Nagula Chavithi: ఘనంగా నాగుల చవితి వేడుకలు.. పుట్టలో పాలు పోసేందుకు బారులు తీరిన భక్తులు..

అనేక ప్రాంతాల్లో ఘనంగా నాగులచవితిని జరుపుకుంటున్నారు. నాగుల చవితి సందర్భంగా భక్తులు పుట్టలలో పాలు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు. తెల్లవారి జమునుండే పుట్టలో పాలు పోసెందుకు భక్తులు క్యూ కట్టారు.

Nagula Chavithi: ఘనంగా నాగుల చవితి వేడుకలు.. పుట్టలో పాలు పోసేందుకు బారులు తీరిన భక్తులు..
Nagula Chavithi 1
Follow us

|

Updated on: Oct 29, 2022 | 9:23 AM

కార్తీక శుద్ధ చతుర్థి రోజుని తెలుగు ప్రజలు నాగుల చవితిగా జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి సందడి తెల్లవారు జామునుంచే మొదలైంది. చవితి సందర్భంగా భక్తులు పాము పుట్టలో పాలు పోయడానికి బారులు తీరారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో నాగుల చవితి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకుంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఘనంగా నాగులచవితిని జరుపుకుంటున్నారు. నాగుల చవితి సందర్భంగా భక్తులు పుట్టలలో పాలు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు. తెల్లవారి జమునుండే పుట్టలో పాలు పోసెందుకు భక్తులు క్యూ కట్టారు. జిల్లాలోని అంబాజీపేట, పి.గన్నవరం , అయినవిల్లి, అమలాపురం , అల్లవరం, రాజోలు, రాజమండ్రి, కాకినాడ పలు మండలలతోపాటు అనేక ప్రాంతాల్లో ఘనంగా నాగులచవితి వేడుకలను నిర్వహిస్తున్నారు.

మరోవైపు ఏపీలో ప్రముఖ క్షేత్రం అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవిలో వెంచేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు.  స్వామి పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయాధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.  తెల్లవారుజాము నుంచే పుట్టలో పాలు పోసేందుకు క్యూ లైన్ ల్లో భక్తులు వేచి ఉన్నారు. ఎమ్మెల్యే  సింహాద్రి రమేష్ బాబు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నాగుల చవితి రోజున పుట్ట దగ్గర కు వెళ్లి.. పచ్చి చలిమిడి, చిమిలి, ఆవు పాలు, పూలు, పళ్లు తీసుకుని వెళ్లారు. పాము పుట్టలో పాలు పోసి.. నాగదేవతను ఆరాధిస్తారు. కొంతమంది చిన్న పిల్లలు మతాబులు, కారపువ్వులు వంటివి వెలిగిస్తారు.

ఇవి కూడా చదవండి

దేశమంతట పలు దేవాలయల్లో నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోతాయని.. రాహు కుజ దోషాలు తొలగిపోతాయని.. పెండ్లి కావాల్సిన యువతులు నాగుల చవితిరోజున పుట్టలో పాలు పోస్తే.. త్వరగా పెళ్లి అవుతుందని నమ్మకం. సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, చెవి ,చర్మ వ్యాధులు తొలిగి, పరిపూర్ణ ఆరోగ్యవంతులవుతారనీ భక్తులు నమ్మకం

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..