AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: షుగర్‌ పేషెంట్లు అల్లం టీ తాగొచ్చా? లేదా? ఆరోగ్య నిపుణుల సలహా ఏమిటంటే?

అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నట్లు ఏదీ అతిగా వాడకూడదు. అల్లం విషయంలోనూ ఈ నియమం వర్తిస్తుంది. మోతాదుకు మించి అల్లంను తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదమంటున్నారు నిపుణులు.

Diabetes: షుగర్‌ పేషెంట్లు అల్లం టీ తాగొచ్చా? లేదా? ఆరోగ్య నిపుణుల సలహా ఏమిటంటే?
Ginger
Basha Shek
|

Updated on: Oct 31, 2022 | 10:31 AM

Share

జలుబు, దగ్గు అనగానే చాలామందికి అల్లం గుర్తుకొస్తుంది. ముఖ్యంగా చలికాలంలో చాలామంది అల్లం టీ, అల్లం కషాయం ఎక్కువగా తీసుకుంటారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడుతుంది. అలాగే బరువు తగ్గడానికి కూడా అల్లం ఉపయోగపడుతుంది. ఇలా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్న అల్లంను పలు వంటకాల్లోనూ అదనపు రుచి కోసం విరివిగా ఉపయోగిస్తారు. అంత బాగానే ఉంది కానీ అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నట్లు ఏదీ అతిగా వాడకూడదు. అల్లం విషయంలోనూ ఈ నియమం వర్తిస్తుంది. మోతాదుకు మించి అల్లంను తీసుకుంటే ఆరోగ్యానికి ప్రమాదమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏ కారణం చేతనూ అల్లంను ఎక్కువ మోతాదులో తినకూడదని హెచ్చరిస్తున్నారు. మరి అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం.

మధుమేహంతో బాధపడుతున్న వ్యక్తులు, అల్లం ఎక్కువగా తీసుకోవడం హానికరమని అధ్యయనాలు, పరిశోధనలు నిరూపిస్తున్నాయి. ఇప్పటికే షుగర్ లెవెల్స్‌ను నియంత్రించేందుకు మందులు, ట్యాబ్లెట్లు తీసుకుంటుంటే అల్లం తీసుకోవడం వెంటనే ఆపాల్సిందేనంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. అంతే కాకుండా అల్లం ఎక్కువగా తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది. కాబట్టి, ఎల్లప్పుడూ పరిమిత పరిమాణంలో అల్లం తీసుకోవాలి.

చర్మ సమస్యలు

అల్లం ఎక్కువగా తీసుకునేవారికి చర్మ సమస్యలు వస్తాయి. అల్లం ఎక్కువగా తినడం వల్ల కళ్లు వాపు, ఎరుపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దురద, పెదవులు వాపు, కళ్లు దురద, గొంతు సమస్యలు తలెత్తుతాయి.

ఇవి కూడా చదవండి

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం  క్లిక్ చేయండి

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం