియో తీసి..

విరాట్‌ కోహ్లీ గదిలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ గదినంతా వీడియో తీశాడన్న వార్త ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనపై విరాట్‌ కోహ్లీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకవేళ తన అభిమాని ఈ పనిచేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించేది లేదని మండిపడ్డాడు.

T20 World Cup: విరాట్‌ కోహ్లీకి చేదు అనుభవం.. హోటల్‌ రూంలోకి చొరబడిన ఆగంతకుడు.. గదినంతా వీడియో తీసి..
Virat Kohli
Basha Shek
|

Updated on: Oct 31, 2022 | 11:47 AM

Share

ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌ను గెలవాలని టీమ్ ఇండియా శాయశక్తులా ప్రయత్నిస్తోంది. అయితే ఆస్ట్రేలియాలో టీమిండియా ఆటగాళ్లకు తగినన్ని సౌకర్యాలు ఉండడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఫుడ్‌ మెనూ దారుణంగా ఉందంటూ భారత క్రికెటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు క్రికెటర్ల భద్రతపై కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం మ్యాచ్‌ కోసం పెర్త్‌ వచ్చిన టీమిండియా క్రికెటర్లు ఓ హోటల్‌లో స్టే చేశారు. అయితే విరాట్‌ కోహ్లీ గదిలోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ గదినంతా వీడియో తీశాడన్న వార్త ప్రకంపనలు రేపుతోంది. ఈ ఘటనపై విరాట్‌ కోహ్లీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకవేళ తన అభిమాని ఈ పనిచేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించేది లేదని మండిపడ్డాడు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు విరాట్ కోహ్లీ అక్కడ లేడని సమాచారం. ‘అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను చూడడం, కలవడంలో తప్పేమీ లేదు. అది వారికి చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఫ్యాన్స్‌ను కలుసుకోవడమంటే నాక్కూడా చాలా ఇష్టం. ఈ విషయంలో అభిమానుల ఇష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ వీడియోను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. నా ప్రైవసీపై పలు అనుమానాలను రేకెత్తించింది.

భద్రతపై అనుమానాలు..

‘నా హోటల్ గదిలోనే నాకు ప్రైవసీ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది? ఇది నాకెంతో ఆవేదన కలిగిస్తోంది. దయచేసి ఎదుటివారి గోప్యతను గౌరవించండి. మమ్మల్ని వినోద వస్తువులుగా మాత్రం పరిగణించవద్దు’ అని ఈ సందర్భంగా తెలిపాడు విరాట్. కాగా ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. కాగా సౌతాఫ్రికాతో మ్యాచ్ కోసం టీమిండియా పెర్త్‌లోని క్రౌన్ పెర్త్ హోటల్‌లో బస చేసింది. ఇంత పెద్ద హోటల్‌లో అది కూడా ఆటగాళ్లు లేని సమయంలో ఆగంతకుడు గదిలోకి ప్రవేశించాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు అక్కడున్న భద్రతా వ్యవస్థపై అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

స్పందించిన వార్నర్‌, అనుష్క

కాగా ఈ ఘటనపై ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ స్పందించాడు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదంటూ తెలిపాడు. అలాగే కోహ్లీ సతీమణి కూడా ఇది చాలా దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

View this post on Instagram

A post shared by Virat Kohli (@virat.kohli)

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..