Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాకు పెళ్లి పిల్ల దొరికిందోచ్‌..! పీఎం, సీఎం సహా అందరికీ ఇదే నా ఆహ్వానం..!

వచ్చే నెల 7న పెళ్లి నిశ్చయించుకున్నారు. దీనికి సన్నాహకంగా షేర్వానీ, కుర్తాతో సహా 5జతల కొత్త బట్టలు కూడా కుట్టించాడు.

నాకు పెళ్లి పిల్ల దొరికిందోచ్‌..! పీఎం, సీఎం సహా అందరికీ ఇదే నా ఆహ్వానం..!
Azeem Mansuri
Follow us
Jyothi Gadda

|

Updated on: Oct 29, 2022 | 3:28 PM

వధువు కావాలంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఓ మరుగుజ్జు వ్యక్తికి అదృష్టం కలిసి వచ్చింది. అతడి ఆశ ఫలించింది. వచ్చే 7వ తేదీన వివాహ వేడుక ఘనంగా జరుగనుంది. పెళ్లి చేసుకోవటానికి ఓ అమ్మాయి కావాలని కోరుతూ అతడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతడు అంతటితో ఆగలేతు.. ఆ రాష్ట్ర మాజీ సీఎం, అతని భార్య సహా పలువురిని వేడుకుంటూ రిక్వెస్ట్‌లు పెట్టుకున్నాడు. దాంతో అతడి ఆశ నెరవేరే సమయం రానే వచ్చింది. ఈ విచిత్ర సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

మరుగుజ్జు మనిషి అజీమ్ మన్సూరీ 2019 నుండి తనకు తగిన వధువు కోసం వెతుకుతున్నాడు. దీంతో ఎట్టకేలకు రెండున్నర అడుగుల (30 అంగుళాలు) పొడవాటి మరగుజ్జు అజీమ్ మన్సూరీకి వధువు దొరికింది. నవంబర్ 7న మన్సూర్‌కు వివాహం జరగనుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్‌ సహా తన పెళ్లికి చాలా మందిని ఆహ్వానించడానికి తిరుగుతున్నారు. ఇంతకీ ఈ అజీమ్ మన్సూరి ఎవరో చెప్పనే లేదు కదా..ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ నివాసి అజీమ్ మన్సూరి. సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్త. ఎన్నికల సమయంలో అఖిలేష్ యాదవ్ షామ్లీ తరుపున ప్రచారానికి వచ్చినప్పుడు తనకు వధువును వెతికిపెట్టాలని కోరాడు. అప్పట్లో అది పెద్ద వార్త. అనంతరం పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశాడు.

మన్సూర్ మరుగుజ్జు కావడంతో అతడికి ఆడబిడ్డను ఇవ్వడానికి ఎవరూ ఇష్టపడలేదు. దీంతో విసిగిపోయిన అజీమ్ రాజకీయ నాయకులు, పోలీసుల వద్దకు వెళ్లాడు. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌ను కోడలు అని సంబోధించిన మన్సూర్, పెళ్లికూతురును వెతికిపెట్టాలని కోరాడు. 2019 నుంచి వధువు వెతుకులాటలో ఉన్న అజీమ్‌కు ఇప్పుడు కల్యాణ భాగ్యం వచ్చింది. అతని అంతే పొడవున్న యువతి అజీమ్‌ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. వచ్చే నెల 7న పెళ్లి నిశ్చయించుకున్నారు. దీనికి సన్నాహకంగా షేర్వానీ, కుర్తాతో సహా 5జతల కొత్త బట్టలు కూడా కుట్టించాడు.

ఇవి కూడా చదవండి

అజీమ్ మన్సూర్ మరుగుజ్జు అయినప్పటికీ అతని ఆశయం ఆకాశమంత ఎత్తులో ఉంది. తన వివాహానికి ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం యోగి ఆదిత్యనాథ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, డింపుల్ యాదవ్ సహా పలువురు హాజరు కావాలని ఆయన కోరుతున్నారు. వారిని కల్యాణానికి కూడా ఆహ్వానించేందుకు సిద్ధమయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి