Yoga Asanas: డెంగ్యూ జ్వరానికి యోగాతో చెక్.. ఈ ఆసనాలతో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా..
యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికి తెలుసు. ఆసనాలు అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగానూ ఉపయోగపడతాయి. శరీరం ధృడంగా ఉండటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, రోజంతా ఉత్సహంగా ఉండటానికి..
యోగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికి తెలుసు. ఆసనాలు అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగానూ ఉపయోగపడతాయి. శరీరం ధృడంగా ఉండటానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, రోజంతా ఉత్సహంగా ఉండటానికి ఆసనాలు సహాయపడతాయి. అయితే యోగా తో డెంగ్యూ జ్వరానికి కూడా చెక్ పెట్టవచ్చంటున్నారు యోగా నిపుణులు. ఇటీవల కాలంలో చాలా మంది డెంగ్యూ బారిన పడుతున్నారు. ప్లేట్ లెట్స్ కౌంట్ తగ్గిపోవడంతో చాలా మంది ఆసుపత్రుల పాలవుతన్నారు. ఎవరికైనా డెంగ్యూ ఉందని నిర్ధారణ అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మంచి పోషకాహారం, తగినంత విశ్రాంతి, కొన్ని యోగా ఆసనాలను చేయడం ద్వారా.. డెంగ్యూకి చెక్ పెట్టవచ్చు. వీటిని పాటిస్తే డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడం కూడా సాధ్యమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మనస్సు ప్రశాంతతకు కూడా యోగసనాలు దోహదపడతాయి. చాలా మంది శారీరక ఆరోగ్యం కోసం వ్యాయమాలు చేస్తుంటారు. అయితే కొన్ని యోగసనాలతో మానసిక ప్రశాంతత లభించడంతో పాటు అనేక రోగాల బారిన పడకుండా, రోగాల నుంచి త్వరగా కోలుకోవడానికి ఈ ఆసనాలు ఉపయోగపడతాయి. డెంగ్యూ నుంచి కోలుకోవడానికి సహాయపడే యోగా ఆసనాలు ఏమిటో తెలుసుకుందాం.
దండాసనం
కూర్చున్న స్థితిలో కాళ్లను ముందుకు చాపి, మడమలను, కాళ్లను కలపే ప్రయత్నం చేయాలి. వీపును నిటారుగా ఉంచి ముందుకు చూడాలి. వెన్నెముకకు మద్దతుగా నేలపై అరచేతులను తుంటి పక్కన ఉంచాలి. భుజాలను రిలాక్స్‌గా ఉంచాలి. ఆ ఆసనం చేయడం ద్వారా స్నాయువులను సాగదీస్తుంది. వెన్నెముకను పొడిగిస్తుంది. వీపును బలపరుస్తుంది. తొడలు కండరాలు బిగుతుగా కావడంలో ఈ ఆసనం సహాయపడుతుంది.
మలాసనం
నిటారుగా నిల్చోవాలి. మోకాళ్లను వంచి, మడమల మీద బరువు వేస్తూ కూర్చోవాలి. పాదాలు నేలపై ఫ్లాట్‌గా ఉండేలా చూసుకోవాలి. మీరు మీ అరచేతులను పాదాల పక్కన నేలపై ఉంచవచ్చు. ఈ స్థితిలో వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఈ ఆసనం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. చీలమండలు, దిగువ హామ్ స్ట్రింగ్స్, వీపు, మెడను సాగదీస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పొత్తికడుపును టోన్ చేస్తుంది. జీవక్రియను బలపరుస్తుంది.
వజ్రాసనం
నేలపై మోకరిల్లాలి. మీ కటిని మడమల మీద ఉంచి.. మోకాళ్లు, చీలమండలను స్ట్రెచ్ చేయాలి. మడమలను ఒకదానికొకటి దగ్గరగా ఉంచాలి. అరచేతులను మోకాళ్లపై లేదా తొడలపై ఉంచాలి. సౌకర్యవంతంగా ఉండే వరకు కటిని కొద్దిగా వెనుకకు, ముందుకు సర్దుబాటు చేసుకోవాలి. వజ్రాసనం వలన మనస్సును ప్రశాంతంగా, స్థిరంగా ఉంచడంలో మాత్రమే కాకుండా జీర్ణ ఆమ్లత్వం, గ్యాస్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. మోకాలి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తొడ కండరాలను బలపరుస్తుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. లైంగిక అవయవాలను బలోపేతం చేయడంలో, మూత్ర సంబంధిత సమస్యల చికిత్సలో కూడా వజ్రాసనం సహాయపడుతుంది.
పశ్చిమోత్తనాసనం
దండసానాతో ప్రారంభించి.. వీపు భాగం గట్టిగా ఉంటే చేతులతో పట్టుకుంటూ పాదాల చుట్టూ ఉంచాలి. మోకాలు కొద్దిగా వంచి.. కాళ్లు ముందుకు సాగేలా చూసుకోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచుతూ ముందుకు వంచాలి. బొటనవేళ్లను వేళ్లతో పట్టుకోవాలి. తలతో మోకాళ్లను తాకాలి. పశ్చిమోత్తనాసనం వల్ల ఎన్నో ప్రయోనాలున్నాయి. ఈ ఆసనం కొంత కష్టమైనప్పటికి అధిక రక్తపోటు, మధుమేహంతో బాధపడుతున్న వారికి ఇది చాలా ప్రయోజనాలను అందిస్తుంది. శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి.. మనస్సును రిలాక్స్‌గా ఉంచడంలో ఈ ఆసనం దోహదపడుతుంది. తలకు రక్తాన్ని ప్రసరింపజేయడంలో సహాయపడుతుంది. తద్వారా మనస్సుకు విశ్రాంతినిస్తుంది. నిద్రలేమి, నిరాశ, ఆందోళనను తగ్గిస్తుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..