దైవలీల: 480 ఏళ్లుగా ఈ ఆలయంలో అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంది.. ఆ రహాస్యం ఎంటంటే..!
ఈ వంటగదిలోకి బయటి వ్యక్తుల ప్రవేశం నిషేధించబడింది. ఈ ఆలయ సేవకుడికి ధోతి తప్ప వేరే బట్టలు ఉండవు. వంట గదిలోకి వెళ్లిన తర్వాత, ప్రసాదం మొత్తం చేసిన తర్వాతే బయటకు వస్తారు. మధ్యలో ఒకసారి అతను బయటకు రావలసి వస్తే
మధుర బృందావన్ రాధారామన్ ఆలయం:భారతీయ దేవాలయాలలో పూజ్యమైన దేవతల వైభవం ప్రత్యేకమైనది. భక్తుల విశ్వాసం, భక్తితో పాటు భగవంతుని లీలలు, అద్భుతాలు నేటికీ ఈ ఆలయాల్లో కనిపిస్తాయి. మథురలోని బృందావంధామలోని ఏడు దేవాలయాలలో ఒకటైన రాధారామన్ ఆలయం కూడా ఒకటి. ఇటువంటి అద్భుతాలకు సంబంధించి ఈ ఆలయం ఎప్పుడూ చర్చల్లో నిలుస్తూనే ఉంటుంది. ఐదు శతాబ్దాలుగా అక్కడ భగవంతుని అద్భుతం, అద్వితీయమైన లీల కొనసాగుతోంది. ఇక్కడి ఆయల ఆవరణలో భగవంతుడి ప్రసాదాలు తయారు చేసేందుకు గత 480 సంవత్సరాలుగా కొలిమి నిరంతరం మండుతూనే ఉంది. ఈ అగ్ని నుండి వెలువడే జ్వాల ఈ ఆలయంలో దీపం, హారతి నుండి దేవుడికి నైవేద్యాల వరకు ఉపయోగించబడుతుంది.
దైవ లీలా.. ఈ ఆలయ పరిచారకుడైన శ్రీవత్స గోస్వామి తెలిపిన వివరాల ప్రకారం, ఆలయ ప్రాంగణంలో ఉన్న ఈ పురాతన కొలిమి రోజంతా మండుతూనే ఉంటుంది. దేవుని కార్యాలన్నీ పూర్తయిన తర్వాత రాత్రిపూట కొంత కలపను ఉంచి, అగ్ని చల్లబడకుండా పై నుండి బూడిదను కప్పిఉంచుతారు. మరుసటి రోజు ఉదయం, అదే మంటలో కొంత ఆవు పేడ పీడకలు, ఇతర కట్టెలు వేసి మిగిలిన బట్టీలను వెలిగిస్తారు. ఈ ఆచారం ఈ కొలిమి అన్ని పాత పూరాతన కాలంనాటివే. ఇది గత 480 సంవత్సరాలుగా నిరంతర జ్వాలగా మండుతూనే ఉందని చెబుతారు.
పవిత్ర జ్వాల.. ఈ పవిత్రమైన అఖండ జ్యోతి నుండి పొందిన అగ్నిని జ్వాలతో దీపాలు, జ్వాల వెలిగించడంతో పాటు దేవుడికిచ్చే హారతిలోనూ ఉపయోగిస్తారు. ఇక్కడ ఎలాంటి జ్యోతి ప్రజ్వలన చేసినా లైటర్ గానీ, అగ్గిపెట్టె గానీ వాడరు. బదులుగా ఈ కొలిమి మంట నుండి వచ్చే అగ్నిని మాత్రమే వాడుకుని భగవంతుని నైవేద్యాలు చేయడానికి ఉపయోగిస్తారు.
ఈ వంటగదిలోకి బయటి వ్యక్తుల ప్రవేశం నిషేధించబడింది. ఈ ఆలయ సేవకుడికి ధోతి తప్ప వేరే బట్టలు ఉండవు. వంట గదిలోకి వెళ్లిన తర్వాత, ప్రసాదం మొత్తం చేసిన తర్వాతే బయటకు వస్తారు. మధ్యలో ఒకసారి అతను బయటకు రావలసి వస్తే ఆలయంలోని పవిత్రమైన వంటగదిలోకి ప్రవేశించడానికి అతను తిరిగి స్నానం చేయాల్సి ఉంటుంది. లేదంటే వంటగదిలోకి ప్రవేశం ఉండదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి