AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండె పరీక్షలను ఎన్ని నెలలకోసారి చేయించుకోవాలి…? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

వయస్సుతో సంబంధం లేకుండా ఎప్పుడు డాక్టర్‌ వద్దకు వెళ్లినా సరే..మీ బీపీ చెక్‌ చేయించుకోవటం మంచిది. కనీసం ఆరు నుండి 12 నెలలకు ఒకసారి మీ రక్తపోటును తనిఖీ చేసుకోవడం చాలా అవసరం.

గుండె పరీక్షలను ఎన్ని నెలలకోసారి చేయించుకోవాలి...? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Cardiac Arrest
Jyothi Gadda
|

Updated on: Nov 04, 2022 | 1:32 PM

Share

జీవితంలో ఏ దశలోనైనా గుండె ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. కానీ, 40 ఏళ్లు దాటిన తర్వాత, అవి మరింత కీలకంగా మారతాయి. కొన్ని వ్యాధులు ఆరోగ్యాన్ని మరింత క్షిణింపజేస్తాయి. అలాంటప్పుడు సంవత్సరానికి ఎన్నిసార్లు గుండె పరీక్ష చేయించుకోవాలో తెలుసా.? నిపుణులు చెబుతున్న దానిప్రకారం రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. మీరు గుండెను ప్రభావితం చేసే ఏవైనా జీవనశైలి సమస్యలతో బాధపడుతుంటే ఇది తప్పనిసరి. గుండె సంబంధిత వ్యాధులు ప్రస్తుతం పెరుగుతున్నాయి. అందువల్ల, మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, లక్షణాలపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండటం చాలా అవసరం.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారతీయులు గుండె సంబంధిత సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. వారు తమ పాశ్చాత్య, జపనీస్ ప్రత్యర్ధుల కంటే 15 నుండి 20 సంవత్సరాల ముందు మరణాలు సంభవిస్తున్నాయి.. నేడు యువకులలో కూడా కార్డియాక్ అరెస్ట్‌లు, మరణాల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిందని నిపుణులు తెలిపారు. అకస్మాత్తుగా గుండెపోటు లేదా గుండె సంబంధిత వ్యాధిని గమనించినట్లయితే సరైన సమయంలో చికిత్స పొందడం కష్టం. అందువల్ల మనం ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ లేదా కరోనరీ ఆర్టరీ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉందా లేదా అని అర్థం చేసుకోవడం, గుర్తించడం చాలా అవసరం.

వయస్సుతో సంబంధం లేకుండా ఎప్పుడు డాక్టర్‌ వద్దకు వెళ్లినా సరే..మీ బీపీ చెక్‌ చేయించుకోవటం మంచిది. కనీసం ఆరు నుండి 12 నెలలకు ఒకసారి మీ రక్తపోటును తనిఖీ చేసుకోవడం చాలా అవసరం. 40 సంవత్సరాల వయస్సు నుండి సాధారణ గుండె మూల్యాంకనాన్ని(ఈసీజీ)ని వైద్యులు సిఫార్సు చేస్తారు.

ఇవి కూడా చదవండి

మీరు యాంజియోప్లాస్టీ లేదా బైపాస్ సర్జరీ చేయించుకున్నట్లయితే, మీరు కనీసం ఆరు నెలలకోసారి మీ వైద్యుడిని సంప్రదించాలి. గుండె రోగి రోజువారీ జీవితాన్ని గడపవచ్చు. మెట్లు ఎక్కడం, ఈత కొట్టడం, జాగింగ్, స్పోర్ట్స్‌ వంటి రోజువారీ కార్యకలాపాలను చేయవచ్చు. కానీ, అలాంటి వాటిల్లో పాల్గొనే ముందు, వారు డాక్టర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఆరోగ్యంలో హెచ్చుతగ్గులు ఉంటే జీవనశైలిని సర్దుబాటు చేసుకోవడం ద్వారా సరిదిద్దుకోవచ్చు. కాబట్టి తరచుగా గుండె చెకప్ చేయడం అలవాటు చేసుకోండి. ఆరోగ్య సమస్యలను నివారించండి.

ఈ సాధారణ గుండె అంచనా ఆరోగ్య సమస్యను స్పష్టంగా వెల్లడిస్తుంది. ఉదాహరణకు, ఇది మీ అధిక రక్తపోటు, మధుమేహం, మీరు గత మూడు నుండి నాలుగు నెలల్లో ధూమపానం, మద్యం సేవించడం లేదా డ్రగ్స్ తీసుకుంటే, మీ జీవనశైలి, నిద్ర విధానాలు చక్కెర స్థాయిలను సూచిస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి