Cold Water Bath: శీతాకాలంలో వేడినీళ్లు, చలి నీళ్ల స్థానాల్లో ఏది బెటర్.. ఆ సమస్యలున్న వారు చల్లటి నీళ్లను వాడొద్దు..
శీతాకాలంలో చలి ఎక్కువుగా ఉంటుంది. చాలా మంది ఈ కాలంలో వేడినీళ్లతోనే స్నానం చేస్తారు. చలి నీళ్లను అసలు ముట్టరు. కొంతమంది కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా గోరు వెచ్చని నీళ్లు ఉపయోగిస్తూ ఉంటారు. శీతాకాలంలో చల్లటి నీళ్లతో..
శీతాకాలంలో చలి ఎక్కువుగా ఉంటుంది. చాలా మంది ఈ కాలంలో వేడినీళ్లతోనే స్నానం చేస్తారు. చలి నీళ్లను అసలు ముట్టరు. కొంతమంది కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా గోరు వెచ్చని నీళ్లు ఉపయోగిస్తూ ఉంటారు. శీతాకాలంలో చల్లటి నీళ్లతో స్నానం చేయడాన్ని ఇబ్బందిగా భావిస్తారు. అయితే చలికాలంలో వేడినీటితో స్నానం చేయటం కంటే చల్లటి నీళ్లతో స్నానం చేయడమే ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు. అయితే కొంత మందికి మాత్రం చల్లటి నీళ్ల స్నానం అసలు మంచిది కాదని, చల్లటి నీళ్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. సాధారణంగా శీతాకాలంలో ఉదయం లేవటానికి కూడా బద్దకంగా ఉంటుంది. చాలా ఆలస్యంగా లేచి, వేడివేడి నీళ్లతో స్నానం చేయడానికి చాలా మంది అలవాటు పడిపోతారు. కానీ సీజన్‌తో సంబంధం లేకుండా, ఉదయాన్నే లేచి స్నానం చేయడం చాలా అవసరం. అది కూడా చల్లటి నీటితో స్నానం చేస్తే ఎన్నో విధాలుగా మేలు కలుగుతుందంటున్నారు నిపుణులు. స్నానం చేయడం వలన శరీరం శుభ్రం అవడమే కాకుండా, అది కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, శరీరం నుండి విషాన్ని తొలగిస్తుంది, ఆందోళనను తగ్గిస్తుంది. చలికాలంలో చల్లటి నీటితో స్నానం చేయడం వేడి నీళ్లతో చేసిన దాని కంటే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. వ్యక్తిగతంగా అనేక సమస్యలను పరిష్కరించుకోవడానికి అది సహాయపడుతుంది.
మెరుగైన రక్త ప్రసరణ
శరీరంపై పడే చల్లని నీటి జల్లులు మిమ్మల్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచేలా చేస్తాయి. రక్తాన్ని వివిధ అవయవాలకు తరలించేలా చేస్తాయి. అదే వేడినీటితో చేసినపుడు ఈ ప్రభావం రివర్స్ ఉంటుంది. అంటే పైన చర్మం వెచ్చని అనుభూతి పొందినప్పటికీ, రక్తం చర్మం ఉపరితలం వైపు కదులుతుంది. ఇది చల్లని షవర్ ప్రభావాన్ని తిప్పికొడుతుంది. అదే చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ధమనులు బలంగా తయారవుతాయి, రక్తపోటు తగ్గుతుంది. అందువలన, మీరు ఫిట్‌గా ఉండాలంటే చల్లటినీటితో స్నానం చేయడం ఉత్తమం.
చర్మం ఆరోగ్యానికి బెటర్
చలికాలంలో వేడి నీటి స్నానం చేస్తే చర్మం పొడిబారుతుంది. చర్మంపై మొటిమలు, దద్దుర్లు కూడా ఏర్పడతాయి. చుండ్రు సమస్యలతో కూడా ఇబ్బందిపడతారు. చల్లటి నీళ్లతో స్నానం క్యూటికల్స్ చర్మంపై రంధ్రాలను బిగిస్తుంది. చర్మం, స్కాల్ప్‌లోని రంధ్రాలను కూడా మూసివేస్తుంది, ఇలా మురికి చేరకుండా అడ్డుకుంటుంది. అందువల్ల, సహజ నూనెలు చర్మం నుండి బయటకు వెళ్లవు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
చల్లని నీరు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. చల్లటి నీటితో స్నానం చేస్తే, తెల్ల రక్త కణాల శాతం పెరుగుతుంది, జీవక్రియ రేటు మెరుగవుతుంది. చల్లటి నీళ్ల స్నానంతో శరీరం దానంతటదే వేడెక్కడానికి ప్రయత్నిస్తుంది, ఆ ప్రక్రియలో తెల్ల రక్త కణాలను విడుదల చేస్తుంది. ఇలా రోగనిరోధక వ్యవస్థను సక్రియం చేస్తుంది.
కండరాల నొప్పి నుంచి ఉపశమనం
కండరాలు పట్టుకుంటే చల్లటి నీళ్లతో స్నానం చేయడం ద్వారా వేగంగా కండరాలను పూర్వస్థితికి తీసుకురావచ్చు. కండరాల నొప్పిని అధిగమించడానికి చల్లని జల్లులు సహాయపడతాయి.
చల్లటి నీళ్లతో స్నానం ఎవరు చేయకూడదు
వేడినీళ్ల తో పోలిస్తే చల్లటి నీళ్ల స్నానం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికి కొంతమంది మాత్రం చల్లటి నీళ్లతో స్నానం చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎవరికైనా రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే, చల్లటి నీటితో స్నానం చేయడం మంచిది కాదు. చల్లటి నీటితో జలుబు, దగ్గు, న్యుమోనియా, గొంతులో చికాకు, జ్వరం వంటి అనేక ఆనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, చల్లటి నీటిని ఎంచుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ఉన్నవారు చల్లటి నీళ్లతో స్నానాన్ని చేయకూడదు. జ్వరం, గుండె జబ్బులు లేదా అధిక రక్తపోటు ఉన్నట్లయితే, చల్లటి నీటితో స్నానం చేయకూడదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..