Vastu Tips: ఈ వాస్తు దోషాలు ఉన్న ఇంట్లో లక్ష్మి నివాసం ఉండదట .. పరిహార నియమాలు ఏమిటో తెలుసా..

వాస్తు ప్రకారం, కొత్త ఇల్లు కట్టేటప్పుడు లేదా  ఇంట్లో వస్తువులను ఉంచే సమయంలో ప్రతి దిశకు సంబంధించిన వాస్తు నియమాలను పాటించాలి. ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువుకు ఒక శక్తి ఉంటుంది. ఇది వ్యక్తిని సానుకూల, ప్రతికూల మార్గాల్లో ప్రభావితం చేస్తుంది.

Vastu Tips: ఈ వాస్తు దోషాలు ఉన్న ఇంట్లో లక్ష్మి నివాసం ఉండదట .. పరిహార నియమాలు ఏమిటో తెలుసా..
Vastu Tips In Telugu
Follow us
Surya Kala

|

Updated on: Oct 29, 2022 | 12:25 PM

సనాతన హిందూ ధర్మంలో వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు. లక్ష్మి దేవి సంపద దేవతగా పరిగణించబడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఆ ఇంట్లో సిరిసంపదలు కొలువుతాయని విశ్వాసం. మిమ్మల్ని విజయపథంలో నడిపించాలంటే.. పూజ మాత్రమే కాదు, ధనం పొందడంలో వాస్తు శాస్త్రం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ ఇంటి వాస్తు సరిగ్గా ఉంటే, లక్ష్మిదేవి ప్రసన్నురాలై ప్రత్యేక అనుగ్రహాన్ని ఇస్తుందని నమ్మకం. వాస్తు ప్రకారం, కొత్త ఇల్లు కట్టేటప్పుడు లేదా  ఇంట్లో వస్తువులను ఉంచే సమయంలో ప్రతి దిశకు సంబంధించిన వాస్తు నియమాలను పాటించాలి. ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువుకు ఒక శక్తి ఉంటుంది. ఇది వ్యక్తిని సానుకూల, ప్రతికూల మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే, మీరు చేసే పని కూడా చెడిపోతుందని నమ్ముతారు. వాస్తుకు సంబంధించిన కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం.

  1. వాస్తు ప్రకారం, ఇంట్లో అతి ముఖ్యమైన భాగం ఇంటి ప్రధాన ద్వారం. ఇంటి సానుకూల శక్తిని కాపాడుకోవడానికి.. ఇంటి తలుపులను లోపలికి  తెరచే విధంగా ఏర్పాటు చేసుకోండి. ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం. మీరు కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నట్లయితే, ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం వైపు ఉండేలా చూసుకోండి. ఆనందం, శ్రేయస్సు , అదృష్టం కోసం మీ ప్రధాన తలుపును ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి.
  2. ఇంట్లో ఫర్నిచర్ ఉంచేటప్పుడు, అది ఎల్లప్పుడూ సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి. తేలికపాటి ఫర్నిచర్‌ను ఉత్తరం లేదా తూర్పు దిశలో..  భారీ ఫర్నిచర్‌ను దక్షిణం లేదా పడమర దిశలో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ ఫర్నీచర్ తీసుకునే ట్రెండ్ నడుస్తోంది. అయితే ప్లాస్టిక్ ఫర్నిచర్ వాస్తు ప్రకారం ఇంటి నెగటివిటీని పెంచుతుంది. ఎల్లప్పుడూ చెక్కతో చేసిన ఫర్నిచర్ కొనడానికి ప్రయత్నించండి.
  3. వాస్తు ప్రకారం, పైకప్పుపై  వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేస్తుంటే.. ఆ వాటర్ ట్యాంక్ ను ఎల్లప్పుడూ నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ఇది మీ ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుందని..  ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి ఏదో ఒక విధంగా ప్రయోజనం పొందుతారని నమ్మకం.
  4. ఇంట్లో ఆనందం, శ్రేయస్సు , శాంతి కోసం, పూజా స్థలాన్ని ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా పూజ చేసేటప్పుడు, మీ ముఖం ఈశాన్య దిశలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. వాస్తు ప్రకారం, మీ పూజా స్థలంలో మీ పూర్వీకుల ఫోటోను ఎప్పుడూ ఉంచవద్దు.
  5. ఇవి కూడా చదవండి
  6. వంటగదిని ఎల్లప్పుడూ ఇంటికి ఆగ్నేయంలో నిర్మించుకోవాలి. వంట చేసేటప్పుడు, మీ ముఖాన్ని ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మీరు వంటగదిలోని చెత్తను వంట చేసిన వెంటనే దానిని బయటకు విసిరేయండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో దరిద్రం ఉండదు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?