AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs SA: పాక్ జట్టుతో ఇదే తంటా.. రివ్యూ తీసుకుంటే నాటౌటే కదా.. డెడ్ బాల్‌లో ఔట్ అవ్వడమేంటి సామీ..

పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాడు మహ్మద్ నవాజ్ ఔటవ్వడంలో చాలా నాటకీయ పరిణామాలు జరిగాయి.

PAK vs SA: పాక్ జట్టుతో ఇదే తంటా.. రివ్యూ తీసుకుంటే నాటౌటే కదా.. డెడ్ బాల్‌లో ఔట్ అవ్వడమేంటి సామీ..
Mohammad Nawaz Out Pak Vs Sa
Follow us
Venkata Chari

|

Updated on: Nov 03, 2022 | 8:45 PM

టీ20 ప్రపంచ కప్ 2022లో పాకిస్తాన్ జట్టు దక్షిణాఫ్రికాతో నాల్గవ మ్యాచ్ ఆడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో వర్షం కారణంగా పాకిస్థాన్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు ఆటగాడు మహ్మద్ నవాజ్ రాండ్ డెసిషన్‌తో ఔటయ్యాడు. అయితే ఇందులో నవాజ్ పొరపాటు కూడా ఉంది. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎలా ఔటయ్యాడంటే..

నవాజ్ బ్యాట్‌కు తగిలిన బంతి అతని ప్యాడ్‌కు తగిలింది. అయితే బౌలర్ అప్పీల్ చేయండంతో, అంపైర్ కూడా ఔటిచ్చాడు. దీంతో నవాజ్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. అయితే, రివ్యూ కోసం వెళ్లవచ్చనే ఉద్దేశ్యంతో పరుగు కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతను రనౌట్ అయ్యాడు. అయితే, అంపైర్ రన్ అవుట్ ఇచ్చాడని అనుకున్నాడు. కానీ, అంపైర్ అతడికి ఎల్బీడబ్ల్యూ అవుట్ ఇచ్చాడు. ఈ సందర్భంలో, సమీక్ష మహ్మద్ నవాజ్‌ను పూర్తిగా రక్షించగలదు. క్రికెట్ నిబంధనల కోణంలో చూస్తే అది డెడ్ బాల్. అతని బ్యాట్‌తో బంతి ప్యాడ్‌కు తగిలిందని రీప్లేలో స్పష్టంగా కనిపిస్తోంది. రివ్యూ తీసుకుంటే మాత్రం అతను కచ్చితంగా సేవ్ అయ్యేవాడు.

ఇవి కూడా చదవండి

అది డెడ్ బాల్‌లో రనౌట్ బ్రో..

అయితే, ఓసారి అంపైర్ రనౌట్ అయ్యాక.. ఆ బంతిని డెడ్ బాల్‌గా ప్రకటిస్తారు. ఇదే బాల్‌లో వారు రనౌట్‌కు ప్రయత్నించారు. ఈ క్రమంలో అతను రనౌట్ అయ్యాడు. ఇలా రివ్యూ తీసుకున్నా, అతను సేవ్ అయ్యాడు.

మరోసారి ఫ్లాపైన ఓపెనర్స్..

ఆఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ మరోసారి విఫలమయ్యారు. ఓపెనింగ్‌లో వచ్చిన కెప్టెన్ బాబర్ అజామ్ 15 బంతుల్లో 6 పరుగులు చేయగా, అతని భాగస్వామి మహ్మద్ రిజ్వాన్ 4 బంతుల్లో 4 పరుగులు చేశాడు. బాబర్ అజామ్ ఇప్పటివరకు టోర్నమెంట్ అంతటా నిరంతర ఫ్లాపులలో కనిపించాడు. ఈ ప్రపంచకప్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు.

ఈ ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ 22 బంతుల్లో 52 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇన్నింగ్స్‌లో 3 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇది కాకుండా ఇఫ్తికార్ అహ్మద్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. అదే సమయంలో మహ్మద్ నవాజ్ 22 బంతుల్లో 28 పరుగులు, మహ్మద్ హరీస్ 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 28 పరుగులు చేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..