నూర్‌ ఫాతిమా కలలో కనిపించిన మహా శివుడు..! భక్తుల కోసం గుడికట్టించిన ముస్లిం మహిళ..

నూర్ ఫాతిమాకు కలలో దేవుడు కనిపించి శివాలయం నిర్మించాలని సూచించారట. అందుకనే ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఈ క్రమంలోనే..

నూర్‌ ఫాతిమా కలలో కనిపించిన మహా శివుడు..! భక్తుల కోసం గుడికట్టించిన ముస్లిం మహిళ..
Shiv Temple
Follow us

|

Updated on: Oct 29, 2022 | 2:53 PM

ఆధ్యాత్మిక నగరమైన కాశీలో 2004లో ఓ ముస్లిం మహిళ శివాలయాన్ని నిర్మించింది. అయితే ఆలయం చిన్నగా ఉండడంతో భక్తులు కూర్చుని పూజలు చేసుకునేందుకు ఇబ్బందులు పడ్డారు. అందుకే ముస్లిమేతర మహిళల పూజలకు ఆటంకం కలగకుండా ఆలయానికి ఎదురుగా ఒక మందిరాన్ని నిర్మించారు. వారణాసిలోని రుద్ర బీహార్ కాలనీకి చెందిన నూర్ ఫాతిమా ఈ హాలును నిర్మించారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆమె 2004లో ఎంతో కష్టపడి అక్కడ శివాలయాన్ని నిర్మించారు. ఇక్కడి ఆలయంలో శివుడి దర్శనం చేసుకుని బయల్దేరితే పనులు సాకారం అవుతాయని నూర్ ఫాతిమా చెప్పింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని శివాలయాన్ని నిర్మించినట్లు తెలిసింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నూర్ ఫాతిమాకు కలలో దేవుడు కనిపించి శివాలయం నిర్మించాలని సూచించారట. అందుకనే ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మించారు. ఈ క్రమంలోనే ప్రతి రోజూ తామే ఆలయాన్ని శుభ్రం చేస్తామని కూడా చెబుతున్నారు.

నూర్ ఫాతిమా ఆ మహా శివుడి దర్శనం తర్వాత ఎక్కడికి వెళ్లినా తన పనికి ఆటంకం లేకుండా జరుగుతుందని చెప్పింది. 2004లో ఈ శివాలయాన్ని నిర్మించినట్టుగా తెలిపారు. కాలనీ చుట్టుపక్కల ప్రజలు కూడా ఆలయానికి వచ్చి పూజలు చేస్తున్నారు. గుడి చిన్నదిగా ఉండడంతో అందులో భజనలు చేయడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఆలయం ముందు నూర్ ఫాతిమా ఒక పెద్ద హాలును నిర్మించగా, దానిని మంత్రి రవీంద్రనాథ్ జైస్వాల్ ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి