Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sachin: తనయుడితో కలిసి సచిన్‌ లాంగ్‌ డ్రైవ్‌.. రోడ్‌సైడ్‌ ఛాయ్‌వాలాతో సెల్ఫీలు.. సూపర్బ్‌ అంటోన్న ఫ్యాన్స్‌

కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌తో కలిసి రోడ్ సైడ్ టీని ఎంజాయ్ చేశాడు. ఇద్దరూ బెళగాం-గోవా జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ మార్గం మధ్యలో ఒక చోట ఆగారు. అక్కడ రోడ్డు పక్కన ఓ చాయ్‌ వాలాతో సరదాగా ముచ్చటించారు.

Sachin: తనయుడితో కలిసి సచిన్‌ లాంగ్‌ డ్రైవ్‌.. రోడ్‌సైడ్‌ ఛాయ్‌వాలాతో సెల్ఫీలు.. సూపర్బ్‌ అంటోన్న ఫ్యాన్స్‌
Sachin Tendulkar
Follow us
Basha Shek

|

Updated on: Nov 03, 2022 | 8:09 PM

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ కేవలం ఆటతోనే కాదు తన వ్యక్తిత్వంతోనూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజంగా గుర్తింపు తెచ్చుకున్న అతను మైదానం బయట ఎంతో హుందాగా ఉంటాడు. తానొక సెలబ్రిటీ అన్న గర్వం ఎక్కడా కనిపించదు. ఈ వ్యక్తిత్వమే అతడిని శిఖరాగ్రాన నిలబెట్టింది. సహచరులతో పాటు తోటి క్రికెటర్లు మాస్టర్‌ బ్లాస్టర్‌ను స్ఫూ్ర్తిగా తీసుకోవడానికి ఇదే ప్రధాన కారణం. తాజాగా మరోసారి తన సింప్లిసిటీని చాటుకున్నాడు సచిన్‌. కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌తో కలిసి రోడ్ సైడ్ టీని ఎంజాయ్ చేశాడు. ఇద్దరూ బెళగాం-గోవా జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ మార్గం మధ్యలో ఒక చోట ఆగారు. అక్కడ రోడ్డు పక్కన ఓ చాయ్‌ వాలాతో సరదాగా ముచ్చటించారు. ఛాయ్‌లో రస్క్‌లు ముంచుకుంటూ తింటూ కనిపించారు. అనంతరం అక్కడున్న వారితో సెల్ఫీలు తీసుకున్నారు. అనంతరం దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన సచిన్‌ ‘రోడ్‌ ట్రిప్‌లో చాయ్‌ బ్రేక్‌’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను చూసిన వారందరూ సచిన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఆ టీ అమ్మే వ్యక్తి చాలా అదృష్టవంతుడు. అతని దగ్గరికి దేవుడే టీ తాగడానికి వచ్చాడు’ అంటూ కామెంట్లు పెడుతున్నాడు. కాగా సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఈ రంజీ సీజన్ లో ముంబయి జట్టును వీడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోవా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గత సీజన్ లో రంజీ ట్రోఫీ గ్రూప్ దశలో అర్జున్‌కు ముంబై జట్టులో ప్లేస్‌ దక్కింది. అయితే ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. నాకౌట్ దశకు వచ్చేసరికి అర్జున్‌ను ఏకంగా జట్టు నుంచి తప్పించారు. ఈ నేపథ్యంలోఅర్జున్‌ గోవాకు మారాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి