IPL 2023: గత సీజన్‌లో వైఫల్యం.. పంజాబ్ కింగ్స్ సారథిపై వేటు.. కొత్తగా ఎవరంటే?

Shikhar Dhawan: పంజాబ్ కింగ్స్ గత సీజన్‌లోనే శిఖర్ ధావన్‌ను కొనుగోలు చేసింది. ఇప్పుడు అతడిని కెప్టెన్‌గా చేయడం ద్వారా పెద్ద బాధ్యతను అప్పగించింది.

IPL 2023: గత సీజన్‌లో వైఫల్యం.. పంజాబ్ కింగ్స్ సారథిపై వేటు.. కొత్తగా ఎవరంటే?
Mayank Agarwal
Follow us

|

Updated on: Nov 03, 2022 | 12:44 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023కి ముందు, పంజాబ్ కింగ్స్ జట్టులో పెద్ద మార్పు వచ్చింది. మయాంక్ అగర్వాల్ స్థానంలో శిఖర్ ధావన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ధావన్ అనుభవజ్ఞుడైన ఆటగాడే కాదు, ఇటీవలి కాలంలో భారత జట్టుకు కెప్టెన్‌గా కూడా కనిపిస్తున్నాడు. న్యూజిలాండ్‌ టూర్‌లో జరగనున్న వన్డే సిరీస్‌కు భారత జట్టుకు ధావన్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అంతకుముందు దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. మయాంక్ కంటే ధావన్‌కు కెప్టెన్సీ అనుభవం ఎక్కువగా ఉంది. అందుకే పంజాబ్‌కు మంచి ఎంపిక కావచ్చని తెలుస్తోంది.

గత సీజన్‌లోనే ధావన్‌ను కెప్టెన్‌గా చేయాలని పంజాబ్ ప్రయత్నాలు చేసింది. అయితే చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుని మయాంక్‌ను కెప్టెన్‌గా నియమించింది. గత సీజన్‌లో మయాంక్ కెప్టెన్సీలో జట్టు ప్రదర్శన ఆశినంతగా లేకపోవడంతో ఆ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. వచ్చే సీజన్‌లో ధావన్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ సరికొత్తగా రాణించడానికి ప్రయత్నించనుంది.

ఇవి కూడా చదవండి

గత సీజన్‌లో ఆకట్టుకున్న ధావన్..

బ్యాటింగ్‌లోనూ గత సీజన్‌లో మయాంక్‌ కంటే ధావన్‌ మెరుగ్గా రాణించాడు. ధావన్ 14 మ్యాచ్‌ల్లో 38.33 సగటుతో 460 పరుగులు చేసి పంజాబ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ధావన్ బ్యాటింగ్‌లో మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక స్కోరు అజేయంగా 88లుగా నిలిచింది. మయాంక్ 12 ఇన్నింగ్స్‌ల్లో 16.33 సగటుతో 196 పరుగులు మాత్రమే చేశాడు. మయాంక్‌ బ్యాట్‌ నుంచి ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే నమోదైంది.

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.