Smiling Sun: భానుడు గురించి కవుల వర్ణన నిజమేనా.. సూర్యుడు నవ్వుతున్న ఫొటో నెట్టింట వైరల్

US అంతరిక్ష సంస్థ NASA సూర్యుడు చిరునవ్వుతో కనిపించే చిత్రాన్ని పంచుకుంది. సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలకు వెలుగులు అందించే సూర్యుడు నవ్వుతున్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది

Smiling Sun: భానుడు గురించి కవుల వర్ణన నిజమేనా.. సూర్యుడు నవ్వుతున్న ఫొటో నెట్టింట వైరల్
Sun Smiling Photo Viral
Follow us

|

Updated on: Oct 29, 2022 | 8:37 AM

సూర్యుడు చూస్తున్నాడు.. సూర్యుడు మనల్ని చూసి నవ్వుతున్నాడు”  అంటూ కొందరు కవులు తమ కల్పనతో అందంగా సూర్యుడి గురించి వర్ణించారు. అయితే కవుల వర్ణన.. అందమైన ఆలోచనలు అక్షరాలా నిజమయ్యాయి. ఎందుకంటే US అంతరిక్ష సంస్థ NASA సూర్యుడు చిరునవ్వుతో కనిపించే చిత్రాన్ని పంచుకుంది. సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలకు వెలుగులు అందించే సూర్యుడు నవ్వుతున్న ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. నవ్వడమంటే నిజంగా నవ్వేస్తున్నాడని కాదు. సూర్యుడిని అల్ట్రావయలెట్ కాంతిలో క్లిక్ మనిపిస్తే ఈ ఫొటో వచ్చింది. దీనిలో సూర్యుడిపై పక్కపక్కనే కళ్లు, నోరులా నల్లని ప్రాంతాలు కనిపించాయి. ఈ ఫొటో చూసిన ఎవరైనా సూర్యుడు నవ్వేస్తున్నాడనే అనుకుంటారు.

అయితే సూర్యుడి నుంచి వేగంగా సోలార్ వాయువులు అంతరిక్షంలోకి విడుదలయ్యే ప్రాంతాలు ఇలా నల్లగా కనిపిస్తున్నాయని పరిశోధకులు వివరించారు. వీటిని కరోనల్ రంధ్రాలు అంటారట. ఈ ఫొటోను నాసాకు చెందిన సన్, స్పేస్ అండ్ స్క్రీమ్ అనే ట్విట్టర్ ఖాతా పోస్టు చేసింది. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తూ ఈ ఫొటోను వైరల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles