Soaked Dates: నానబెట్టిన ఖర్జూరాలు తింటే బోలెడు ప్రయోజనాలు.. పురుషుల్లో ఆ సమస్యలకు కూడా చెక్‌..

రుచిలోనూ అద్భుతంగా  ఉండే ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం తినడం ద్వారా బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Soaked Dates: నానబెట్టిన ఖర్జూరాలు తింటే బోలెడు ప్రయోజనాలు.. పురుషుల్లో ఆ సమస్యలకు కూడా చెక్‌..
Dates
Follow us

|

Updated on: Nov 01, 2022 | 9:57 AM

జీవనశైలి బాగుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ముఖ్యంగా కూరగాయలు, పండ్లు బాగా తినడం, వ్యాయామం చేయడం , సమయానికి పడుకోవడం, త్వరగా మేల్కొలపడం వంటి కొన్ని జీవనశైలి మార్పులు మనల్ని ఆరోగ్యకరమైన, ఒత్తిడి లేని జీవితం వైపు నడిపిస్తాయి. అటువంటి అనేక ప్రయోజనాలను తెచ్చే అటువంటి పండు ఖర్జూరం. రుచిలోనూ అద్భుతంగా  ఉండే  వీటిని రాత్రంతా నానబెట్టి, మరుసటి రోజు ఉదయం తినడం ద్వారా బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే ఖర్జూరాన్ని ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి. అయితే ఖర్జూరం విషయంలో చాలామందికి అపోహలున్నాయి. ముఖ్యంగా బక్కపలుచగా ఉన్నవారు బరువును పెంచుకోవాలనుకుంటే, రోజుకు 4 ఖర్జూరాలు తినవచ్చు. అయితే జీర్ణక్రియ బాగా ఉన్నప్పుడు మాత్రమే. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలున్నప్పుడు ఆరోగ్య నిపుణుల సలహాలు తీసుకున్న తర్వాత మాత్రమే ఖర్జూరాలను తీసుకోవాలి. నానబెట్టిన ఖర్జూరాల్లో టానిన్లు/ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. తద్వారా ఇందులోని పోషకాలు పుష్కలంగా శరీరానికి అందుతాయి. ఇందుకోసం ముందు రోజు రాత్రంతా (8-10 గంటలు) వీటిని నీటిలో నానబెట్టండి.

నానబెట్టిన ఖర్జూరాలతో ఆరోగ్య ప్రయోజనాలివే..

– మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

– గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఇవి కూడా చదవండి

– కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది.

– ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

– రక్తపోటును నియంత్రిస్తుంది.

– పురుషులు, స్త్రీలలో లైంగిక శక్తిని పెంచుతుంది.

– మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

-అలసట (బలహీనత) నుంచి ఉపశమనం కలుగుతుంది.

-రక్తహీనతకు నివారిస్తుంది.

– ఆరోగ్యకరమైన బరువు పెరుగుటను ప్రోత్సహిస్తుంది.

– పైల్స్‌ను నివారిస్తుంది.

– వాపును నివారిస్తుంది.

– ఆరోగ్యకరమైన గర్భధారణకు సహకరిస్తుంది

– చర్మంతో పాటు జుట్టుకు మంచిది

పిల్లలకు ఖర్జూరం :

ఖర్జూరం పిల్లల ఆరోగ్యానికి చాలామంచిది. వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఇది మంచి ఆహారం. తక్కువ బరువు, తక్కువ హిమోగ్లోబిన్, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి ప్రతిరోజూ ఒక తీపి ఖర్జూరం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి