No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. అసలు సంగతి ఎంటంటే..
జీవితంలో వివాహం అంటే అదో మధురానుభూతి.. ప్రతి ఒక్కరూ తమ స్థాయిని బట్టి తమ పెళ్లిని గ్రాండ్ గా సెల్రేబట్ చేసుకుంటారు. ఎందుకంటే వైవాహిక బంధం ఎంతో విలువైనది. అదే ధనవంతులైతే తమ పెళ్లి ఎప్పటికి..
జీవితంలో వివాహం అంటే అదో మధురానుభూతి.. ప్రతి ఒక్కరూ తమ స్థాయిని బట్టి తమ పెళ్లిని గ్రాండ్ గా సెల్రేబట్ చేసుకుంటారు. ఎందుకంటే వైవాహిక బంధం ఎంతో విలువైనది. అదే ధనవంతులైతే తమ పెళ్లి ఎప్పటికి గుర్తుండిపోయేలా చేసుకుంటూ ఉంటారు. పెళ్లి చేసుకునే ప్రదేశం కూడా ఎంతో ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటారు. ఇలా ఉన్నతస్థాయి వ్యక్తులు వివాహాలు జరిగే ప్రదేశంగా ఇంగ్లండ్‌లోని ఉత్తర నార్ఫోక్‌లోని ఆక్స్‌నీడ్ హాల్ ప్రసిద్ధి చెందింది. ధనిక కుటుంబాలకు చెందినవారి వివాహలు లేదా ఇతర శుభకార్యాలు ఆక్స్‌నీడ్ హాల్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. కరోనా మహమ్మారి సమయంలోనూ ఈ ప్రదేశంలో వివాహ వేడుకలు, పార్టీలు అధికమయ్యాయి. దీంతో ఈ హాలులో జరుగుతున్న వేడుకలు స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. దీంతో అక్కడ ఉండే గ్రామస్తులంతా ఈ గార్డెన్‌లోకి వధువరులకు ప్రవేశం లేదు, ఇక్కడ వివాహలు చేసుకునేందుకు అనుమతి లేదు అనే బోర్డులు పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. బ్రిటన్‌లో ఆక్స్‌నీడ్ హాల్ 16వ శతాబ్ద కాలంనాటి చారిత్రక ఎస్టేట్‌గా ప్రసిద్ధిగాంచింది. అయితూ ఇక్కడ వివాహానికి విచ్చేసిన అతిధులు ఆ వెడ్డింగ్ హాల్ గ్రాండ్ ఎస్టేట్ చుట్టూ ఉన్న 500 ఎకరాల పోలాలను నాశనం చేస్తున్నారని, పైగా విపరీతమై మ్యూజిక్ పెట్టి చుట్టుపక్కలవాళ్లను ఇబ్బందులకు గురిచేయడంతో అక్కడ ఉండే గ్రామస్తులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వధువరులకు, జంటలకు ఆహ్వానం లేదు అని ఆ ఎస్టేట్ ముందు బోర్డులు సైతం పెట్టి తమ నిరసన వ్యక్తం చేశారు.
వివాహాలు, వేడుకల కారణంగా ఈ సుందరమైన సమాజంలోని స్థానికుల జీవితాన్ని దుర్భరం చేశాయని, వివాహ అతిథులు తమ తోటలలో మూత్ర విసర్జన చేయడం ద్వారా వాటిని నాశనం చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో తమ ప్రత్యేక రోజును ఈ గ్రాండ్ ఎస్టేట్‌లో గడపాలని యోచిస్తున్న వధూవరులకు స్వాగతం లేదు అని హెచ్చరిక సంకేతాలను పోస్ట్ చేశారు గ్రామస్తులు.
ఉత్తర నార్ఫోక్‌లోని ఆక్స్‌నీడ్ హాల్ 16వ శతాబ్దానికి చెందినది. ఇక్కడ గత కొంత కాలం వరకు తక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు జరిగేవి. అయితే కరోనా వల్ల తలెత్తిన ఆర్థిక మాంద్యం నుంచి కోలుకునేందుకు అపరిమిత సంఖ్యలో పెళ్లిళ్లు, వేడుకలకు స్థానిక పాలక మండలి అనుమతించింది. దీంతో లెక్కకు మించి పెళ్లిళ్లు, వేడుకలు ఇక్కడ జరుగుతున్నాయి. దీంతో ఈ వేడుకల కారణంగా స్థానికులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ ఎస్టేట్ పక్కనే 500 ఎకరాల ఫార్మ్ కలిగిన సుసి, రోజర్ క్రేన్ ఈ పెళ్లిళ్లు, వేడుకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ జీవితంపై ఇవి ప్రభావం చూపుతున్నాయని వారు వాపోతున్నారు. పెళ్లికి వచ్చే అతిథులు తమ తోటల్లో తిరుగుతూ మూత్ర విసర్జన చేసి వాటిని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. వేడుకల సమయంలో మ్యూజిక్ వల్ల రాత్రి వేళ తమకు నిద్రపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక ఇక్కడ పెళ్లిళ్లు చేసుకోవద్దంటూ కారు పార్కింగ్ సమీపంలో మూడు బోర్డులను ఏర్పాటు చేశారు. తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆబోర్డుల్లో పేర్కొన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..