Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boy Friend: ప్రియురాలి నుంచి భరించలేని వాసన.. మూడేళ్లు భరించిన లవర్.. ఆపై అసలు విషయం తెలిసి ప్రియుడు షాక్‌!

‘తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆ ప్రేమలో తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియలేదన్నాడు. ఆమె సమీపానికి వెళ్లినప్పడు ఆమె వద్ద అప్పుడప్పుడూ ఒక రకమైన వాసన వచ్చేదని, మొదట్లో దాన్ని లైట్ తీసుకున్నా, రాను రాను ఆ వాసనను భరించలేకపోయనని రాసుకొచ్చాడు.

Boy Friend: ప్రియురాలి నుంచి భరించలేని వాసన.. మూడేళ్లు భరించిన లవర్.. ఆపై అసలు విషయం తెలిసి ప్రియుడు షాక్‌!
man-finds-out-his-partner Secret
Follow us
Surya Kala

|

Updated on: Oct 31, 2022 | 11:13 AM

యువతీ యువకులు ప్రేమలో ఉన్నప్పుడు పరస్పరం వారి ఇష్టాలు, అలవాట్లు గురించి తెలుసుకోవడం సహజం. ఈక్రమంలో ప్రియుడికి నచ్చే విధంగా ఉండాలని ప్రియురాలు, తన ప్రేయసిని సంతోషపెట్టాలని ప్రియుడు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో ఓ యువకుడికి తను ప్రేమించిన అమ్మాయికి సంబంధించి ఓ భయంకరమైన అలవాటు గురించి తెలిసి షాకయ్యాడు. మూడేళ్ల పాటు భరించాడు. ఆఖరికి తనవల్ల కాదనుకున్న అతడు తన బాధను సోషల్‌ మీడియాలో వెళ్లబోసుకున్నాడు.

తనకు ఎదురైన అనుభవాన్ని ఇంటర్నెట్‌ద్వారా పంచుకున్న అతను.. ‘తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, ఆ ప్రేమలో తాను ఏం చేస్తున్నాడో తనకే తెలియలేదన్నాడు. ఆమె సమీపానికి వెళ్లినప్పడు ఆమె వద్ద అప్పుడప్పుడూ ఒక రకమైన వాసన వచ్చేదని, మొదట్లో దాన్ని లైట్ తీసుకున్నా, రాను రాను ఆ వాసనను భరించలేకపోయనని రాసుకొచ్చాడు. తన వద్ద ఆ వాసన ఎందుకు వస్తోందో తెలుసుకోడానికి చాలా ప్రయత్నించానని, ఈ క్రమంలోనే ఆమె తరచూ స్నానం చేయదని తెలుసుకుని షాకయ్యానని తెలిపాడు. ఆమె 15 రోజులకు ఒకసారికూడా స్నానం చేయడం అరుదేనని, మూడేళ్లు తనతో కలిసి ఉన్న తాను నిజం తెలిసాక ఆ వాసనను భరించలేకపోయానని తన గోడును వెళ్లబోసుకున్నాడు. ‘ఆమెతో సాన్నిహిత్యం పెరిగాక.. ఆ వాసన ఎక్కువ వచ్చేది. కొన్ని నెలలు గడిచాక ఆ వాసన భరించలేకపోయా. ఆమెతో కలిసి పడక మీద పడుకోలేకపోయా. ఆ తర్వాత ఈ విషయం గురించి తాను పడుతున్న ఇబ్బంది గురించి ఆమె వద్ద ప్రస్తావించేసరికి ఆమె బాగా మనస్తాపానికి గురైందని, ఆ తర్వాత ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగిందని తెలిపాడు. దీనిని బట్టి వారి ప్రేమప్రయాణం ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై కొందరు నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు. నేను రోజుకు రెండుసార్లు స్నానం చేస్తానని ఒకరంటే, ‘ఆమెకు పరిశుభ్రత అసలు సమస్యేమో!’ అంటూ మరో వ్యక్తి సెటైర్ వేశారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి