చిన్నారికి థ్యాంక్స్ చెప్పిన గున్న ఏనుగు.. సో క్యూట్ అంటూ నెటిజన్ల కామెంట్లు..

ఎవరైనా ఆపదలో ఉంటే వారికి మనవంతు సహాయం చేయడం చూస్తుంటాం. మనకు తోచినంత ఇవ్వడమో, చేతనైనంత చేయడమో వంటివి చేస్తూ ఆసరాగా ఉంటాం. అయితే జంతువుల విషయంలో..మనకు ఎన్నో సందేహాలుంటాయి..

చిన్నారికి థ్యాంక్స్ చెప్పిన గున్న ఏనుగు.. సో క్యూట్ అంటూ నెటిజన్ల కామెంట్లు..
Elephant Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Oct 30, 2022 | 1:28 PM

ఎవరైనా ఆపదలో ఉంటే వారికి మనవంతు సహాయం చేయడం చూస్తుంటాం. మనకు తోచినంత ఇవ్వడమో, చేతనైనంత చేయడమో వంటివి చేస్తూ ఆసరాగా ఉంటాం. అయితే జంతువుల విషయంలో..మనకు ఎన్నో సందేహాలుంటాయి. అవి పరస్పరం సహాయం చేసుకుంటాయా అని ఆలోచిస్తుంటాయి. అవసరమైనప్పుడు అవి కూడా సహాయం చేసుకుంటాయని కొన్ని వీడియోలు నిరూపితం చేస్తున్నాయి. కానీ జంతువులకు మనుషులు, మనుషులకు జంతువులు సహాయం చేయడాన్ని మనం అప్పుడప్పుడు మాత్రమే చూస్తుంటాం. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా మనకు సహాయం చేసిన వారికి థాంక్స్‌ అంటూ చేతులు కలిపి కృతజ్ఞతలు చెబుతాం. లేదా రెండు చేతులూ జోడించి మన కృతజ్ఞతా భావాన్ని చాటుకుంటాం. ఇది మానవ ధర్మం. ఇది జంతువులకూ వర్తిస్తుందంటుంది ఓ గున్న ఏనుగు. అవును. ఆపదలో ఉన్న తనకు సహాయం చేసిన బాలికకు కృతజ్ఞతలు చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. చిన్ని ఏనుగు చేసిన పని నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో రోడ్డు పక్కన ఓ చెరకు పొలాన్ని చూడవచ్చు. పొలంలో చెరకు తినేందుకు వెళ్లింది ఓ గున్న ఏనుగు. ఈ క్రమంలో అదుపు తప్పి బురదలో చిక్కుకుంది. అది పైకి రావడానికి నానా తంటాలు పడుతుంది. ఇంతలో అటుగా తన పెంపుడు కుక్కతో కలిసి వాకింగ్‌ చేస్తూ వెళ్తున్న బాలిక ఆ చిన్ని ఏనుగుకు సహాయం చేసింది. దాని కాళ్లు పట్టుకొని పైకి లాగింది. దాంతో ఆ చిన్ని ఏనుగు బురదనుంచి పైకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

అనంతరం ఆ బాలిక అక్కడ్నుంచి వెళ్తుండగా ఆ చిన్ని ఏనుగు తన తొండంతో ఆ బాలికను ఆశీర్వదించి కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను వేలాదిమంది నెటిజన్లు వీక్షిస్తూ లైక్‌ చేస్తున్నారు. అద్భుతమైన సన్నివేశం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్