China: జీరో కోవిడ్ పాలసీపై చైనీయుల వినూత్న నిరసన.. బప్పీలహరి సాంగ్ తో అడుక్కుంటున్న డ్రాగన్స్. వీడియో వైరల్
చాలా ప్రాంతాల్లో ప్రజలు కఠినమైన కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ పౌరుల ప్రదర్శనలో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు.. బప్పి లాహిరి పాటలను ఉపయోగిస్తున్నారు.
చైనా లో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచవ్యాప్తంగా విలయం సృష్టించినా.. ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. అయితే డ్రాగన్ కంట్రీలో మాత్రం మళ్ళీ కోవిడ్ విజృంభిస్తోంది. క్రమ క్రమంగా ఆ దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం జీరో కోవిడ్ విధానం అమలు చేయడానికి అనేక చర్యలు తీసుకుంటుంది. బీజింగ్ సహా అనేక ప్రాంతాల్లో లాక్ డౌన్ విధించడమే కాదు.. కోవిడ్ పేషెంట్లు కనిపించే ప్రాంతాల్లో లాక్ డౌన్, కరోనా వ్యాప్తి నివారణ చర్యలు చేపడుతోంది. అయితే చైనా పౌరులు ప్రభుత్వం చేపట్టిన కఠినమైన ‘జీరో కోవిడ్ పాలసీ’తో విసిగిపోయారు. అంతేకాదు దానిని వ్యతిరేకిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ప్రజలు కఠినమైన కోవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ పౌరుల ప్రదర్శనలో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు.. బప్పి లాహిరి పాటలను ఉపయోగిస్తున్నారు.
చైనా ప్రజలు కఠినమైన ఆంక్షలకు వ్యతిరేకంగా తమ ప్రదర్శనలలో 1982లో రిలీజైన సూపర్ హిట్ సినిమా ‘డిస్కో డాన్సర్’లో సాంగ్ ను ఉపయోగిస్తున్నారు. బప్పి లాహిరి సంగీతం అందించగా..పార్వర్తి ఖాన్ పాడిన ‘జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా’ పాటను పాడుతూ చైనీయులు జీరో కోవిడ్ విధానానికి తమ వ్యక్తిరేకతను తెలియజేస్తున్నారు. ‘జిమ్మీ, జిమ్మీ’ పాటను చైనా సోషల్ మీడియా సైట్ ‘డౌయిన్’ (టిక్‌టాక్ చైనీస్ పేరు)లో మాండరిన్ భాషలో పాడుతున్నారు. ‘జీ మీ, జీ మీ’ అని చైనాలోకి అనువదిస్తే.. ‘నాకు అన్నం పెట్టండి, నాకు అన్నం పెట్టండి’ అని అర్థం. లాక్ డౌన్ సమయంలో తాము ఆహార కొరతను ఎదుర్కొంటున్నామని.. పరిస్థితి దారుణంగా ఉందని తెలియజేసే విధంగా ప్రజలు ఖాళీ పాత్రలను చూపిస్తూ తమ దారుణమైన పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారు.
Locked down Chinese signing Jie Mi (give me rice)!#JieMi #CovidIsNotOver #GiveMeRice #JimmyJimmy#China #Lockdown #COVID19 #DiscoDancer pic.twitter.com/IFSM7LsmhV
— Durgesh Dwivedi ✍? ?????? (@durgeshdwivedi) October 31, 2022
భారతీయ చలనచిత్రాలను చైనీయులు ఆదరిస్తారు. 1950-60లో రాజ్ కపూర్ సినిమాలు అత్యంత ప్రజాదరణ పొందగా.. ‘3 ఇడియట్స్’, ‘సీక్రెట్ సూపర్ స్టార్’, ‘దంగల్’ , అంధాధున్’ బాహుబలి వంటి అనేక చిత్రాల చైనా ప్రేక్షకులకు నచ్చాయి.
కఠినమైన కోవిడ్ ఆంక్షలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు: చైనీయులు ‘జిమీ, జిమీ’ని ఉపయోగించి తమ నిరసన అద్భుతంగా తెలియజేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. జీరో కోవిడ్ విధానం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దీని ద్వారా తెలియజేస్తున్నారు. చైనాలో జీరో-కోవిడ్ విధానంలో భాగంగా షాంఘైతో సహా డజన్ల కొద్దీ నగరాల్లో పూర్తి లాక్‌డౌన్ విధించారు. ప్రజలు అనేక రోజులుగా ఇళ్లలకే పరిమితమయ్యారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..