Philippines: తుఫాన్ వచ్చే దిశను తప్పుగా అంచనా వేసి పర్వతం మీదకు చేరుకున్న ప్రజలు.. 80 మంది మృతి..
కుసెయోంగ్ ప్రజల గురించి చెబుతూ.. గ్రామస్థులు తుఫాన్ హెచ్చరిక శబ్దం విన్నప్పుడు.. వెంటనే వారు పరిగెత్తడం ప్రారంభించారు. ఎత్తైన కేథడ్రల్ కు భారీగా చేరుకున్నారు. అయితే వీరు ప్రాణాలు తీసింది సునామీ కాదు.
ఫిలిప్పీన్స్‌లో తుఫాన్ బీభత్సం సృష్టించింది. భారీ విధ్వంసం సృష్టించిన తుఫానును సునామీగా తప్పుగా భావించారు. తమ ప్రాణాలను రక్షించుకోవడానికి ఓ గ్రామంలోని ప్రజలు పర్వతం వైపు ఎత్తైన ప్రదేశం వైపు పరిగెత్తారు. అక్కడ సజీవంగా ఖననం చేయబడ్డారు. ఈ దారుణ ఘటన కుసియోంగ్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ విషయాన్ని ఆదివారం ఓ అధికారి వెల్లడించారు. గతంలో కూడా సునామీని ఏర్పడిన సమయంలో కుసెయోంగ్ గ్రామస్తులు ఇదే విధంగా ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆయన అన్నారు.
ఈ ఉష్ణమండల తుఫాను నల్గే దేశంలోని వాయువ్య తీరాన్ని ధ్వంసం చేసింది. ముఖ్యంగా మాగ్విందనావో దక్షిణ ప్రావిన్స్ అత్యంత దారుణంగా దెబ్బతింది. ఈ ప్రభావం కుసెయోంగ్ గ్రామంపై చూపించింది. ఈ గ్రామంలో బురద నుండి ఇప్పటివరకు 18 మృతదేహాలను వెలికితీశారు. కుసెయోంగ్ గ్రామంలో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకూ 80 నుండి 100 మంది ప్రజలు వరద నీటిలో మునిగిపోయి ఉంటారని.. లేదా లేదా ఖననం చేయబడి ఉంటారని అధికారులు వెల్లడించారు.
నల్గే సమయంలో.. ఫిలిప్పీన్స్‌లో భారీ వర్షం కురిసింది.. కనీసం 50 మంది మరణించారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో కుసెయోంగ్ గ్రామ ప్రజలు కూడా ఉన్నారు. అదే సమయంలో, ఈ తుఫాను విపత్తు పరంగా అత్యంత ప్రభావం పడిన దేశాల్లో ఒకటిగా ఫిలిప్పీన్స్ నిలిచింది. ఈ దేశంలో భారీ విధ్వంసం మిగిల్చింది. టెడ్యూర్ జాతి మైనారిటీకి చెందిన వారు కుసెయోంగ్ గ్రామంలో నివసిస్తున్నారు. ఈ గ్రామం సునామీ కారణంగా జరిగిన ఘోరమైన విధ్వంసానికి సాక్షిగా నిలిచింది. గ్రామస్థులు మాత్రం మిందార్ పర్వతం నుంచి వచ్చిన ప్రమాదాన్ని ఊహించలేకపోయారని సినారింబో తెలిపారు.
అలారం బెల్ మోగినప్పుడు, ఎత్తు వైపు పరుగెత్తిన ప్రజలు సినారింబో అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ, కుసెయోంగ్ ప్రజల గురించి చెబుతూ.. గ్రామస్థులు తుఫాన్ హెచ్చరిక శబ్దం విన్నప్పుడు.. వెంటనే వారు పరిగెత్తడం ప్రారంభించారు. ఎత్తైన కేథడ్రల్ కు భారీగా చేరుకున్నారు. . అయితే వీరు ప్రాణాలు తీసింది సునామీ కాదు. పర్వతం నుండి కిందకు పడిన నీటి ప్రవాహంలో పదుల సంఖ్యలో కొట్టుకుని పోయారు. ఒక్క అవగాహన లోపం వల్లే పదుల సంఖ్యలో గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారని సినారింబో పేర్కొన్నారు.
కుసెయోంగ్ గ్రామం గల్ఫ్ ఆఫ్ మోరో , మిందార్ పర్వతాల మధ్య ఉంది. 1976 ఆగష్టులో వచ్చిన భూకంపం, సునామీ మొర్రో బే సహా చుట్టుపక్కల ప్రాంతాలలో భారీ విధ్వంసం సృష్టించింది, వేలాది మంది మరణించారు. అప్పుడు 8.1 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా సంభవించింది. \
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..