Longest Train: 100 బోగీలు, 1.9 కిలో మీటర్ల పొడవు.. ఎన్నో విశేషాలకు నెలవు ఈ బాహుబలి రైలు..
సాధారణంగా ఒక రైలులో ఎన్ని బోగీలు ఉంటాయి. ఓ 20 ఉంటాయి, గూడ్స్ రైలు అయితే ఓ 50 ఉంటాయి కదూ. అయితే రైలుకు 100 బోగీలు ఉంటే ఎలా ఉంటుంది.? ఊహించుకోవడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ దీనిని సాకారం చేసింది ఓ రైల్వే కంపెనీ. ఏకంగా 100 బోగీలతో కూడిన 1.9 కిలో మీటర్లు..
సాధారణంగా ఒక రైలులో ఎన్ని బోగీలు ఉంటాయి. ఓ 20 ఉంటాయి, గూడ్స్ రైలు అయితే ఓ 50 ఉంటాయి కదూ. అయితే రైలుకు 100 బోగీలు ఉంటే ఎలా ఉంటుంది.? ఊహించుకోవడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ దీనిని సాకారం చేసింది ఓ రైల్వే కంపెనీ. ఏకంగా 100 బోగీలతో కూడిన 1.9 కిలో మీటర్లు పొడవున్న ఈ రైలును స్విట్జర్లాండ్‌కు చెందిన రయేటియన్ అనే రైల్వే కంపెనీ రూపొందించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ప్యాసింజర్ రైలుగా గుర్తింపు సంపాదించుకున్న ఈ రైలును తాజాగా విజయవంతంగా నడిపి రికార్డు సృష్టించింది.
ఈ రైలును ప్రెడానుంచి మెర్గూన్ దాకా అల్బులా/బెర్నియా మార్గం గుండా నడిపించారు. ఈ రైలుమార్గాన్ని 2008లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ప్రాంతంగా ప్రకటించింది. 22 సొరంగాలగుండా ఈ మార్గం వెళుతుంది. పర్వతాల నడుమ, దాదాపు 48 వంతెనలపై సాగే ప్రయణం గంట సేపు సాగుతుంది. ఈ రైలు ప్రయాణాన్ని వీక్షించేందుకు వందలాది ప్రజలు రైలు ట్రాక్ పొడవునా బారులు తీరి వీక్షించారు. స్విట్జర్లాండ్ ఇంజనీర్లు సాధించిన విజయాలకు ప్రతీకగా, స్విస్ రైల్వేస్ 175 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ అద్భుత ఫీట్‌ను సాధించినట్లు రయేటియన్ రైల్వే డైరెక్టర్ రెనాటోఫాసియాటి తెలిపారు.
భారత్‌లోనూ ఇలాంటి ఓ రైలు..
ఇదిలా ఉంటే ఇండియాలోనూ ఇలాంటి ఓ బాహుబలి రైలు ఉంది. అయితే ఇది గూడ్స్ రైలు. సూపర్ వాసుకీ పేరుతో ఇండియన్ రైల్వే నడిపిస్తున్న ఈ రైలు సుమారు 3.5 కి.మీల పొడవు ఉంటుంది. సుమారు 925 బోగీలు ఉండే ఈ రైలు 27,000 టన్నుల బొగ్గును సరఫరా చేస్తుంది. ఈ రైలు నాగ్‌పూర్ నుంచి చత్తీస్‌ఘడ్ వరకు ప్రయాణిస్తుంది.
Super Vasuki – India’s longest (3.5km) loaded train run with 6 Locos & 295 wagons and of 25,962 tonnes gross weight.#AmritMahotsav pic.twitter.com/3oeTAivToY
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 16, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..