Horoscope Today: ఈ సమయంలో మీకు శుభయోగం.. వృత్తి రీత్యా లాభాలు పొందుతారు.. పట్టిందల్లా బంగారమే..

మీరు చేపట్టే పనిలో శ్రమ పెరిగినా విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగంలో తోటివారిని కలుపుకొనిపోవాలి. వీరికి శుభయోగం పట్టబోతోంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది.

Horoscope Today: ఈ సమయంలో మీకు శుభయోగం.. వృత్తి రీత్యా లాభాలు పొందుతారు.. పట్టిందల్లా బంగారమే..
Zodiac Sign
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 05, 2022 | 7:03 AM

జ్యోతిష్యంపై నమ్మకంతో చాలా మంది ఈ రోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. ఏ పనులు మొదలు పెట్టాలన్నా.. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. దీంతో తమ దినఫలాల వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఏ రాశుల వారికి ఎలా ఉంది? గ్రహాల గమనం ఎవరికి అనుకూలంగా ఉంటుంది ? ఎవరికి ఇబ్బందులు ఎదురవుతాయి? ఆ వివరాలను ఈ రోజు(నవంబర్‌ 5) శనివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

మేషం మేష రాశి వారికి ఇది అనువైన సమయం. వీరికి శుభయోగం పట్టబోతోంది. ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం ఉంటుంది. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోకండి. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. దైవారాధన మానవద్దు.

వృషభం వృషభ రాశి వారికి ప్రారంభించిన కార్యక్రమాలను తోటివారి సహకారంతో పూర్తిచేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఈ రోజు ఆదాయం నిలకడగా ఉన్నా, ఆచితూచి ఖర్చు చేయడం చాలా మంచిది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరించి అందరి మన్ననలను పొందుతారు. గణపతి ఆరాధన శుభకరం.

ఇవి కూడా చదవండి

మిథునం మిథున రాశి వారు ఈ రోజు ఆచితూచి వ్యవహరించటం మంచిది. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యాసాధ్యాలను అంచనా వేయవచ్చు. మీ మీ రంగాల్లో మీ పరిధిని మించిన విషయాల్లో తలదూర్చకండి. తోటి వారి సూచనలను పాటించడం ఉత్తమం. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.

కర్నాటకం కర్నాటక రాశి వారికి ఈ రోజు అనుకూలమైనదిగా చెప్పొచ్చు. మీరు చేపట్టే పనిలో శ్రమ పెరిగినా విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగంలో తోటివారిని కలుపుకొనిపోవాలి. అనవసర విషయాల గురించి సమయాన్ని వృథా చేయకండి. ఈశ్వర సందర్శనం శుభప్రదం.

సింహం సింహ రాశి వారికి ఈ రోజు మంచిరోజుగానే చెప్పాలి. మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. ఆర్ధికంగా మంచి ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సత్కాలక్షేపంతో కాలం ఆనందంగా గడుస్తుంది. ఇష్టదైవారాధన శుభకరం.

కన్య కన్యా రాశి వారికి ప్రయత్నకార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. బంధు,మిత్రులను కలుస్తారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల తుల రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. దైవబలం పెరుగుతుంది. హనుమత్ ఆరాధన శుభప్రదం.

వృశ్చికం వృశ్చిక రాశి వారికి ఈ రోజు కాస్త ఇబ్బందులు తప్పవని తెలుస్తుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. శివారాధన చేయాలి.

ధనుస్సు ధనుస్సు రాశి వారికి ఈ రోజు మధ్యమ ఫలితాలనిస్తుంది. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. అయినవారితో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. గిట్టనివారు తప్పుదోవ పట్టిస్తారు. చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు. దుర్గారాధన శుభప్రదం.

మకరం మకర రాశి వారికి ఈ రోజు శుభసమయంగా చెప్పాలి. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సహాయసహకారాలు అందుతాయి. ఆంజనేయ దర్శనం మంచిది.

కుంభం కుంభ రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉండనుంది. మీ మీ రంగాల్లో శ్రమ పెరిగినప్పటికీ పనులు విజయవంతంగా పూర్తవుతాయి.బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవాలి. దుర్గాదేవి స్తుతి శుభప్రదం.

మీనం మీన రాశివారికి సమయం కలిసి రానుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలంతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ఇష్టదైవారాధన మేలు చేస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి