Health Tips: మీ నాలుక రంగు.. మీ ఆరోగ్యాన్ని చెప్పేస్తుంది.. ఆ రంగులోకి మారితే గుండె జబ్బుకు సంకేతం!
ముఖ్యంగా డాక్టర్లు నాలుకను చూసే చాలా విషయాలు తెలుసుకుంటారు. నాలుక ఉన్న రంగును బట్టి మనకు ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నాయో మనం కూడా ఇట్టే సులభంగా తెలుసుకోవచ్చు.
నాలుక మన శరీరంలో ముఖ్యమైన భాగం. మనం నాలుకతో మాత్రమే ఆహారం రుచిని గుర్తించగలం. వీటన్నింటితో పాటు నాలుక రంగును బట్టి మన ఆరోగ్యం కూడా తెలుసుకోవచ్చు అని తెలిస్తే ఆశ్చర్యపోతారు. సాధారణంగానే డాక్టర్ల వద్దకు వెళ్లినప్పుడు ఈసహజంగానే వారు మన కళ్లు, గోర్లు, నాలుకలను పరిశీలించి మన ఆరోగ్యం గురించి తెలుసుకుంటారు. ఆయా భాగాల్లో వచ్చే మార్పులు, అవి కనిపించే రంగులను బట్టి వారు రోగి స్థితి గతులను అంచనా వేస్తుంటారు. అందుకు అనుగుణంగా వారు రోగులకు చికిత్స చేస్తారు. అయితే ముఖ్యంగా డాక్టర్లు నాలుకను చూసే చాలా విషయాలు తెలుసుకుంటారు. నాలుక ఉన్న రంగును బట్టి మనకు ఏయే అనారోగ్య సమస్యలు ఉన్నాయో మనం కూడా ఇట్టే సులభంగా తెలుసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆరోగ్య చిట్కాలు : మీ నాలుక రంగు మారుతున్నట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సందర్శించండి. ఇటీవల జరిగిన ఒక పరిశోధనలో..అనేక తీవ్రమైన వ్యాధుల ప్రారంభ లక్షణాలలో నాలుక రంగు మారుతుందని స్పష్టంగా పేర్కొన్నారు. తెలుపు రంగు నాలుక.. మీ నాలుక రంగు తెల్లగా ఉంటే అది తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మీ నాలుక తెల్లగా మారుతున్నప్పుడు, మీ శరీరం తీవ్రంగా డీహైడ్రేట్ అయినట్లు అర్థం. తెల్లటి నాలుక ల్యూకోప్లాకియా, నోటి లైకెన్ ప్లానస్, సిఫిలిస్ వంటి వ్యాధుల ప్రారంభ లక్షణాలను సూచిస్తుంది.
ఎరుపు నాలుక.. మీ నాలుక ఎరుపు రంగులో ఉంటే మీరు జ్వరం, ఇన్ఫెక్షన్ బారిన పడ్డారని అర్థం చేసుకోవాలి. నాలుక ఎర్రగా మారటంతో విటమిన్ B, ఐరన్ లోపాన్ని సూచిస్తుంది.
నల్ల నాలుక.. నాలుక నల్లబడటం అనేది తీవ్రమైన, తీవ్ర అనారోగ్యానికి సంకేతం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నల్లబడిన నాలుక క్యాన్సర్, ఫంగస్, అల్సర్ వంటి వ్యాధులను సూచిస్తుంది. గొంతులో బ్యాక్టీరియా లేదా ఫంగస్ కారణంగా, నాలుక రంగు తరచుగా నల్లగా మారుతుంది.
పసుపు నాలుక… పసుపు నాలుక అతిగా తినడం వల్ల కూడా వస్తుంది. నిర్జలీకరణం, కాలేయం, నోటిలో అధిక బ్యాక్టీరియా కారణంగా నాలుక రంగు పసుపు రంగులోకి మారుతుంది. దీంతో నోటి దుర్వాసన, అలసట, జ్వరం వంటి సమస్యలు వస్తాయి.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి