AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs BAN Match Report: ఉత్కంఠ పోరులో బంగ్లాపై విజయం.. సెమీస్‌ రేసులోకి టీమిండియా..

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి, సెమీస్ రేసులోకి ఎంట్రీ ఇచ్చింది.

IND vs BAN Match Report: ఉత్కంఠ పోరులో బంగ్లాపై విజయం.. సెమీస్‌ రేసులోకి టీమిండియా..
Ind Vs Ban Match Result
Venkata Chari
|

Updated on: Nov 02, 2022 | 6:12 PM

Share

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి, సెమీస్ రేసులోకి ఎంట్రీ ఇచ్చింది. ఎలాంటి సమీకరనాల తోడు లేకుండానే రోహిత్ సేన సెమీస్‌లో అడుగుపెట్టనుంది. చివరి ఓవర్‌ చివరి బంతి వరకు చేరిన ఈ మ్యాచ్ ఫలితం.. చాలా ఉత్కంఠగా సాగింది. చివరకు టీమిండియా 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్‌ ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ అద్భుతంగా ఆరంభించాడు. వర్షం ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ 7 ఓవర్లలో 66 పరుగులు చేసి ఒక్క వికెట్ కూడా నష్టపోలేదు. అయితే వర్షం అంతరాయంతో బంగ్లాదేశ్‌కు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం 16 ఓవర్లలో 151 పరుగుల లక్ష్యాన్ని సవరించారు. లక్ష్యాన్ని చేరుకోలకపోయిన బంగ్లా టీం 6 వికెట్లు కోల్పోయి 145 పరుగుల వద్దే ఆగిపోయింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి 44 బంతుల్లో 64 పరుగులతో ఆకట్టుకున్నాడు. అదే సమయంలో కేఎల్ రాహుల్ కూడా ఫామ్‌లోకి వచ్చి 32 బంతుల్లో 50 పరుగులు చేశాడు.

185 పరుగులు టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ టీం.. 7 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ టీం వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. ఇంతలో భారీ వర్షం మొదలైంది. భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పవర్ ప్లేలో భారీ స్కోర్ సాధించింది. దీంతో వర్షంతో మ్యాచ్ రిజల్ట్ డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో అంతా బంగ్లాదే విజయం అనుకున్నారు. కానీ, వర్షం ఆగిపోవడంతో ఆటను ప్రారంభించారు. డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్‌ను 16 ఓవర్లకు 151 పరుగులుగా డిసైడ్ చేశారు. అంటే 54 బంతుల్లో 85 పరుగులు సాధించాలి. ఈ క్రమంలో బంగ్లాదేశ్ టీం ఒత్తిడిలోకి జారుకుని, హిట్టింగ్ చేసే క్రమంలో వరుసగా వికెట్లను కోల్పోయింది.

ఇవి కూడా చదవండి

పాయింట్ల పట్టికలో అగ్రస్థానం..

ఈ విజయంతో టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట్లో గెలిచిన రోహిత్ సేన 6 పాయింట్లతో అగ్రస్థానంలోకి చేరింది. 5 పాయింట్లతో సౌతాఫ్రికా రెండో స్థానంలో నిలిచింది. ఇక 4 పాయింట్లతో బంగ్లా టీం మూడో స్థానంలోనే మిగిలింది.

గ్రూప్ B (సూపర్ 12) పాయింట్ల పట్టిక..

క్రమ సంఖ్య జట్టు ఆడింది గెలిచింది ఓడిపోయినవి N/R టై NET RR పాయింట్లు
1 భారతదేశంభారతదేశం 4 3 1 0 0 +0.730 6
2 దక్షిణ ఆఫ్రికాదక్షిణ ఆఫ్రికా 3 2 0 1 0 +2.772 5
3 బంగ్లాదేశ్బంగ్లాదేశ్ 4 2 2 0 0 -1.276 4
4 జింబాబ్వేజింబాబ్వే 4 1 2 1 0 -0.313 3
5 పాకిస్తాన్పాకిస్తాన్ 3 1 2 0 0 +0.765 2
6 నెదర్లాండ్స్నెదర్లాండ్స్ 4 1 3 0 0 -1.233 2

భారత ప్లేయింగ్ XI:

కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్

బంగ్లాదేశ్ ప్లేయింగ్ XI:

నజ్ముల్ హొస్సేన్ శాంటో, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), అఫీఫ్ హుస్సేన్, యాసిర్ అలీ, మొసద్దెక్ హొస్సేన్, షోరిఫుల్ ఇస్లాం, నూరుల్ హసన్(కీపర్), ముస్తాఫిజుర్ రెహ్మాన్, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..