Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandra Grahan: చంద్రగ్రహణ ప్రభావం ఏ ఏ రాశులపై ఏ విధంగా ఉండనుందో.. నివారణ చర్యలు ఏమిటో తెలుసుకోండి..

భారతదేశంలో ఇది సాయంత్రం 05.32 నుండి 06.18 వరకు మాత్రమే పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనుంది. గ్రహణం మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నమ్మకం. ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం ఆయా రాశులపై  కూడా కొంత ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

Chandra Grahan: చంద్రగ్రహణ ప్రభావం ఏ ఏ రాశులపై ఏ విధంగా ఉండనుందో.. నివారణ చర్యలు ఏమిటో తెలుసుకోండి..
Chandra Grahan 2022
Follow us
Surya Kala

|

Updated on: Nov 05, 2022 | 3:32 PM

ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇదే నెలలో సూర్యగ్రహణంతో పాటు.. 15 రోజుల వ్యవధిలోనే చంద్రగ్రహణం కూడా సంభవించలోటుండడం అరుదైన ఘటన అని పండితులు చెబుతున్నారు. నవంబర్ 08న చంద్ర గ్రహణం ఏర్పడనుంది. గ్రహణం మధ్యాహ్నం 02:39 నుండి ప్రారంభమవుతుంది.. సాయంత్రం 06.18 గంటలకు ముగుస్తుంది. అయితే భారతదేశంలో ఇది సాయంత్రం 05.32 నుండి 06.18 వరకు మాత్రమే పాక్షిక చంద్ర గ్రహణం ఏర్పడనుంది. గ్రహణం మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని నమ్మకం. ఈ సంవత్సరం చివరి చంద్రగ్రహణం ఆయా రాశులపై  కూడా కొంత ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. ఈరోజు చంద్ర గ్రహణ ప్రభావం ఏ ఏ రాశులపై ఎలా ఉంటుందో.. దానికి నివారణ చర్యలు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి ఈ రాశివారు ఆఫీసులో వివాదాలకు దూరంగా ఉండండి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి.  అదే సమయంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అదే సమయంలో ఈ రాశివారు ఆర్ధిక నష్టం, ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. పెట్టుబడిలకు దూరంగా ఉండండి.

వృషభ రాశి ఈ రాశుల వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అలాగే గ్రహణ సమయంలో పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. గ్రహణం ప్రభావం వల్ల మీరు డబ్బును కోల్పోవచ్చు. అంతేకాదు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురుకావొచ్చు.

ఇవి కూడా చదవండి

మిధునరాశి మిథున రాశి వారు గ్రహణ ప్రభావం వల్ల కొంచెం ఆందోళన చెందుతారు. కాబట్టి, ఓపికగా, విశ్వాసంతో ఉండండి. ఈ రాశివారు భార్యాభర్తల సంబంధం మరింత బలపడుతుంది. ఎవరిపైనా కోపం రాకుండా ఉండేలా ప్రయత్నించండి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది.

కర్కాటక రాశి: ఈ రాశివారు తమ పిల్లల విషయంలో శుభవార్తలను వింటారు. అయితే ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి. అలాగే, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

సింహ రాశి గ్రహణం ప్రభావం వల్ల మీ మనస్సు అసంతృప్తి, నిరాశతో ఉంటుంది. ఈ సమయంలో, మీరు మీ స్నేహితుల మద్దతు లభిస్తుంది. జీవితంలో కొత్త అవకాశాలు కూడా మీ అదృష్టానికి తలుపు తట్టవచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం మేలు.

కన్య రాశి: ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. మీ కుటుంబంలో కూడా విభేదాలు ఏర్పడవచ్చు. కన్య రాశి వారు కొత్త ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. లాభదాయకంగా ఉంటుంది.

తులరాశి ఈ రాశి వారికి ధార్మిక ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. కళ, సంగీతం పట్ల ఆసక్తి ఉన్న వారికి మంచి యోగం కలుగుతోంది. మీ స్వభావం కొద్దిగా చికాకు కలిగించే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి ఈ సమయంలో, మీ గురించి , మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. డబ్బును కోల్పోయే అవకాశం అధికంగా ఉంది. అధిక ఖర్చులు పెరగవచ్చు. ఉద్యోగంలో మార్పు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

ధనుస్సు   ధనుస్సు రాశి వారికి విశ్వాసం తగ్గుతుంది. మీ ఖర్చులు పెరుగుతాయి అలాగే మీరు ఏదైనా వివాదంలో చిక్కుకోవచ్చు.

మకరం  ఈ రాశి వారు ఆహ్లాదకరంగా గడుపుతారు. మనస్సు ఆనందంగా ఉంటుంది. విశ్వాసం కూడా పెరుగుతుంది. అయితే ఆఫీసులో పై అధికారులతో వివాదాలు ఏర్పడవచ్చు.

కుంభ రాశి కుంభ రాశి వారికి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితుని సహాయంతో మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మీ ప్రతిష్ట కూడా పెరుగుతుంది.

మీనరాశి ఈ రాశి వారు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మాటలను అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది. విశ్వాసం తక్కువగా ఉంటుంది. అయితే శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)