AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rishab Shetty: కాంతార కంటే ముందే తెలుగులో నటించిన రిషబ్‌ శెట్టి.. ఏ సినిమానో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇదిలా ఉంటే కాంతారా సినిమా కంటే ముందు కొన్ని డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు రిషబ్‌. బెల్‌బాటమ్‌, హీరో చిత్రాలు ఈ కోవకు చెందినవే. అయితే రిషబ్ నేరుగా ఓ తెలుగు చిత్రంలోనూ కనిపించాడు తెలుసా?.

Rishab Shetty: కాంతార కంటే ముందే తెలుగులో నటించిన రిషబ్‌ శెట్టి.. ఏ సినిమానో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Rishab Shetty
Basha Shek
|

Updated on: Nov 03, 2022 | 7:36 PM

Share

కాంతారా సినిమాతో నేషనల్‌ లెవెల్లో గుర్తింపు సొంతం చేసుకున్నాడు కన్నడ హీరో రిషబ్‌ శెట్టి. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం కూడా ఆయనే వహించారు. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ్‌లోనూ సంచలన విజయం సాధించింది. విడుదలై నెల రోజులు గడిచిపోతున్నా అన్ని భాషల్లో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ఇక తెలుగులోనూ రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కాంతారా సినిమా కంటే ముందు కొన్ని డబ్బింగ్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు రిషబ్‌. బెల్‌బాటమ్‌, హీరో చిత్రాలు ఈ కోవకు చెందినవే. అయితే రిషబ్ నేరుగా ఓ తెలుగు చిత్రంలోనూ కనిపించాడు తెలుసా?. అది కూడా ఒక్క పైసా రెమ్యూనరేషన్‌ తీసుకోకుండానే. ఇంతకీ ఈ సినిమా మిషన్‌ ఇంపాజిబుల్‌. తాప్సీ పన్ను ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలై పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ ఫేం స్వరూప్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అతిథి పాత్రలో మెరిశాడు రిషబ్‌.

ఈ సినిమాలో ఖలీల్‌ అనే ఓ చిన్న దొంగ పాత్రలో కనిపించారు కన్నడ హీరో. కనిపించేది 2-3 నిమిషాలైనా సినిమాను మలుపు తిప్పే పాత్ర అది. ఈ మూవీ డైరెక్టర్‌ స్వరూప్‌, రిషబ్‌కు మంచి స్నేహితుడట. దీనికి తోడు స్వరూప్ తీసిన మొదటి సినిమా సాయి శ్రీనివాస ఆత్రేయ బాగా నచ్చడంతో తనను కలిసినప్పుడు రిషబ్ శెట్టి ఆయనను అభినందించాడట. ఆ స్నేహంతోనే ఇందులో ఖలీల్‌ పాత్ర చేయమని అడగ్గా రిషబ్‌ వెంటనే ఒకే చెప్పాడట. అంతేకాదు ఈ సినిమాకు ఆయన ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. కాగా ఇదే సినిమాలో హీరో సుహాస్‌, కలర్‌ ఫొటో దర్శకుడు సందీప్‌ రాజ్‌ కూడా క్యామియో పాత్రల్లో కనిపించి సందడి చేశారు. ఇలా ఈ ముగ్గురూ కనిపిస్తున్న ఫొటోనే ఇప్పుడు సోషల్‌ మీడియాలో బాగా వైరలవుతోంది. కాగా కాంతారా ఘన విజయం సాధిచంగానే సందీప్‌ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టాడు. మిషన్‌ ఇంపాజిబుల్‌ సినిమా సెట్‌లో రిషబ్‌తో కలిస్తున్న ఫొటోను షేర్‌ చేస్తూ కంగ్రాట్స్‌ చెప్పాడు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sandeep Raj (@sandeepraaaj)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

సినిమా పేరుపై సాధువుల మండిపాటు.. పేరు మార్చాలని డిమాండ్
సినిమా పేరుపై సాధువుల మండిపాటు.. పేరు మార్చాలని డిమాండ్
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓలా, ఉబర్ సేవలు.. కారణం
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓలా, ఉబర్ సేవలు.. కారణం
అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
జీడీపీ ఎవరు లెక్కిస్తారో తెలుసా..?
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
ఫ్లాట్లు కట్టిస్తామని డబ్బులు తీసుకున్నారు.. చివరకు ఏం జరిగిందంటే
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
మబ్బుల మధ్య రైల్వే స్టేషన్… ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనది..!
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
అదృష్టం అంటే ఇదేనేమో..1 లక్ష పెట్టుబడి రూ.12.50 లక్షలుగా మారింది
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
హై లెవెల్‌ బ్యాంకింగ్‌ కమిటీ ఏర్పాటు చేయనున్న కేంద్రం! ఎందుకంటే..
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..
డాక్టర్ల చేతిలో ఏఐ ఆయుధం.. సిక్ కేర్ నుండి హెల్త్‌కేర్ వైపు..