AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: బరిలోకి దిగితే బీభత్సం.. ఛేజింగ్‌ చేస్తే ప్రత్యర్థులకు చుక్కలే.. కింగ్ కోహ్లీ కెరీర్‌లో టాప్ 5 ఇన్నింగ్స్‌లు ఇవే..

Virat Kohli Birthday Special: ఈరోజు విరాట్ కోహ్లీ 34వ పుట్టినరోజు. కోహ్లీ పుట్టినరోజున ఆయన అభిమానులు సంబరాలు చేసుకునే ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన ఓ 5 ఇన్నింగ్స్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Virat Kohli: బరిలోకి దిగితే బీభత్సం.. ఛేజింగ్‌ చేస్తే ప్రత్యర్థులకు చుక్కలే.. కింగ్ కోహ్లీ కెరీర్‌లో టాప్ 5 ఇన్నింగ్స్‌లు ఇవే..
Virat Kohli Birthday Special
Venkata Chari
|

Updated on: Nov 05, 2022 | 9:10 AM

Share

టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి బ్యాట్ పరుగులు పెడుతోంది. ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 4 మ్యాచ్‌ల్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20 ప్రపంచకప్‌ ఆరంభంలో భారత్‌ పాకిస్థాన్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో అతను 53 బంతుల్లో అజేయంగా 82 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ మొత్తం క్రికెట్ అభిమానులు గర్వపడే అవకాశాన్ని ఇచ్చింది. ఈరోజు విరాట్ కోహ్లీ 34వ పుట్టినరోజు. కోహ్లీ పుట్టినరోజున ఆయన అభిమానులు సంబరాలు చేసుకునే ప్రత్యర్థులకు చెమటలు పట్టించిన ఓ 5 ఇన్నింగ్స్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. టీ20 ప్రపంచ కప్ 2022 – పాకిస్తాన్‌పై 82 పరుగులు..

భారత క్రికెట్ అభిమానులు 2022 అక్టోబర్ 23ని గుర్తుంచుకోవాలని కోరుకుంటారు. ఆ రోజు భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. ఇందులో విరాట్ కోహ్లీ తన అద్భుత ఆటతీరుతో భారత అభిమానులను భావోద్వేగానికి గురి చేశాడు. పాకిస్థాన్‌పై విజయం కోసం చరిత్రాత్మక స్క్రిప్ట్‌ను రచించిన కోహ్లి.. 53 బంతుల్లో 82 పరుగులతో చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 6 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. రవూఫ్ వేసిన ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాది పాకిస్తాన్ జట్టు నుంచి విజయాన్ని లాగేసుకున్నాడు.

2. టీ20 వరల్డ్ కప్ 2016 – ఆస్ట్రేలియాపై 82 నాటౌట్..

టీ20 వరల్డ్ కప్ 2016లో కూడా విరాట్ మొహాలీ స్టేడియంలో ఆస్ట్రేలియాతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియన్ బౌలర్ జేమ్స్ ఫాల్క్‌నర్ భీకరమైన బంతులపై కోహ్లి విరుచుకుపడ్డాడు. కోహ్లి అజేయంగా 82 పరుగులతో భారత్‌కు మ్యాచ్‌ను గెలిపించాడు.

3. ఆసియా కప్ 2012 – పాకిస్థాన్‌పై 183 పరుగులు..

ఆసియా కప్‌లో భాగంగా బంగ్లాదేశ్ వేదికగా జరిగిన భారత్-పాకిస్థాన్ మధ్య హోరాహోరీ పోరులో ఈ ఛేజింగ్ మాస్టర్ రాణించాడు. ఈ ఒత్తిడి మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 329 పరుగులు చేసింది. జవాబుగా భారత జట్టు పేలవంగా ప్రారంభించింది. గౌతం గంభీర్ సున్నాతో ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విరాట్ కోహ్లి ఒత్తిడిని ఎదుర్కొని 22 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 183 పరుగుల అత్యధిక స్కోరును నమోదు చేశాడు. విరాట్‌ ఇన్నింగ్స్‌ కారణంగా భారత్‌ 48 ఓవర్లలోనే విజయం సాధించింది.

4. టెస్ట్ సిరీస్ ఆస్ట్రేలియా అడిలైడ్ 2014 రెండో ఇన్నింగ్స్‌లో 141 పరుగులు..

టెస్టు కెప్టెన్‌గా కోహ్లికి ఇదే తొలి టెస్టు మ్యాచ్. ఆ సిరీస్‌లో భారత కెప్టెన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మైదానం అంతా షాట్లు కొడుతూ ఆస్ట్రేలియా బౌలర్లను చిత్తు చేశాడు. ఆ రోజు కోహ్లీ తన బ్యాటింగ్‌లో 141 పరుగులు చేశాడు. ఈ సెంచరీ రెండో ఇన్నింగ్స్‌లో వచ్చింది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ సాధించాడు.

5. ఇంగ్లండ్ ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 149 పరుగుల ఇన్నింగ్స్..

ఈ మ్యాచ్‌లో భారత్ ఒక దశలో 100 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత విరాట్ కోహ్లి ఒక ఎండ్ నుంచి ఇంగ్లండ్ బౌలర్లపై దాడి చేస్తూ ఇంగ్లండ్ గడ్డపై తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. విరాట్ కోహ్లి క్రికెట్ కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇదొకటి నిలిచింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..