Watch Video: బంగ్లా విజయాన్ని దూరం చేసిన 65 మీటర్ల దూరం.. మ్యాచ్‌ను మలుపు తిప్పిన సీన్ అదే..
వర్షానికి ముందు లిటన్ దాస్ కేవలం 21 బంతుల్లో అర్ధ సెంచరీ చేయడంతో బంగ్లాదేశ్‌కు బలమైన ఆరంభాన్ని అందించాడు. కానీ, వర్షం తర్వాత అంతా మారిపోయింది.
క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుంతో తెలియదు. ఎలాంటి బంతి, షాట్ లేదా ఫీల్డింగ్‌లో కొన్ని అద్భుతాలు మ్యాచ్ గమనాన్ని మారుస్తాయని అంటారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న T20 ప్రపంచ కప్‌లో నిరంతరం ఈసీన్స్ కనిపిస్తున్నాయి. అడిలైడ్‌లో జరిగిన ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఇలాంటిదే జరిగింది. ఇక్కడ పేలవమైన ఫీల్డింగ్ బంగ్లాదేశ్‌కు అద్భుతమైన ప్రారంభానికి సహాయపడింది. అయితే వర్షంతో అంతరాయం తర్వాత టీమిండియా సత్తా చాటింది. ఫీల్డింగ్‌లో మొదలైన ఈ మార్పు.. క్రమంగా బౌలింగ్‌లోకి చేరింది. దీంతో భారత్ మ్యాచ్‌లోకి తిరిగి వచ్చేలా చేసింది. దీన్ని కేఎల్ రాహుల్ చేసి చూపించాడు. బంగ్లా నుంచి బాధితుడిగా లిటన్ దాస్ మారాడు. అంతకు ముందు మెరుపు హాఫ్ సెంచరీతో హీరోగా మారి, టీమిండియా బౌలర్లను చితకబాదిన దాస్.. వర్షానంతరం జీరోగా మిగిలాడు.
అడిలైడ్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు బంగ్లాదేశ్ ముందు 185 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం, బంగ్లాదేశ్‌కు లిటన్ దాస్ అద్భుతమైన ప్రారంభాన్ని అందించాడు. కేవలం 21 బంతుల్లో అర్ధ సెంచరీని సాధించాడు. ఈ సమయంలో దినేష్ కార్తీక్ నుంచి లైఫ్ అందుకున్నాడు. దానిని లిటన్ సద్వినియోగం చేసుకున్న దాస్ మరింత రెచ్చిపోయాడు. అయితే, 7వ ఓవర్‌లో వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది. ఈ సమయానికి బంగ్లాదేశ్ స్కోరు 66 పరుగులుగా నిలిచింది.
వర్షం తర్వాత రెచ్చిపోయిన రాహుల్..
వర్షం తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. బంగ్లాదేశ్ మరోసారి లిటన్ దాస్ నుంచి అదే అటాకింగ్ ఇన్నింగ్స్‌ని ఆశించింది. కానీ, రెండవ బంతికి, టీమిండియా భారీ విజయాన్ని సాధించింది. నజ్ముల్ శాంటో అశ్విన్ వేసిన బంతిని డీప్ మిడ్ వికెట్ వైపు ఆడాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు ఓ పరుగు పూర్తి చేసి, రెండో పరుగు తీస్తున్న క్రమంలో వచ్చిన ఓ అద్భుత అవకాశాన్ని టీమిండియా చేజార్చుకోలేదు.
ఇక్కడే కేఎల్ రాహుల్ అద్భుత ఫీల్డింగ్‌ను ప్రదర్శించాడు. బౌండరీ నుంచి వేగంగా అంటే దాదాపు 65 మీటర్ల దూరం నుంచి బంతిని నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు విసిరాడు. ఈ బంతి నేరుగా స్టంప్‌ని తాకి బెయిల్స్‌ను పడేసింది.
లిటన్ దాస్ ఇన్నింగ్స్ ముగింపు..
View this post on Instagram
లిటన్ తన శాయశక్తులా ప్రయత్నించి డైవ్ కూడా చేశాడు. కానీ, క్రీజులోకి రాలేకపోయాడు. ఇది భారత్‌కు తొలి వికెట్‌ను అందించడమే కాకుండా అత్యంత ముఖ్యమైన వికెట్‌గా మారింది. నిజానికి, లిటన్ రెండో పరుగు తీస్తున్న క్రమంలో జారిపోయాడు. అయినప్పటికీ, రాహుల్ విసిరిన బంతి స్ట్రెయిట్ త్రో అద్భుతంగా వికెట్లను పడగొట్టింది. దీంతో లిటన్ ఇన్నింగ్స్‌ను ముగించింది.
కాగా, కేఎల్ రాహుల్ తన బ్యాటింగ్‌తోనూ అద్భుతాలు చేశాడు. పేలవమైన ఫామ్‌లో ఉన్న రాహుల్‌కి ఈసారి కూడా అవకాశం లభించింది. ఈసారి అతను మేనేజ్‌మెంట్ నమ్మకాన్ని వమ్ము చేయలేదు. రాహుల్ 32 బంతుల్లో 50 పరుగులు చేసి భారత్‌కు శుభారంభం అందించాడు. ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాటర్.. క్రీజులో నిలవలేకపోయారు. వర్షం ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ 7 ఓవర్లలో 66 పరుగులు చేసి ఒక్క వికెట్ కూడా నష్టపోలేదు. వర్షం అంతరాయంతో బంగ్లాదేశ్‌కు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 16 ఓవర్లలో 151 పరుగుల లక్ష్యాన్ని సవరించారు. లక్ష్యాన్ని చేరుకోలకపోయిన బంగ్లా టీం 6 వికెట్లు కోల్పోయి 145 పరుగుల వద్దే ఆగిపోయింది.