Immortal Jellyfish: ఈ సృష్టిలో మరణం లేని ప్రాణి ఉందన్న విషయం తెలుసా.? ఈ అమర జీవికి సంబంధించిన ఆసక్తికర విషయాలు..
పుట్టిన ఏ జీవైనా మరణించక తప్పదు.. ఈ సత్యం అందరికీ తెలిసిందే. కాలం గడుస్తున్నా కొద్దీ వయసు పెరుగుతుంది దీనికి అనుగుణంగానే మరణం చేరువవుతోంది. ప్రకృతిలో ప్రతీ జీవికి ఇది అనివార్యం. ఈ అనంత విశ్వంలో ఎన్నో జీవులు అంతరించిపోయాయి. ఆరోగ్య సమస్యలు, పెరిగే వయసు జీవుల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చే్స్తాయి. అయితే ఓ జీవి ...
పుట్టిన ఏ జీవైనా మరణించక తప్పదు.. ఈ సత్యం అందరికీ తెలిసిందే. కాలం గడుస్తున్నా కొద్దీ వయసు పెరుగుతుంది దీనికి అనుగుణంగానే మరణం చేరువవుతోంది. ప్రకృతిలో ప్రతీ జీవికి ఇది అనివార్యం. ఈ అనంత విశ్వంలో ఎన్నో జీవులు అంతరించిపోయాయి. ఆరోగ్య సమస్యలు, పెరిగే వయసు జీవుల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకంగా మార్చే్స్తాయి. అయితే ఓ జీవి మాత్రం మరణం అంటూ ఎరగకుండా జీవిస్తూనే ఉంది. డైనోసార్ల కాలం నాటి కంటే ముందు నుంచి ఈ జీవి తన మనుగడను సాగిస్తోంది. ఇంతకీ మరణం అంటూ లేని ఆ జీవి ఏది.? దానికి అమరత్వానికి కారణం ఏంటి.? లాంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లా్ల్సిందే..
ఏళ్లు గడిచినా మరణం లేకుండా బతికే జీవి పేరు ‘టురిటోప్సిస్ డోహ్రిని (టి.డోహ్రిని). ఇది ఒక జెల్లీ ఫిష్. సముద్రానికి అట్టడగున ఈ జీవులు నివసిస్తుంటాయి. ఈ జెల్లీ ఫిష్‌ల శరీరం 95 శాతం నీటితోనే తయారవుతుంది. ఈ కారణంగానే జెల్లీ ఫిష్ పూర్తిగా పాదర్శకంగా కనిపిస్తుంది. ఇక ఈ జీవికి మెదడు ఉండదు. ఇక ఈ జీవి మరణం లేకుండా జీవిస్తుండడానికి ప్రధాన కారణం.. కణాల తయారీలో జరిగే మార్పులే. సాధారణంగా వయసు పెరుగుతున్నా కొద్ది కణాల్లోని క్రోమోజ్‌మ్‌ల చివరన ఉండే టెలోమెర్ల పొడవు తగ్గిపోతూ ఉంటుంది. కొత్త కణాలు పుట్టుకొచ్చినా అవి అప్పటికీ ఆ జీవి ఉన్న వయసుకు తగినట్టుగానే ఉంటాయి.
అయితే జెల్లీఫిష్ విషయంలో మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. వీటిలో వయసు పెరుగుతున్న కొత్త కణాలు తక్కువ వయసువాటిలాగే ఉంటాయి. జెల్లీ ఫిష్‌లోని కణాల్లో జన్యువులన్నీ రెండు సెట్లుగా ఉండడమే ఈ జీవికి మరణం లేకపోవడానికి కారణమని పరిశోధకులకు గుర్తించారు. ఒక సెట్‌లోని జన్యువుల్లో మార్పులు జరిగినా, రెండో సెట్‌లోని జన్యువులు విడుదల చేసే ప్రోటీన్లు కణాలను మరమ్మత్తు చేసుకుంటాయని, ఈ కారణంగానే టెలోమెర్ల పొడవు తగ్గకుండా ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. జెల్లీ ఫిష్‌లపై పరిశోధనలు చేసిన స్పెయిన్‌లోని ఒవిడో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు భవిష్యత్తులో మనుషులు కూడా వయసు పెరగకుండా ఎక్కువ కాలం జీవించేందుకు జెల్లీ ఫిష్‌లపై చేసే ప్రయోగాలు మార్గం చూపిస్తాయని నమ్ముతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..