Hindu Temple: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. టెంపుల్‌ ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే..

మన భారతదేశం హిందూ సాంప్రదాయాలకు పెట్టింది పేరు. భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. దేశంలో దేవుళ్లను పూజించేవారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే దేశంలో రకరకాల..

Hindu Temple: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం.. టెంపుల్‌ ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే..
Hindu Temple
Follow us
Subhash Goud

|

Updated on: Oct 31, 2022 | 7:00 AM

మన భారతదేశం హిందూ సాంప్రదాయాలకు పెట్టింది పేరు. భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. దేశంలో దేవుళ్లను పూజించేవారి సంఖ్య కూడా ఎక్కువే. అయితే దేశంలో రకరకాల దేవాలయాలు ఉన్నాయి. భారత్‌లో దేవాలయాలకు ప్రత్యేక స్థానముంది. హిందు, ముస్లిం, క్రిస్టియన్లకు చెందిన ఎన్నో దేవాలయాలు భారత దేశంలో ఉన్నాయి. భారత దేశంలో హిందువులకు చెందిన దేవాలయాల సంఖ్య లెక్కించడం చాలా కష్టం. ఎందుకంటే ఎందుకంటే హిందూ దేవాలయాలు అన్ని ఉన్నాయన్నమాట. కానీ ప్రపంచంలోకెళ్లా పెద్ద హిందువుల ఆలయం కాంబోడియాలోని ఆంగ్ కోర్ వాట్ లో ఉంది. ఆ ఆలయంలో శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నాడు.

ఈ ఆలయం ప్రపంచంలోనే పెద్ద హిందు దేవాలయంగా చరిత్రకెక్కింది. 12వ శతాబ్ధంలో సూర్యవర్మస్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ఆధారంగా తెలుస్తోంది. ఈ ఆలయం హిందువుల నిర్మాణ శైలిలో కాకుండా క్మేర్ నిర్మాణ శైలిలో నిర్మించబడింది. కాని శిల్పాకళా నైపుణ్యం మాత్రం హిందూ సాంప్రదాయంగా ఉంటుంది. ఆలయ నిర్మాణంలో అక్కడక్కడ తమిళనాడులోని ఆలయాలకు చెందిన శైలి కనిపిస్తుంది. భారతదేశంలో మనం చెప్పుకుంటున్న ఇతిహాసాలను కూడా తనలోచూపిస్తూ ఎంతో ఆకట్టుకుంటుంది ఈ ఆలయం. శ్రీ మహావిష్ణువు కొలువైన ఈ ఆలయాన్ని 200 చ .కి.మీ విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయం నిర్మించడానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందని సమాచారం.

ప్రపంచంలో ఎక్కడైనా నీళ్లు ఎగువ నుంచి దిగువ ప్రాంతానికి ప్రవహిస్తాయి… కానీ ఇక్కడ మాత్రం నీళ్లు దిగువ నుంచి ఎగువ ప్రాంతానికి ప్రవహిస్తాయట. ఇలా ఎందుకు జరుగుతోందని ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోయారట. కంబోడియా దేశ జాతీయ పతాకంలో ఈ దేవాలయానికి స్థానం దక్కింది. హిందువులకు చెందిన ఆలయం మరొక దేశ జాతీయ పతాకంపై ఎగురుతుండటం ఎంతో సంతోషాన్ని ఇచ్చినా అదే ఆలయం మన ఇండియాలో లేకపోవడం బాధాకరం.

ఇవి కూడా చదవండి

మేరు పర్వతాన్ని తలపించేలా..

కాగా, హిందూ పురాణాల్లో పేర్కొన్న మేరు పర్వతాన్ని తలపించేలా అంగ్‌కోర్‌ వాట్‌ దేవాలయాన్నినిర్మించారు. హిమాలయాల అవతల ఉండే మేరు పర్వతం దేవతల నివాసంగా పురాణాలు పేర్కొన్నాయి. అంగ్ కోర్ వాట్ ప్రధాన దేవాలయంపై మధ్యలో 213 అడుగుల (65 మీటర్ల) ఎత్తయిన భారీ గోపురంతోపాటు దానికి నాలుగు పక్కలా కొంత చిన్నగా మరో నాలుగు గోపురాలు ఉన్నాయి. ప్రధాన ఆలయానికి చుట్టూ పలు చిన్న ఆలయాలు ఉన్నాయి.

దేవాలయం చుట్టూ అతిపెద్ద నీటి కందకం ఉండటం ఈ ఆలయ విశేషాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఏకంగా 650 అడుగుల (200 మీటర్లు) వెడల్పుతో 13 అడుగుల (నాలుగు మీటర్ల) లోతుతో ఆలయం చుట్టూరా ఉన్న ఈ కందకం ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. దీని మొత్తం చుట్టుకొలత ఏకంగా ఐదు కిలోమీటర్లకు పైనే ఉండడం గమనార్హం.

ఆలయానికి ప్రవేశ మార్గాలు:

ఆలయానికి పశ్చిమ, తూర్పు దిశల్లో ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ప్రవేశించే చోట రాజగోపురాలు ఏర్పాటు చేశారు. ఇందులో పశ్చిమ ద్వారాన్ని ప్రధాన ద్వారంగా భావిస్తారు. ఈ ద్వారానికి ఇరువైపులా గంభీరంగా సింహాల శిల్పాలు ఉంటాయి. ద్వారం నుంచి ప్రధాన ఆలయం వరకు రాతి కట్టడంతో మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆలయం ప్రహరీ గోడ లోపలే పలు నీటి మడుగులు కూడా ఉండటం గమనార్హం. అంగ్ కోర్ వాట్ ఆలయం పక్కన 12వ శతాబ్దం నాటికి చెందిన అతిపెద్ద ఇసుక రాతి నిర్మాణాన్ని పరిశోధకులు గుర్తించారు. వృత్తాకారపు ఆకృతులతో ఉన్న ఆ నిర్మాణం ఏమిటన్నది ఇప్పటికీ నిర్ధారించలేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
ఐదు వికెట్ల ప్రదర్శనతో మహారాష్ట్రను కుదిపేసిన KKR స్పీడ్‌స్టర్
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
సల్లూ భాయ్ మళ్లీ అదరగొట్టాడు.. మురుగదాస్‌ 'సికందర్' టీజర్ చూశారా?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోం.. పవన్ కల్యాణ్
సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో
సెంచరీ తర్వాత కుటుంబ సభ్యులను కలిసిన నితీశ్ రెడ్డి.. వీడియో
బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌
బైక్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌.. హోండా నుంచి కొత్త బైక్‌.. ఫీచర్స్‌
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
కీర్తి పేరును ఖునీ చేసేశారుగా.. హీరోయిన్ రియాక్షన్ ఇదే..
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!