Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chhath Puja: అక్కడ వింత సాంప్రదాయం.. మగవాళ్లే ఛట్ పూజలు చేస్తారు.. దీని వెనుక పెద్ద కథే ఉంది..

గ్రామంలో ఆడపిల్లల సంఖ్య తగ్గడం మొదలైంది. దీంతో తమ గ్రామంలోని ఆడపిల్లలను రక్షించడానికి ప్రజలు ప్రయత్నించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ గ్రామంలో ఆడపిల్లల మరణాలు ఆగడకపోవడంతో.. అప్పుడు గ్రామస్థలకు ఒక బాబా సలహా ఇచ్చారు.

Chhath Puja: అక్కడ వింత  సాంప్రదాయం.. మగవాళ్లే ఛట్ పూజలు చేస్తారు.. దీని వెనుక పెద్ద కథే ఉంది..
Chhath Puja
Follow us
Surya Kala

|

Updated on: Oct 29, 2022 | 1:38 PM

కార్తీకమాసంలో ఉత్తరాది వారు జరుపుకునే ముఖ్యమైన పండగ ఛట్ పూజ. ఈ పర్వదినాన్ని నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. సూర్యభగవానుడికి కృతజ్ఞతలు చెబుతూ.. తమకు ఆయురారోగ్యలను ప్రసాదించమని ప్రార్ధిస్తారు. పవిత్ర నదిలో పుణ్యస్నానం చేస్తారు. నీటిలో వీలైనంత ఎక్కువసేపు నిలబడి సూర్యభగవానుని ఆరాధిస్తారు. సూర్యభగవానుడికి పండ్లు, ఫలాలు ప్రసాదంగా సమర్పిస్తారు. అయితే ఈ ఛత్ పండుగ అతి  కష్టతరమైన పండుగగా పరిగణించబడుతుంది. ఈ పండుగలో 36 గంటల పాటు నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. ఎక్కువగా మహిళలు ఛత్ పండుగను నిర్వహిస్తారు. అయితే బీహార్‌లోని బంకాలో ఒక గ్రామంలో పురుషులు మాత్రమే ఛత్ ఉపవాసం దీక్షను పాటిస్తారు. దీంతో ఈ గ్రామంలోని మగ, ఆడపిల్లలు ఆనందంగా ఉన్నారని గ్రామస్థులు చెబుతున్నారు.

బంకాలోని కటోరియా బ్లాక్‌లో  పిప్రదిహ్ గ్రామంలో ఒకప్పుడు ఒక కుమార్తె పుట్టిన వెంటనే మరణించింది. ఆ తర్వాత క్రమంగా గ్రామంలో ఆడపిల్లల సంఖ్య తగ్గడం మొదలైంది. దీంతో తమ గ్రామంలోని ఆడపిల్లలను రక్షించడానికి ప్రజలు ప్రయత్నించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ గ్రామంలో ఆడపిల్లల మరణాలు ఆగడకపోవడంతో.. అప్పుడు గ్రామస్థలకు ఒక బాబా సలహా ఇచ్చారు. గ్రామంలోని మగవారు ఛత్ పూజ చేయాలని, అప్పుడే ఇక్కడి ఆడపిల్లలు క్షేమంగా ఉంటారని, గ్రామంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని గ్రామస్తులకు చెందిన ఓ బాబా సలహా ఇచ్చాడు.

అప్పటి నుంచి గ్రామంలో ఛట్ పూజను మగవారు చేసే సంప్రదాయం కొనసాగుతోందని చెప్పారు. వ్రతాన్ని ఆచరిస్తున్న పురుషులు తమ పూర్వీకులు ఈ  సంప్రదాయాన్ని అనుసరించడంలో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగి ఉన్నారని, దానిని మాటల్లో వర్ణించలేమని చెప్పారు. గ్రామంలోని పురుషులు ఛత్ ఉపవాసం పాటించడం ద్వారా మాత్రమే గ్రామ క్షేమంగా ఉంటుందని, అన్ని రకాల కష్టాలు పరిష్కారమవుతాయని చెబుతున్నారు. ఇక్కడ పురుషులు ఛత్ ఉపవాసం చేయడం వల్ల తమ గ్రామం ఏడాది పొడవునా సంపద, ఆహారంతో నిండి ఉంటుందని గ్రామస్తులు అంటున్నారు. దీంతో తమ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని చెబుతున్నారు. అయితే ఇప్పుడు గ్రామంలో కొన్ని మార్పులు జరుగుతున్నాయి. తమ గ్రామంలోని యువకుడిని పెళ్లి చేసుకుని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు ఛట్ పూజను చేస్తున్నారని పేర్కొన్నారు.  అంతేకాని ఇప్పటి వరకూ ఈ గ్రామంలోని మహిళ ఛత్ ఉపవాసం పాటించలేదు.

ఇవి కూడా చదవండి

సమస్తిపూర్‌లోని రఘునాథ్‌పూర్ గ్రామంలో పురుషులు కూడా ఛత్ చేస్తారు. అదే సమయంలో, బీహార్‌లోని సమస్తిపూర్‌లోని మోర్వా బ్లాక్‌లోని రారియాహి పంచాయతీలోని రఘునాథ్‌పూర్ గ్రామంలో కూడా పురుషులు మాత్రమే ఛట్ చేస్తారు. ఇక్కడ ఛట్ పండుగలో, మహిళలు వారికి సహాయం చేస్తారు. ఉపవాసం నియమాన్ని అనుసరించి.. పురుషులు ఉపవాసం ఉంటారు. ఉదయించే సూర్యుడికి అర్ఘ్యను అందిస్తారు. అయితే ఈ గ్రామంలో మగవాళ్ళు ఛట్ చేయడానికి కారణం వేరు.. తమ గ్రామంలో ఎప్పటి నుంచి ఈ సంప్రదాయం మొదలైందో ఎవరికీ గుర్తు లేదని గ్రామస్తులు అంటున్నారు. ఒకప్పుడు ఛత్ పూజ కోసం నూన్ నది వద్దకు గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలోనే వెళ్లాల్సి వచ్చేదని..  గ్రామస్తులు చెబుతున్నారు. అప్పట్లో గ్రామంలో చెరువులు లేవు. అంత దూరం వెళ్లేందుకు మహిళలు పడుతున్న ఇబ్బందులను చూసిన పెద్దలు ఛత్‌ ఉపవాసం ఉండి నది ఘాట్‌కి వెళ్లే సంప్రదాయాన్ని పెళ్లయిన పురుషులు, మహిళలు ఇంట్లోనే ఉండి ప్రసాదం సిద్ధం చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)