Color Changing Dress: ఈ అమ్మాయి డ్రెస్ ఉసరవెల్లిని మించిపోయిందిగా.. సూర్యుడిని చూస్తే చాలు రంగులు మార్చేస్తుంది..
ఆ మహిళ ఇంటి నుంచి బయటకు ఎండ వేడికి వచ్చింది. ఇలా ఆమె ఎండలోకి రాగానే తెల్లగా స్వచ్ఛంగా ఉన్న దుస్తులు.. వెంటనే లేలేత గులాబీ రంగులోకి మారాయి.
కాలానికి అనుగుణంగా ధరించే దుస్తుల ట్రెండ్ మారుతోంది. యువత అభిరుచికి అనుగుణంగా బట్టలకు సరికొత్త హంగులను అద్దుతున్నారు.. ఫ్యాషన్ రంగంలో సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నారు. పాత బట్టలకు సైతం సరికొత్త లుక్ ఇస్తూ.. వావ్ అనిపించేలా చేస్తున్నారు. అయితే ప్రకృతికి పరిస్థితికి అనుగుణంగా ఊసరవెల్లి రంగులు మార్చుకున్నట్లు.. ఇప్పుడు అమ్మాయి ధరించిన డ్రెస్ కూడా తన రంగుని మార్చుకొంటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఫ్యాషన్ ట్రెండ్‌లో భాగంగా సూర్యుని క్రింద రంగు మారుతున్న దుస్తుల వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
ఇంటర్నెట్ యూజర్ @izzipoopi ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రోజుల క్రితం ఈ వీడియో క్లిప్‌ను షేర్ చేశారు. వీడియోలో.. ఓ యువతి తెల్లటి దుస్తులు ధరించి ఉంది. “గైస్, రంగు మారుతున్న నా స్కర్ట్ గుర్తుందా? ఇది రంగును కూడా మారుస్తుంది” అని తన దుస్తులను చూపిస్తూ కనిపించింది. ఆ మహిళ ఇంటి నుంచి బయటకు ఎండ వేడికి వచ్చింది. ఇలా ఆమె ఎండలోకి రాగానే తెల్లగా స్వచ్ఛంగా ఉన్న దుస్తులు.. వెంటనే లేలేత గులాబీ రంగులోకి మారాయి. అయితే ఇలా గులాబీ రంగులోకి మారిన దుస్తుల రంగు.. ఎక్కువ సమయం ఉందని కూడా చెప్పింది ఆ మహిళ.
సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్‌లో తుఫానుగా మారింది. ఇది 24 మిలియన్లకు పైగా వీక్షణలను మరియు 2 మిలియన్లకు పైగా లైక్‌లను సంపాదించింది. సూర్యకాంతి కింద తెల్లటి దుస్తులు ఎంత వేగంగా రంగును మార్చుకుంటున్నాయో అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది నేను చూసిన చక్కని విషయం!!!” ఒకరు.. “వావ్ ఇది అక్షరాలా చాలా అద్భుతమైనది,” మరొకరు అన్నారు.”వాహ్, నేను ఇంత చక్కటి రంగును ఊహించలేదు,” అని వ్యాఖ్యానించగా.. మరొకరు ఇది పిచ్చి అంటూ కామెంట్ చేశారు.
రంగులు మారుస్తున్న దుస్తులు
View this post on Instagram
అయితే ఆ మహిళ తాను ధరించిన దుస్తులను దేనితో తయారు చేశారో మాత్రం వెల్లడించలేదు. కొందరు.. ఇలా రంగులు మార్చడం వెనుక శాస్త్రీయ కోణంలో వివరించడానికి ప్రయత్నించారు. ఇలా “హైపర్‌కలర్ షర్టుల రంగు మార్పు రెండు రంగుల కలయికపై ఆధారపడి ఉంటుంది.. రంగు వేసిన బట్ట రంగు స్థిరంగా ఉంటుంది.. అయితే థర్మోక్రోమిక్ డై రంగు” రంగు మారుస్తుందని వివరించడానికి ప్రయత్నించారు. ఇలాంటి రంగులు ఉష్ణోగ్రత-సెన్సిటివ్ సమ్మేళనాలు, ఇవి 1970లలో అభివృద్ధి చేయబడ్డాయని పేర్కొన్నారు. వేడి తగలడంతో తాత్కాలికంగా రంగును మార్చే ఈ ఫాబ్రిక్ రంగుల మిశ్రమంతో దుస్తులు తయారు చేయబడి ఉండవచ్చని చెబుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..