Samantha: విడుదలకు సిద్ధమైన బిగ్గెస్ట్ ఫీమేల్ పాన్ ఇండియా చిత్రం..సెన్సార్ కంప్లీట్ చేసుకున్న యశోద..
తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ... అన్ని భాషల్లో, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ సినిమాపై ట్రైలర్ అంచనాలు పెంచింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ‘యశోద’. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. ఈ సినిమాను శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాను హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ‘యశోద’ థియేట్రికల్ ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ లభిస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ… అన్ని భాషల్లో, దేశంలోని అన్ని ప్రాంతాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ఇందులో సమంత ప్రెగ్నెన్సీ మహిళగా కనిపించనుంది. ఈ సినిమాపై ట్రైలర్ అంచనాలు పెంచింది. నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సినిమాను విడుదల చేయనున్నారు.
తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. యాక్షన్ ప్యాక్డ్ ఎమోషనల్ థ్రిల్లర్ సినిమా సరోగసి.. మెడికల్ క్రైమ్‌ల నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీపై ఇప్పటికే క్యూరియాసిటిని పెంచేసింది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా.. డా.చల్లా భాగ్యలక్ష్మి, పులగం చిన్న నారాయణ మాటలు అందించారు. ఈ మూవీలో ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ కీలకపాత్రలో నటిస్తున్నారు.
ఇక ఇటీవల సామ్ తాను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు అనౌన్స్ చేయడంతో అభిమానులే కాదు.. సినీ ప్రముఖులు షాకయ్యారు.ఆమె త్వరగా కోలుకోవాలని కోరుతూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఇక సామ్ ప్రస్తుతం డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి సినిమా చేస్తున్నారు. అలాగే ఆమె నటించిన శాకుంతలం మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
#Yashoda‘s way to you is clear now ?
The Biggest Female Centric Pan-Indian film gets censored with U/A ?https://t.co/XowpvAxYjl#YashodaTheMovie @Samanthaprabhu2 @varusarath5 @Iamunnimukundan @harishankaroffi @hareeshnarayan @krishnasivalenk #YashodaOnNov11th pic.twitter.com/a4b7xBYtzb
— Pulagam Chinnarayana (@PulagamOfficial) November 3, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.