AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger: లైగర్‌ సినిమాకు ముందుగా ఆ స్టార్‌ హీరోను అనుకున్నారట.. కానీ చివరకు..

గర్ సినిమా కథను పూరి జగన్నాథ్‌ ముందు కన్నడ స్టార్‌, కేజీఎఫ్  హీరో యష్‌కు వినిపించారట. అయితే యష్‌కు కథ నచ్చకపోవడంతో నో చెప్పాడట. దీంతో ఈ కథ విజయ్‌ దగ్గరకు వెళ్లిందట.

Liger: లైగర్‌ సినిమాకు ముందుగా ఆ స్టార్‌ హీరోను అనుకున్నారట.. కానీ చివరకు..
Liger
Basha Shek
|

Updated on: Nov 01, 2022 | 1:25 PM

Share

టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ, డ్యాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం లైగర్. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించింది. బాక్సింగ్‌ దిగ్గజం మైక్‌ టైసన్‌ ఓ కీలకపాత్రలో కనిపించాడు. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ పాన్‌ ఇండియా సినిమాను నిర్మించాయి. భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న రిలీజైన ఈ చిత్రం ప్లాఫ్‌గా నిలిచింది. అటు రౌడీ, పూరీ ఫ్యాన్స్‌కు నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం లైగర్‌ సినిమా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే..  లైగర్ సినిమా కథను పూరి జగన్నాథ్‌ ముందు కన్నడ స్టార్‌, కేజీఎఫ్  హీరో యష్‌కు వినిపించారట. అయితే యష్‌కు కథ నచ్చకపోవడంతో నో చెప్పాడట. దీంతో ఈ కథ విజయ్‌ దగ్గరకు వెళ్లిందట. అలా ఈ సినిమా పట్టాలెక్కిందట. ఇందులో నిజమెంతుందో తెలియదు కాదు కానీ నెట్టింట్లో ఈ వార్త బాగా సర్క్యూలేట్‌ అవుతోంది.

కాగా లైగర్‌ నిరాశపర్చడంతో మేకర్స్ అలాగే డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. ఇప్పటికీ దర్శకుడు, ఎగ్జిబిటర్ల మధ్య వివాదం నడుస్తోంది. లైగర్‌ సినిమాతో తాము బాగా నష్టపోయామని.. పూరి జగన్నాథ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తమ నష్టాలను భర్తీ చేయాలంటూ పూరిని బెదిరిస్తున్నట్లుగా ఆడియోల్ లీక్ అయిన సంగతి తెలిసిందే. వారి పోరు తట్టుకోలేకపోయిన పూరి జగన్నాథ్.. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. ఇటీవలే ఈ విషయంపై ఓ బహిరంగ లేఖ కూడా విడుదల చేశాడు. మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!