Winter fitness: ఈ కాలంలో వాకింగ్ కోసం వెళ్తున్నారా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. మీ ఆరోగ్యం పదిలం..
అసలే చలికాలం. పొద్దునే బయటకు వస్తే చలికి వణికిపోవడం ఖాయం. పెద్ద వయసువారు అయితే ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడతారు. అయినా చాలా మంది వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది. కాలంతో సంబంధం లేకుండా..
అసలే చలికాలం. పొద్దునే బయటకు వస్తే చలికి వణికిపోవడం ఖాయం. పెద్ద వయసువారు అయితే ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడతారు. అయినా చాలా మంది వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది. కాలంతో సంబంధం లేకుండా రోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయడాన్ని జీవితంలో భాగం చేసుకుంటారు. ప్రస్తుతం వాతావరణం మారింది. ఉదయం ఎంతో చలిగా ఉంటుంది. అందుకే వాకింగ్ కోసం ఉదయం వెళ్లేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవచ్చు. లేదంటే ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవల్సి ఉంటుంది. ముందుగా చలికాలంలో వాకింగ్ చేసే వాళ్లు ధరించే దస్తుల్లో మార్పు చేసుకోవాలి. చలికాలంలో బయటకు వెళ్లి వాకింగ్, రన్నింగ్ మొదలైన వ్యాయామాలు చేసేవారు, క్రీడల కోసం ప్రాక్టీసు చేసేవారు, మార్నింగ్ వాక్‌కు వెళ్లే వయసు ఎక్కువున్న వారు ఎవరైనా చలిలో బయటకు వెళ్లేముందు ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. చల్లటి వాతావరణం వల్ల జలుబు, ఫ్లూ, చర్మం పగలటం వంటి సాధారణ అనారోగ్య సమస్యల నుండి మొదలు గుండెపోటులు, శ్వాసకోశ సమస్యలు, న్యుమోనియా, డిప్రెషన్ వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులను కలిగిస్తుంది. అదేవిధంగా ఈ సీజన్ లో గాయాలైతే త్వరగా తగ్గవు. అందుకే ముందు జాగ్రత్తలను పాటించడం తప్పనిసరి. చలి కాలంలో వాకింగ్ కు వెళ్లేవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
రెండు పొరల దుస్తులు..
చలికాలంలో కురసగా ఉండే బట్టలు కాకుండా నిండుగా మీ శరీరాన్ని కప్పే దుస్తులు ధరించండి. మీ ఎగువ, దిగువ శరీరాలను కప్పి ఉంచేలా లోపలి నుంచి ఒక లేయర్ ధరించండి, పై నుంచి వదులుగా ఉండే అథ్లెటిక్ దుస్తులను వేసుకోవడం బెటర్. మెడ ప్రాంతాన్ని కప్పి ఉంచే మందమైన విండ్ బ్రేకర్ స్టైల్ జాకెట్లు ధరించాలి. మీ శరీరం వేడెక్కడం ప్రారంభించినపుడు, పై లేయర్ దుస్తులను తొలగించవచ్చు. అలాగే పాదాలకు సాక్సులు, చేతులకు గ్లోవ్స్, చెవులను కప్పి ఉంచే తలపాగాలు కూడా ధరించాలి. తగిన షూస్ వేసుకోవాలి. ధరించేవన్నీ తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి.
వార్మప్ తప్పనిసరి..
ఏదైనా వ్యాయామం ప్రారంభించే ముందు వార్మప్ చేయడం తప్పనిసరి. ఈ వార్మప్ ప్రధాన ఉద్దేశ్యం శరీర అంతర్గత ఉష్ణోగ్రతను పెంచి, మీ ప్రధాన కీళ్లలో చలనశీలతను కలిగిస్తుంది. అలాగే కండరాలను సక్రియం చేసి సౌకర్యంగా శరీరాన్ని కదిలించగలిగే ఫ్లెక్సిబిలిటీని అందిస్తుంది. శరీరం తగినంతగా వేడెక్కించడం వల్ల అవయవాలకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. చలిలో ఇది చాలా ముఖ్యమైనది. ఉన్నచోటే స్ట్రెచింగ్‌లను చేస్తూ శరీరాన్ని వార్మప్ చేసుకోవచ్చు.
ఏదైనా తినాలి..
ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే శక్తిని కోల్పోతారు. అందుకే వ్యాయామానికి ముందు తేలికపాటి అల్పాహారం తీసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు తీసుకోవడం మంచిది. కనీసం ఒక పండునైనా తినాలి. తద్వారా గ్లైకోజెన్ క్షీణతను నివారించవచ్చు. శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. సాధారణంగా చలికాలంలో ఎక్కువగా దాహం వేయదు, కానీ నీరు తాగకుండా వ్యాయామాలు చేస్తూ ఉంటే డీహైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అందువల్ల గోరువెచ్చని నీటితో నింపిన వాటర్ బాటిల్‌ను కూడా తీసుకెళ్లి.. మధ్య మధ్యలో వాటర్ తాగడం బెటర్.
అవసరమైన విశ్రాంతి..
ఏదైనా వ్యాయామం చేసేటప్పుడు సరిగ్గా నిద్రపోయారా, మీ శరీరానికి తగినంత విశ్రాంతి లభించిందా అనేది చాలా ముఖ్యం. సరైన విశ్రాంతి లేకుండా అభ్యాసాలు చేస్తే అస్వస్థతకు గురవుతారు. ఆస్తమా లేదా ఇతర శ్వాస సమస్యలతో బాధపడుతుంటే సమయానికి మందులు తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..