వర్షంతో ఆగిన ఆట.. డీఎల్‌ఎస్ ప్రకారం బంగ్లాకే గెలిచే అవకాశాలు.. రోహిత్ సేనకు భారీ షాక్?
వర్షంతో మ్యాచ్ రిజల్ట్ డక్ వర్త్ లూయిస్ పద్ధతికి చేరితే మాత్రం.. బంగ్లాదే విజయం కానుంది. డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు 17 పరుగుల ముందుంది.
7 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ టీం వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. ఇంతలో భారీ వర్షం మొదలైంది. అయితే, ఓ స్ట్రాటజీతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. భారత్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొని పవర్ ప్లేలో భారీ స్కోర్ సాధించింది. దీంతో వర్షంతో మ్యాచ్ రిజల్ట్ డక్ వర్త్ లూయిస్ పద్ధతికి చేరితే మాత్రం.. బంగ్లాదే విజయం కానుంది. డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ జట్టు 17 పరుగుల ముందుంది. ఇదే జరిగితే మాత్రం టీమిండియాకు సెమీస్ గండం నుంచి తప్పుకునే ప్రమాదం ఉంది. వాతావరణంలో మార్పులతోనే బంగ్లాదేశ్ టీం పవర్ ప్లేలో 10 రన్ రేట్‌తో పరుగులు సాధించింది.
టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతేనా?
ప్రస్తుతం భారత జట్టు గ్రూప్-2లో 3 మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక ఓటమితో 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో బంగ్లాదేశ్ జట్టు కూడా అదే సంఖ్యలో మ్యాచ్‌లు ఆడి 4 పాయింట్లతో మూడవ స్థానంలో ఉంది. మెరుగైన నెట్ రేట్ కారణంగా భారత్ ప్రస్తుతం బంగ్లాదేశ్ కంటే ముందుంది.
ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ సెమీఫైనల్‌కు చేరుకోవడం సులువవుతుంది. అదే సమయంలో బంగ్లాదేశ్ ఓడిపోతే ఈ టోర్నీ నుంచి దాదాపు ఔట్ అవుతుంది. ఈ మ్యాచ్ తర్వాత బంగ్లాదేశ్ చివరి మ్యాచ్ పాకిస్థాన్‌తో జరగనుండగా, భారత్ జింబాబ్వేతో ఆడాల్సి ఉంది.
కీలకం కానున్న రన్ రేట్..
ఒకవేళ బంగ్లాదేశ్‌తో భారత జట్టు ఓడిపోతే.. సెమీస్ దారి కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితిలో చివరి మ్యాచ్‌లో జింబాబ్వేపై గెలిచినప్పటికీ, భారత్ గరిష్టంగా 6 పాయింట్లను మాత్రమే కలిగి ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, పాకిస్తాన్ తన చివరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే, అది కూడా 6 పాయింట్లను పొందుతుంది. అప్పుడు మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న జట్టు లాభపడుతుంది.
ఒకవేళ భారత్ ఓడిపోతే బంగ్లాదేశ్‌కు కూడా అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. భారత్ తర్వాత పాకిస్థాన్‌ను ఓడిస్తే పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో ఉంటుంది. ఈ సమీకరణాలను చూస్తుంటే భారత్‌కు బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఒక విధంగా నాకౌట్ అని చెప్పవచ్చు. ఒకవేళ ఓటమి ఎదురైతే, భారత్‌కు సెమీస్ మార్గం చాలా కఠినం కావచ్చు.
అంతకుముందు, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 184 పరుగలు చేసింది. దీంతో బంగ్లాదేశ్ ముందు 185 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. రోహిత్ శర్మ తొందరగానే ఔటయ్యాడు. కేఎల్ రాహుల్-విరాట్ కోహ్లీ మధ్య 67 పరుగుల భాగస్వామ్యం, కోహ్లీ-సూర్యకుమార్ మధ్య 38 పరుగుల భాగస్వామ్యం నెలకొంది. ఈ క్రమంలో రాహుల్ 50, కోహ్లీ 64 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. సూర్య మాత్రం 187 స్ట్రైక్ రేట్‌తో 30 పరుగులు చేశాడు. చివర్లో అశ్విన్ 6 బంతుల్లో 1 సిక్స్, 1 ఫోర్‌తో 13 పరుగులు చేశాడు. బంగ్లా బౌలర్లలో హసన్ 3, షకిబ్ ల్ హసన్ 2 వికెట్లు పడగొట్టారు.