Coconut Oil Benefits: శీతాకాలంలో కొబ్బరినూనెతో ఎన్నో బెనిఫిట్స్.. తెలుసుకుంటే మీరు ఉపయోగించకుండా ఉండరు..
ఇటీవల కాలంలో చాలా మంది జుట్టుకు కొబ్బరి నూనె పెట్టుకోవడం తగ్గించేశారు. కొబ్బరినూనె బదులు అనేక క్రీములు, హెయిర్ జెల్స్ వంటివి వాడుతున్నారు. కొబ్బరినూనె రాసుకుంటే జిడ్డుగా ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది కోకోనట్..
ఇటీవల కాలంలో చాలా మంది జుట్టుకు కొబ్బరి నూనె పెట్టుకోవడం తగ్గించేశారు. కొబ్బరినూనె బదులు అనేక క్రీములు, హెయిర్ జెల్స్ వంటివి వాడుతున్నారు. కొబ్బరినూనె రాసుకుంటే జిడ్డుగా ఉంటుందనే ఉద్దేశంతో చాలా మంది కోకోనట్ ఆయిల్ ను ఉపయోగించడానికి ఇష్టపడరు. కాని దీని బెనిఫిట్స్ తెలిసిన వాళ్లు లేదా ఇంట్లో పెద్ద వాళ్లు మాత్రం తప్పకుండా కొబ్బరినూనెను ఉపయోగిస్తారు. కొబ్బరినూనెను జుట్టుకు, శరీరానికి రాసుకుంటారని మనందరికి తెలుసు. కాని చాలా మంది వంటల్లో కూడా కొబ్బరి నూనె ఉపయోగిస్తారు. కేరళ ప్రాంతంలో అయితే దాదాపు ఎక్కువ మంది వంటల్లో కూడా కొబ్బరినూనెను ఉపయోగిస్తారు. దీనిలో ఉండే అనేక ప్రయోజనాలే వంటల్లో కూడా కొబ్బరి నూనె వాడటానికి ప్రధాన కారణం. కొబ్బరినూనె కేవలం జుట్టు పెరుగుదలకే కాకుండా, చర్మ సంరక్షణకు కూడా సహాయ పడుతుంది. కొబ్బరిని ఆరోగ్యానికి జీవితరేఖగా కూడా పేర్కొంటారు. కొబ్బరిని నూనె చేసుకోవడమే కాకుండా నేరుగా తినవచ్చు, కొబ్బరినీళ్లను తాగవచ్చు, కొబ్బరినూనెను వంటలకు వాడవచ్చు, అలాగే తలకు నూనెగా వాడవచ్చు. ఈ శీతాకాలంలో కొబ్బరినూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ సంరక్షణకు కొబ్బరి నూనె ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం.
కొబ్బరినూనెలో సంతృప్త కొవ్వు..
అసంతృప్త కొవ్వుల వలె కాకుండా, కొబ్బరి నూనె శరీరంలో వైద్యానికి సహాయపడే ఆరోగ్యకరమైన సంతృప్త కొవ్వు. కొబ్బరి నూనెలో 80% పైగా సంతృప్త కొవ్వు ఉంటుంది. అందుకే వంటల్లో కొబ్బరినూనెను ఉపయోగించడం వల్ల ఎటువంటి నష్టం ఉండదు. ఇది రాసుకుంటే చర్మం పొడిబారకుండా నిగనిగలాడుతూ ఉంటుంది.
బరువు తగ్గడానికి..
కొబ్బరినూనె యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గించడం వల్ల థైరాయిడ్ సమస్యను తగ్గిస్తుంది. కొబ్బరినూనెలోని యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ గుణాల వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
రక్తంలో చక్కెరను మెరుగుపరుస్తుంది..
కొబ్బరి నూనెలో మీడియం-చైన్ ట్రైగ్లిజరైడ్స్ మంచి మోతాదులో ఉంటాయి. ఇవి గ్లూకోస్ టాలరెన్స్‌ను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఎందుకంటే ఇవి జీర్ణాశయం నుండి నేరుగా కాలేయంలోకి వెళతాయి, వీటిని విచ్ఛిన్నం చేయడానికి వ్యవస్త్థకు శ్రమ అవసరం లేదు. అవి ఇతర రకాల కొవ్వుల వలె శరీరంలో నిల్వ ఉండకుండా నేరు శక్తి కోసం వినియోగించబడతాయి.
ఇన్ఫెక్షన్‌లతో పోరాడుతుంది..
కొబ్బరి నూనెలో లారిక్ యాసిడ్ ఉంటుంది. శరీరం లారిక్ యాసిడ్‌ను మోనోలారిన్‌గా మారుస్తుంది, ఇది యాంటీమైక్రోబయల్ గుణాన్ని కలిగి ఉంటుంది, శరీరంలో వృద్ధి చెందే బాక్టీరియాను చంపివేస్తుంది.
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది..
కొబ్బరి నూనె కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, కొబ్బరి నూనెను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్‌ను ప్రెగ్నెనోలోన్, ప్రొజెస్టెరాన్‌గా మార్చుతుంది. ఈ క్రమంలో అధిక కొలెస్ట్రాల్‌ను సాధారణ స్థాయికి తగ్గిస్తుంది.
కొబ్బరినూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉడంటంతో పాటు.. ఓ విధంగా ఇదొక మెడిసన్ గా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. కొబ్బరిని ఎక్కువుగా తినడం వల్ల దగ్గు వచ్చే అవకాశం ఉండొచ్చు.. కాని కొబ్బరినూనెను రాసుకోవడం, వంటల్లో ఉపయోగించడం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు, ఇబ్బందులు ఉండవు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..