T20 World Cup: 2022 ఆ బలహీనతలే భారత్ కొంపముంచేస్తాయ్.. బంగ్లాపై మరోసారి అదే తడబాటు..
Team India: ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలంటే, ప్రత్యర్థిపై బ్యాటింగ్ ఆధిపత్యం సాధించాలి. కానీ, టోర్నమెంట్‌లో మనం ఇప్పటివరకు భారత జట్టు నుంచి అదే చూడలేదు.
బంగ్లాదేశ్‌పై చివరి బంతికి విజయం సాధించి, టీ20 ప్రపంచ కప్‌లో సెమీ-ఫైనల్‌లోకి ప్రవేశించడానికి ముందు భారత్ కొన్ని ఉత్కంట క్షణాలను ఎదుర్కొంది . బంగ్లాదేశ్‌ను 5 పరుగుల తేడాతో ఓడించి గ్రూప్ 2లో అగ్రస్థానానికి చేరుకోవడంతో అడిలైడ్‌లో బుధవారం జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో భారత్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ మ్యాచ్ ఇంత దగ్గరగా జరగాలని మేం కోరుకోలేదు’ అని విరాట్ కోహ్లి తన అజేయ అర్ధ సెంచరీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న సమయంలో చెప్పుకొచ్చాడు.
పవర్ ప్లేలో తేలిపోయిన భారత బౌలర్లు..
అనుభవజ్ఞుడైన బంగ్లా బ్యాటర్ లిటన్ దాస్ భారత బౌలర్ల దాడిని సమర్థవంతంగా అడ్డుకొని, పవర్‌ప్లేలో దంచి కొట్టాడు. అతను భారత సీమర్లను దృష్టిలో ఉంచుకుని మైదానం చుట్టూ వినూత్న షాట్లను ఆడాడు. అతని ఆధిపత్యంతో పవర్‌ప్లే ముగిసే సమయానికి బంగ్లాదేశ్ వికెట్ నష్టపోకుండా 60 పరుగులు చేసింది. ఇందులో దాస్ 56 పరుగులు చేయడం గమనార్హం.
వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి బంగ్లాదేశ్ 7వ ఓవర్లో వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. దాస్‌ను వెనక్కి పంపాలని భారత్ తహతహలాడింది. అయితే బౌలర్లు మాత్రం.. తమ బలహీనతలను మరోసారి ప్రదర్శించారు. ఇదే బలహీనతలతో సెమీస్ ఆడడం అంటే చాలా కష్టమేనని తెలుస్తోంది.
కేఎల్ రాహుల్ మెరుపు ఫీల్డిండ్‌తో మారిన మ్యాచ్..
డీఎల్ఎస్ విధానంలో కుదించిన లక్ష్యంతో వర్షం విరామం తర్వాత ఆట తిరిగి ప్రారంభమైంది. బంగ్లాదేశ్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. రవి అశ్విన్ బౌలింగ్‌లో శాంటో మిడ్ వికెట్ వైపు ఓ బంతిని ఆడాడు. రెండు పరుగుల కోసం ఇద్దరు బ్యాటర్లు ప్రయత్నించారు. అయితే, కేఎల్ రాహుల్ బంతిని అందుకుని వేగంగా విసిరాడు. ఈ అద్భుతమైన త్రో స్టంప్స్‌ను పడగొట్టింది. దాస్ 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి వెనుదిరిగాడు.
“కేఎల్ రాహుల్ చేసిన ఆ ఫీల్డింగ్ మ్యాచ్‌నే మార్చేసింది. అతను వర్షం తర్వాత ఛార్జింగ్‌తో వచ్చి, అద్భుతమైన త్రోతో స్టంప్‌లను పడగొట్టాడు. ఇదే మ్యాచ్ గమనాన్ని మార్చేసింది” అని కె శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. దాస్ రనౌట్ టర్నింగ్ పాయింట్ అని రవిశాస్త్రి కూడా అంగీకరించాడు.
భారత ఫీల్డర్లు మునుపటి మ్యాచ్‌లో తమ పేలవమైన క్యాచింగ్‌కు బదులు తీర్చుకున్నారు . వారికి వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ రెండు కష్టతరమైన క్యాచ్‌లు పట్టడంతో భారత ఆటగాళ్లు బంగ్లాదేశ్‌ను ఓడించారు.
డెత్ ఓవర్లలో అర్షదీప్ హవా..
అర్ష్‌దీప్ సింగ్ మంచి బౌలింగ్ కూడా జట్టుకు సహకరించింది. యువ ఎడమచేతి వాటం ఆటగాడు చివరి ఓవర్ బౌలింగ్ చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. నిరాశ చెందలేదు. జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడంతో టీమ్ మేనేజ్‌మెంట్ అతనిపై ఎందుకు నమ్మకం ఉంచిదో కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం చెప్పుకొచ్చాడు. ఈ యువ బౌలర్‌ను ప్రశంసించాడు. “ఇది అంత తేలికైన పని కాదు, కానీ అతను చాలా బాగా చేశాడు” అని రోహిత్ అన్నాడు.
మంచి పేస్ బౌలింగ్ ఏ జట్టునైనా ఒత్తిడికి గురి చేస్తుంది. కానీ, భారత్ విషయంతో కొన్నిసార్లు ఇది తప్పుగా మారుతోంది. తస్కిన్ అహ్మద్ మంచి పేస్‌తో సరైన ప్రాంతాల్లో బౌలింగ్ చేశాడు. అతను చాలాసార్లు టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చడంలో సిద్ధహస్తుడు. ఇతర బౌలర్లు వికెట్లు తీయడానికి మార్గం సుగమం చేయడంతో అతను వికెట్ల మధ్య లేకపోవడం బంగ్లాకు దురదృష్టకరం.
ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలంటే, ప్రత్యర్థిపై బ్యాటింగ్ ఆధిపత్యం సాధించాలి. కానీ, టోర్నమెంట్‌లో మనం ఇప్పటివరకు భారత జట్టు నుంచి చూడలేదు.
అడిలైడ్‌లో 184 పరుగులు మంచి స్కోర్ అని ఎవరైనా వాదించవచ్చు. అయితే షార్ట్ స్క్వేర్ బౌండరీని ఎక్కువగా ఉపయోగించినట్లయితే భారత జట్టు మరింత స్కోర్ చేయగలదు. నిజానికి కోహ్లి చేసిన మరో ఫిఫ్టీ కారణంగా భారత్ 184 పరుగులకు చేరుకోగలిగింది. కేఎల్ రాహుల్ కూడా అద్భుత ఇన్నింగ్స్‌తో హాఫ్ సెంచరీ చేశాడు. అలాగే సూర్యకుమార్ యాదవ్ తుఫాన్ హిట్టింగ్‌లతో ఆకట్టుకున్నాడు. ఇలాంటి భారీ బ్యాటర్లు టాప్ ఆర్డర్‌లో ఉన్నప్పుడు ఈ స్కోర్ చాలా తక్కువగా అనిపించింది.
బలమైన బ్యాటింగ్ లైనప్‌తో భారీ స్కోర్లు రావాల్సిందే..
స్కోర్ ప్రిడిక్టర్ 5 ఓవర్లు ముగిసే సమయానికి 180 చూపించింది. కానీ, భారత జట్టు దానిని దాటి ముందుకు వెళ్లలేకపోయారు. ఫినిషర్‌గా దినేష్ కార్తీక్ జట్టులో ఉన్నాడు. కానీ, అతను మంచి ప్రదర్శనలో విఫలమయ్యాడు. టోర్నమెంట్ ముగింపు దశకు వెళ్లి మరింత సిద్ధమైన జట్లతో తలపడేటప్పుడు ఈ బలహీనత భారత్‌ను దెబ్బతీయవచ్చు.
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ నాకౌట్ దశలో ఆడినట్లేనని భారత జట్టు భావించలేదు. మరికాస్త జాగ్రత్తగా ఆడి ఉంటే ఫలితం భారీగా ఉండేది. సెమీస్‌లో ఆడేటప్పుడు మరింత బలంగా ముందుకు సాగాలి. వచ్చిన అవకాశాలను వదులుకోకూడదు. లేదంలే ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..