AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup: కోహ్లిపై ఫేక్ ఆరోపణలు.. చిక్కుల్లో బంగ్లా కీపర్.. చర్యలు తీసుకునే ఛాన్స్.. ఎలాగంటే?

IND vs BAN: భారత్ 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. అయితే మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నూరుల్ హసన్ కోహ్లీని నిజాయితీపరుడు కాదని ఆరోపణలు గుప్పించాడు.

T20 World Cup: కోహ్లిపై ఫేక్ ఆరోపణలు.. చిక్కుల్లో బంగ్లా కీపర్.. చర్యలు తీసుకునే ఛాన్స్.. ఎలాగంటే?
India Vs Bangladesh Match Issue
Follow us
Venkata Chari

|

Updated on: Nov 03, 2022 | 8:02 PM

టీ20 ప్రపంచకప్‌లో భారత క్రికెట్ జట్టు మూడు మ్యాచ్‌లు గెలిచి సెమీస్ రేసులో దూసుకపోతోంది. చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే భారత్ సాధించిన ఈ విజయంపై బంగ్లాదేశ్, పాక్ అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నూరుల్ హసన్ కూడా విరాట్ కోహ్లి నిజాయితీపరుడు కాదని ఆరోపించారు. కానీ ఈ ఆరోపణ వారి మెడకు చుట్టుకుంటుందని, వారిపై చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది.

నవంబర్ 2 బుధవారం అడిలైడ్‌లో భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ తలపడ్డాయి. ఇందులో వర్షం అంతరాయం కలిగించిన సంగతి తెలిసిందే. వర్షం ధాటికి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ఛిన్నాభిన్నం కావడంతో విజయానికి అతి చేరువలో పరాజయం చవిచూడాల్సి వచ్చింది. అయితే మ్యాచ్ అనంతరం హసన్ కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ అని ఆరోపించాడు. వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోయే ముందు, ఏడో ఓవర్‌లో ఫేక్ త్రో చేశాడని, అందులో తమ జట్టుకు పెనాల్టీగా ఐదు పరుగులు రావాల్సి ఉందని, కానీ, అది రాలేదని హసన్ ఆరోపించాడు.

ఫేక్ ఫీల్డింగ్ కేసు ఏమిటి?

నిజానికి, ఏడో ఓవర్‌లో నజ్ముల్ శాంటో, లిట్టన్ దాస్ ఒక షాట్‌పై రెండు పరుగులు చేస్తున్నారు. ఈ సమయంలో, అర్ష్‌దీప్ సింగ్ బంతిని విసిరాడు. దానిపై పాయింట్ పొజిషన్‌లో నిలబడిన కోహ్లి రిలే త్రో యాక్షన్ చేస్తూ కీపర్ వైపు విసిరినట్లు నటించాడు. ICC నిబంధనలలోని రూల్ 41.5 ప్రకారం, ఫీల్డింగ్ జట్టు బ్యాట్స్‌మన్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం లేదా దృష్టి మరల్చకూడదు.

ఇవి కూడా చదవండి

ఆటగాడు నిబంధనను ఉల్లంఘించినట్లు అంపైర్ భావిస్తే, అతను డెడ్ బాల్‌ను ప్రకటించి, ఐదు పరుగుల పెనాల్టీని ఇవ్వవచ్చు.

నిబంధనలను అర్థం చేసుకోవడంలో పొరపాటు.. చర్యలు తీసుకునే ఛాన్స్..

ఇక్కడ ఉన్న సమస్యను బంగ్లా కీపర్ అర్థం చేసుకోలేకోయాడు. నిబంధనల ప్రకారం, ‘ఫేక్ ఫీల్డింగ్’ బ్యాట్స్‌మెన్‌ల దృష్టి మరల్చినా లేదా అడ్డగించినా, దానిపై చర్య తీసుకోవచ్చు. వీడియో చూస్తుంటే ఇద్దరు బ్యాట్స్‌మెన్ కోహ్లీ వైపు చూడలేదని తేలింది. అంటే కోహ్లి ఇలాంటి పని చేశాడని అతనికి కూడా తెలియదు.

అటువంటి పరిస్థితిలో, నూరుల్ ఆరోపణలపై ప్రశ్నలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో అతనిపై మాత్రమే చర్య తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి, మ్యాచ్ సమయంలో లేదా మ్యాచ్ తర్వాత మ్యాచ్ అధికారుల నిర్ణయాలను విమర్శించే ఆటగాడిపై ICC నియమాలు చర్యలు తీసుకుంటాయి. అటువంటి పరిస్థితిలో, నిబంధనలను తప్పుగా చూపించి, అంపైర్లను విమర్శించినందుకు వారిపై చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..