AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పనిమనిషి పుట్టిన రోజు.. స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఫ్యామిలీ.. ఎమోషనల్‌ వీడియో

ఇందులో యజమాని కేక్‌తో పనమనిషిని ఎలా సర్‌ప్రైజ్‌ చేశారో స్పష్టంగా చూడచ్చు. అలాగే తన బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేయడంతో సదరు మహిళ ఉద్వేగానికి గురవ్వడం మనం చూడొచ్చు. కేక్‌ కటింగ్‌ సెషన్‌ అంతటా ఆమె నవ్వుతూ కనిపించారు.

Watch Video: పనిమనిషి పుట్టిన రోజు.. స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన ఫ్యామిలీ.. ఎమోషనల్‌ వీడియో
Birthday Celebrations
Basha Shek
|

Updated on: Nov 01, 2022 | 12:08 PM

Share

పనిమనుషులను చాలామంది చులకనభావంతో చూస్తుంటారు. వారు ఇంట్లో అన్నీ పనులు చేసినా కేవలం జీతం డబ్బులతోనే ముడిపెడతారు తప్ప వారి ఆలనా పాలనా, బాగోగుల గురించి పెద్దగా పట్టించుకోరు. ఈ నేపథ్యంలో పనిమనిషి పుట్టిన రోజును పురస్కరించుకుని ఓ ఫ్యామిలీ అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ఆమె చేత బర్త్‌డే కేక్ కట్ చేయించడంతో పాటు స్వయంగా టీ తయారుచేసుకొచ్చి పనిమనిషికి ప్రేమతో అందించారు. ప్రముఖ సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్‌ విరాల్ భయానీ షేర్‌ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో యజమాని కేక్‌తో పనమనిషిని ఎలా సర్‌ప్రైజ్‌ చేశారో స్పష్టంగా చూడచ్చు. అలాగే తన బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేయడంతో సదరు మహిళ ఉద్వేగానికి గురవ్వడం మనం చూడొచ్చు. కేక్‌ కటింగ్‌ సెషన్‌ అంతటా ఆమె నవ్వుతూ కనిపించారు. ‘ఇలాంటి ప్రత్యేకమైన రోజుల్లో వారికి బహుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు..కేవలం ప్రేమ, సంతోషం వారికి అందిస్తే చాలు ‘ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్‌ ఇచ్చారు. ‘ఆమె (పనిమనిషి) తన భర్తతో కలిసి నగరంలో ఒంటరిగా ఉంటోంది. కుటుంబం కోసం చాలా కష్టపడుతోంది. పుట్టిన రోజు సందర్భంగా ఆమె ముఖంలో చిరునవ్వు తీసుకురావాలని మేం భావించాం. ఇందులో భాగంగా మా మామ గారు ఆమె కోసం కేక్ కొని తీసుకొచ్చారు. మేమందరం కలిసి ఈ ప్రత్యేక సందర్భాన్ని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాం’

‘కొన్నిసార్లు ఇతరుల ముఖంలో చిరునవ్వు తెప్పించేందుకు మనం చేసే చిన్న చిన్న పనులు కూడా ఎప్పటికీ మనతో పాటే నిలిచిపోతాయి. హ్యాపీయెస్ట్ బర్త్ డే మౌషి.. మా ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా, చక్కగా ఉంచుతున్నందుకు ధన్యవాదాలు. మీరు లేకుండా మేం లేము’ అంటూ పనిమనిషికి సేవలకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చింది యజమాని ఫ్యామిలీ. ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతోన్న ఈ వీడియోను చూసి చాలామంది భావోద్వేగానికి గురవుతున్నారు. పనిమనిషి బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసిన యజమాని కుటుంబాన్ని అభినందిస్తున్నారు. పని మనుషులు కూడా మన జీవితంలో ఒక భాగమని వారిని చులకన భావంతో చూడవద్దంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి నెటిజన్లను భావోద్వేగానికి గురి చేస్తోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..