Brahmastra: ఓటీటీలోకి స్ట్రీమింగ్కి వచ్చేసిన బ్రహ్మాస్త్ర.. ఎక్కడ చూడొచ్చంటే..
సెప్టెంబర్ 9న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ. 270 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రాన్ని పూర్తిగా 5 భాగాలుగా రూపొందించనున్నట్లు గతంలో అయాన్ ముఖర్జీ తెలిపారు.
డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన సినిమా బ్రహ్మాస్త్ర. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఇందులో అక్కినేని నాగార్జున, అమితాబ్, షారుఖ్ కీలకపాత్రలలో నటించారు. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ భారీగానే వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ మూవీ బ్రహ్మాస్త్ర ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకోగా.. గురువారం అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చింది. కేవలం హిందీలోనే కాకుండా.. తెలుగు సహా ఇతర పాన్ ఇండియా భాషలలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.
సెప్టెంబర్ 9న పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ దేశవ్యాప్తంగా రూ. 270 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రాన్ని పూర్తిగా 5 భాగాలుగా రూపొందించనున్నట్లు గతంలో అయాన్ ముఖర్జీ తెలిపారు. ఇందులో మొదటి పార్ట్ శివ పేరుతో రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది. త్వరలోనే ఈ మూవీ సెకండ్ పార్ట్ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
అయితే ఈ సెకండ్ పార్ట్ లో కీలక పాత్ర కోసం మరో బాలీవుడ్ స్టార్ హీరోను రంగంలోకి దింపుతున్నారని టాక్ వినిపిస్తోతంది. రణవీర్ సింగ్, హృతిక్ పేర్లు కొద్ది రోజులుగా ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్నారు. ఇక బ్రహ్మాస్త్ర పార్ట్ 2ను 2025 డిసెంబర్ నాటికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట.