Statue of Lord Shiva: శివయ్య భక్తులకు గుడ్ న్యూస్.. ప్రపంచంలోనే ఎత్తైన శివుడి విగ్రహం ఆవిష్కరణ..
దత్ పదం సంస్థాన్ స్థాపించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహంగా చెప్పబడుతుంది. ఈ విగ్రహాన్ని భక్తుల సందర్శనార్థం ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి , ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరారి తదితరుల సమక్షంలో ఆవిష్కరించనున్నారు.
కార్తీక మాసంలో భారీ శివయ్య విగ్రహం భక్తులకు శనివారం నుంచి దర్శనం ఇవ్వనుంది. రాజస్థాన్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలో అత్యంత ఎత్తైన భోళాశంకరుడు ప్రజలకు దర్శనం ఇవ్వనున్నారు. రాజ్‌సమంద్ జిల్లాలో ఏర్పాటు చేసిన 369 అడుగుల ఎత్తైన శివుడి విగ్రహాన్ని శనివారం భక్తుల దర్శనానికి తెరవనున్నారు. దత్ పదం సంస్థాన్ స్థాపించిన ఈ విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుని విగ్రహంగా చెప్పబడుతుంది. ఈ విగ్రహాన్ని భక్తుల సందర్శనార్థం ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి , ప్రముఖ ఆధ్యాత్మిక గురువు మొరారి తదితరుల సమక్షంలో ఆవిష్కరించనున్నారు.
రాజ్‌సమంద్ జిల్లాలోని నద్వారా పట్టణంలోని కొండపై ధ్యాన ముద్ర రూపంలో ఉన్న శివుని విగ్రహం ప్రతిష్టించారు. ఈ శిల్పం 20 కి.మీ. దూరం నుంచి కూడా కనిపించేలా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దత్ పదం సంస్థాన్ ట్రస్ట్ ట్రస్టీ, మిరాజ్ గ్రూప్ చైర్మన్ మదన్ పలివాల్ మాట్లాడుతూ.. ఈ ‘విశ్వ స్వరూప’ శివుని విగ్రహ ప్రతిష్ఠాపన సందర్భంగా నేటి (అక్టోబర్ 29) నుంచి నవంబర్ 6 వరకు పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఆధ్యాత్మిక గురువు మొరారిబాబుచే రామకతి పారాయణం కూడా జరగనుంది. అద్భుతంగా నిర్మించిన విగ్రహం రాజస్థాన్ ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త రూపాన్ని ఇచ్చిందని చెప్పారు.
ఫౌండేషన్ ప్రతినిధి జైప్రకాష్ మాలి మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహంలో ఎలివేటర్లు, మెట్లు, భక్తుల కోసం హాలు ఉన్నాయని తెలిపారు. నిర్మాణానికి 3,000 టన్నుల ఇనుము, ఉక్కు , 2.5 లక్షల క్యూబిక్ టన్నుల కాంక్రీటును ఉపయోగించారు. సుమారు 10 ఏళ్లుగా శ్రమించి శివయ్య భారీ విగ్రహ నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఈ విగ్రహం 250 ఏళ్లు ఉండేలా నిర్మించారు. అలాగే గంటకు 250 కి.మీ వేగంతో వీచే గాలులు వీచినా తట్టుకునే విధంగా ఈ విగ్రహాన్ని బలంగా నిర్మించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. విగ్రహం పరిసర ప్రాంతాలు కూడా పర్యాటకులను ఆకట్టుకునేలా ఉన్నాయని తెలిపారు. విగ్రహ ప్రాంగణంలో బంగీ జంపింగ్, గో-కార్ట్ తదితర వినోద, సాహస క్రీడల సదుపాయాలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..