AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga: 2023లో ఆసియాలో అణు విస్పోటనం నుంచి బయోవార్ వరకూ అనేక దుర్ఘటనలు.. భయపెడుతున్న బాబా వెంగా భవిష్యవాణి

ఆమె చెప్పిన చాలా విషయాలు ఇప్పటివరకు చాలాసార్లు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలో 2023లో జరగబోయే ఐదు సంఘటనలకు సంబంధించిన ఆమె జ్యోతిష్యం ఆందోళనలు రేకెత్తిస్తోంది.

Baba Vanga: 2023లో ఆసియాలో అణు విస్పోటనం నుంచి బయోవార్ వరకూ అనేక దుర్ఘటనలు.. భయపెడుతున్న బాబా వెంగా భవిష్యవాణి
Baba Vanga's Prediction for 2023
Surya Kala
|

Updated on: Nov 01, 2022 | 11:40 AM

Share

కొత్త ఏడాదిలో ఏం జరుగబోతోంది? ప్రపంచం అల్లకల్లోలంగా మారుతుందా? సౌర తుఫాన్‌ల దాడితో భూగోళం అంతమువుతుందా? పుతిన్‌, బైడెన్‌ల కథ ముగుస్తుందా? సునామీల సంఖ్య మరింత పెరుగుతుందా? యూరప్‌లో ఉగ్రదాడులు నిత్యకృత్యం అవుతాయా? జీవ ఆయుధాలు మానవాళిని కభలిస్తాయా? ఈ ప్రశ్నలకు ఎప్పుడో సమాధానం చెప్పారు బాబా వెంగా. 2023లో ఏం జరుగబోతుందో ఆమె ముందే ఊహించారు. ఇప్పటివరకు ఆమె జోస్యం చాలా వరకు కరెక్టయ్యింది. వచ్చే ఏడాది కూడా అదే జరుగుతుందని బాబా వెంగా శిష్యులు ఢంకా భజాయించి చెబుతున్నారు. కొత్త ఏడాది వస్తోంది. న్యూ ఇయర్‌లో ఏం జరుగుతుందోనన్న విషయంపై చాలా మంది చాలా రకాలుగా ఊహించుకుంటారు. కాని బల్గేరియాకు చెందిన బాబా వెంగా 2023లో ఏం జరుగుతుందో ముందే చెప్పేశారు. అందులో ఎన్ని నిజమవుతాయో వేచి చూడాలి. కాని ఆమె చెప్పిన చాలా విషయాలు ఇప్పటివరకు చాలాసార్లు నిజమయ్యాయి. ఈ నేపథ్యంలో 2023లో జరగబోయే ఐదు సంఘటనలకు సంబంధించిన ఆమె జ్యోతిష్యం ఆందోళనలు రేకెత్తిస్తోంది.

  1.   2023 గురించి చాలా సంచలన విషయాలు వెల్లడించారు. యూరప్‌లో రసాయన దాడులు పెరుగుతాయని చెప్పారు. ప్రపంచదేశాలు మతపరమైన అల్లర్లతో అట్టుడికిపోతాయని హెచ్చరించారు. భారత్‌ కూడా ఇందుకు మినహాయింపు కాదని తెలిపారు. కాకపోతే 2023లో భారత్‌, చైనాలు అన్నిరంగాల్లో మరింత శక్తివంతమవుతాయని జోస్యం చెప్పారు.
  2. వచ్చే ఏడాది ఆసియాలో సౌరతుఫాన్‌లు, అణు విస్ఫోటనాలు చోటు చేసుకుంటాయని బంగా వంగా అంచనా వేశారు. బాబా వంగా ప్రకారం, 2023 సంవత్సరంలో సౌర తుఫాను లేదా సౌర సునామీ సంభవిస్తుంది, ఇది భూగ్రహం యొక్క అయస్కాంత కవచాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది.
  3. బాబా వంగా అంచనాల ప్రకారం, ఒక పెద్ద దేశం జీవ ఆయుధాలతో ప్రజలపై దాడి చేస్తుంది. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొత్తం ప్రపంచానికి ముప్పుగా మారింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాలను ఉపయోగిస్తామని అనేకసార్లు బెదిరించారు.
  4. న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో పేలుడు సంభవించవచ్చు, దీని కారణంగా విషపూరిత మేఘాలు ఆసియా ఖండాన్ని కప్పివేస్తాయి, ఫలితంగా చాలా దేశాలు తీవ్రమైన వ్యాధుల బారిన పడతాయి. బాబా వంగా ప్రకారం, 2023 సంవత్సరంలో ప్రపంచం మొత్తం అంధకారంలో ఉంటుంది. గ్రహాంతర వాసులు భూమిపై దాడి చేయవచ్చు, లక్షలాది మంది ప్రజలు చనిపోతారు.
  5. ఇవి కూడా చదవండి
  6. 2023 నాటికి మనుషులు ప్రయోగశాలల్లో పుడతారని బాబా వంగా అంచనా వేశారు. ల్యాబ్‌ల నుంచే వ్యక్తుల పాత్ర, వారి చర్మం రంగు నిర్ణయించబడుతుంది. అంటే జనన ప్రక్రియ పూర్తిగా నియంత్రించబడుతుందని అంచనా వేశారు.

బాబా వెంగా 1996 లోనే చనిపోయారు. కాని భవిష్యత్‌ లో ఏం జరుగబోతుందన్న విషయంపై ఆమె శిష్యులకు చెప్పారు. బాబా వెంగా భవిష్యవాణి ఇప్పటికి పుస్తకరూపంలో ఉంది. ఇది చాలాసార్లు నిజమవుతోంది. 12 ఏళ్ల వయస్సు లోనే బాబా వెంగా తన కంటిచూపును కోల్పోయారు. కాని కంటి చూపు లేనప్పటికి తన ముందు నిల్చున్న వ్యక్తి జాతకాన్ని చాలా సులభంగా చెప్పేసేవారు. అందుకే బాల్కన్‌ దేశాల్లో ఆమెను దేవతగా ఆరాధిస్తారు.

అమెరికాపై సెప్టెంబర్‌ ఎలెవన్‌ దాడులను బాబా వెంగా ముందే ఊహించారు. అల్‌ఖైదా ట్విన్‌ టవర్స్‌పై దాడి చేస్తుందని ఆమె చెప్పిన మాట ముమ్మాటికి నిజమయ్యింది. బ్రెగ్జిట్‌ విషయంలో కూడా ఆమె చెప్పిదే కరెక్టయ్యింది. యూరోపియన్‌ యూనియన్‌ విచ్చిన్నం అవుతుందని ఆమె చెప్పారు. నమ్మరుకాని ఆమె చెప్పిన జ్యోతిష్యంలో 85 శాతం నిజమయ్యాయి.

బాబా వెంగా కళ్లు కన్పించకపోయినప్పటికి జరగబోయే విషయాలను ఎలా పసిగట్టారు ? ఆమె దైవాంశ సంభూతురాలా ? లేక అతీంద్ర శక్తులు ఆమెకు ఉన్నాయా ? ఈవిషయం ఇప్పటికి కూడా పెద్ద మిస్టరీగా ఉంది. కాని జోస్యం చెప్పడంలో మాత్రం బాబా వెంగా చాలా పర్‌ఫెక్ట్‌. చర్నోబిల్ విపత్తు నుండి యువరాణి డయానా యొక్క విషాద మరణం వరకు – ఆమె చెప్పినట్టుగానే జరిగాయి. అందుకే బల్గేరియా ప్రజలు ఆమెను దైవదూతగా భావిస్తారు. ఖచ్చితంగా బాబా వెంగా చెప్పిందే నిజమవుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. బాబా వెంగా కొత్త సంవత్సరంలో చాలా ఉపద్రవాలు ముంచుకొస్తాయని ఏనాడో ఊహించారు. గతంతో పోలిస్తే ఈసారి జరగబోయే విషయాలు మాత్రం చాలా షాకింగ్‌గా ఉంటాయని అంటున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..