Unstoppable 2: బాలయ్యతో కుర్ర హీరోల రచ్చ రచ్చ.. వామ్మో ఎంటర్‌టైన్‌మెంట్‌ మాములుగా ఉండేలా లేదుగా.?

తొలి తెలుగు ఓటీటీ ఆహాలో టెలికాస్ట్ అవుతోన్న అన్‌స్టాపబుల్‌ షో రోజురోజుకీ ప్రేక్షకాదరణ పొందుతూ దూసుకుపోతోంది. నట సింహం బాలకృష్ణలోని మరో కోణాన్ని పరిచయం చేసిన ఈ టాక్‌ షో తెలుగు ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్‌ చేస్తోంది. రెట్టించిన ఉత్సాహంతో మొదలైన అన్‌స్టాపబుల్‌ సెకండ్‌..

Unstoppable 2: బాలయ్యతో కుర్ర హీరోల రచ్చ రచ్చ.. వామ్మో ఎంటర్‌టైన్‌మెంట్‌ మాములుగా ఉండేలా లేదుగా.?
Unstoppable With Nbk S2
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 01, 2022 | 11:31 AM

తొలి తెలుగు ఓటీటీ ఆహాలో టెలికాస్ట్ అవుతోన్న అన్‌స్టాపబుల్‌ షో రోజురోజుకీ ప్రేక్షకాదరణ పొందుతూ దూసుకుపోతోంది. నట సింహం బాలకృష్ణలోని మరో కోణాన్ని పరిచయం చేసిన ఈ టాక్‌ షో తెలుగు ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్‌ చేస్తోంది. రెట్టించిన ఉత్సాహంతో మొదలైన అన్‌స్టాపబుల్‌ సెకండ్‌ సీజన్‌ మరింత సక్సెస్‌ టాక్‌తో దూసుకుపోతోంది. ఇప్పటికే ఈ సీజన్‌లో వచ్చిన రెండు ఎపిసోడ్‌లు బాగా సక్సెస్‌ కాగా తాజా నవంబర్‌ 4వ తేదీ నుంచి ఎపిసోడ్‌3 టెలికాస్ట్‌ అవుతోంది. తాజాగా ఆహా టీమ్‌ ఈ ఎపిసోడ్‌ ప్రోమోను విడుదల చేసింది.

అన్‌స్టాపబుల్‌ 2 మూడో ఎపిసోడ్‌లో భాగంగా కుర్ర హీరోలు అడివి శేష్‌, శర్వానంద్‌ అతిథిలుగా హాజరవుతున్నారు. ప్రోమో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఇద్దరు కుర్రకాలతో బాలయ్య బాబు చేసిన సందడి వావ్‌ అనిపించేలా ఉంది. ఫుల్‌ మీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పక్కా అనేలా ఈ ఎపిసోడ్‌ సాగినట్లు కనిపిస్తోంది. గత ఎపిసోడ్‌లో బాలకృష్ణ.. రష్మిక తన క్రష్‌ అన్న మాటను గుర్తు చేస్తూ శర్వానంద్‌ రష్మికతో వీడియో కాల్‌లో మాట్లాడించాడు. శర్వానంద్‌, బాలకృష్ణ మధ్య జరిగిన కొన్ని సంబాషణలు కడుపుబ్బ నవ్విస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక ఓ టాస్క్‌లో భాగంగా ‘సెల్ఫీ అడిగితే చంప పగల కొట్టిన హీరో ఎవరు’ అన్న ప్రశ్నను బాలకృష్ణ స్వయంగా అడిగి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే ఈ ప్రశ్నకు బాలయ్య నవ్వుతూ స్పందించడం, ‘మీ జవాబును అయినా కూడా మేమే చెప్పాలా సార్‌’ అని శర్వానంద్‌ సమధానం ఇవ్వడంతో షోలో నవ్వులు పూశాయి. అలాగే శర్వానంద్‌ జాను సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదం సంఘటనను పంచుకున్నాడు. ఇలా నాన్‌ స్టాప్‌ హంగామాగా సాగిందీ ప్రోమో. మరి ప్రోమోనే ఇంతలా ఆకట్టుకునేలా ఉంటే మరి ఫుల్‌ ఎపిసోడ్‌ ఎంతటి హంగామా సృష్టిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
పెళ్లికి రావాలని చంద్రబాబు, పవన్‌లకు పీవీ సింధు ఆహ్వానం
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్