Tulsi Vivah 2022: ఈ ఏడాది తులసి వివాహం తేదీ, శుభ ముహర్తం, ప్రాముఖ్యత.. పూర్తి వివరాలు మీ కోసం..

తెలుగు పంచాంగం ప్రకారం.. ఉదయం పూట తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కనుక ఈరోజు ప్రభోదిని ఏకాదశిగా భావించి ఉపవాస దీక్షను చేపట్టారు. ఇక మర్నాడు అంటే రేపు.. ద్వాదశి తిథి రోజున తులసి వివాహం కూడా నిర్వహిస్తారు.

Tulsi Vivah 2022: ఈ ఏడాది తులసి వివాహం తేదీ, శుభ ముహర్తం, ప్రాముఖ్యత.. పూర్తి వివరాలు మీ కోసం..
Tulsi Vivah 2022
Follow us
Surya Kala

|

Updated on: Nov 04, 2022 | 11:18 AM

కార్తీక మాసం శివకేశవులకు అత్యంత ప్రియమైన మాసం. ఈ నెలలో ప్రతి రోజూ పవిత్రంగా భావించబడుతోంది. ముఖ్యంగా ఏకాదశి అత్యంత విశిష్ట తిథిగా పురాణాల పేర్కొన్నాయి. కార్తీక మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ప్రభోదిని ఏకాదశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆషాడ ఏకాదశిన యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహావిష్ణువు ప్రభోదిని ఏకాదశి రోజున నిద్ర లేస్తారని.. తిరిగి సృష్టి పాలన సాగిస్తారని విశ్వాసం.. ఈ నేపథ్యంలో ఈ రోజు దేవుత్తని ఏకాదశి జరుపుకుంటున్నారు. ఏకాదశి శుభ సమయం : 3 నవంబర్ 2022 గురువారం రాత్రి 8:51 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమయింది. ఈరోజు రాత్రి 7:02 గంటలకు ఈ తిథి ముగుస్తుంది. అయితే తెలుగు పంచాంగం ప్రకారం.. ఉదయం పూట తిథిని పరిగణనలోకి తీసుకుంటారు కనుక ఈరోజు ప్రభోదిని ఏకాదశిగా భావించి ఉపవాస దీక్షను చేపట్టారు. ఇక మర్నాడు అంటే రేపు.. ద్వాదశి తిథి రోజున తులసి వివాహం కూడా నిర్వహిస్తారు.

తులసి మొక్కను భారత దేశంలో అత్యంత పవిత్రమైన మొక్కగా భావిస్తారు. తులసిని శ్రీకృష్ణుని భార్యగా భావించి పూజిస్తారు. దాదాపు అన్ని భారతీయ గృహాల ప్రాంగణంలో ఈ పవిత్రమైన మొక్క ఉంటుంది. ప్రతి రోజూ.. ఈ పవిత్రమైన తులసి మొక్కను పూజిస్తారు.

తులసి కార్తీక ఏకాదశి తిథి..కార్తీక శుక్ల పక్షం లోని పదకొండవ రోజు ఏకాదశితో సంబంధం కలిగి ఉంది. పురాణాల ప్రకారం వృందా (తులసికి మరొక పేరు) విష్ణువు రూపమైన శాలిగ్రామ రూపాన్ని వివాహం చేసుకుంది. మరోవైపు.. వైష్ణవులు ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి తిథి (పన్నెండవ రోజు) తులసీ వివాహాన్ని అత్యంత ఘనంగా జరుపుతారు. తులసి వివాహం ఈ సంవత్సరం నవంబర్ 5, 2022న జరుపుకోనున్నారు.

ఇవి కూడా చదవండి

తులసి వివాహం 2022 శుభ సమయం: 1) నవంబర్ 3 రాత్రి 7:30 నుండి నవంబర్ 4 సాయంత్రం 6:08 వరకు, ఏకాదశి తిథి ఉంది.

2) నవంబర్ 4 సాయంత్రం 6:08 నుండి నవంబర్ 5, 2022 సాయంత్రం 5:06 వరకు, ద్వాదశి తిథి..

తులసి వివాహం ప్రాముఖ్యత: భారతదేశంలో.. వివాహ, శుభకార్యాలను నిర్వహించే శుభ సమయం దేవుత్థాన ఏకాదశితో ప్రారంభమవుతుంది. చాతుర్మాస దీక్షా కాలం ఈ రోజుతో ముగుస్తుంది. వివాహాలు, ఇతర శుభకార్యాలు, గృహ ప్రవేశం, వివాహం, శుభకార్యాలు మొదలైనవి సాధారణంగా చాతుర్మాస కాలంలో నిర్వహించబడవు (శ్రావణ, భాద్రపద, ఆశ్వియుజ, కార్తీక మాసాల్లో). అయితే కార్తీక మాసం ఏకాదశి తిథి నుంచి శుభకార్యాల సీజన్ ప్రారంభమవుతుంది.

ఈ రోజున..  క్షీరసాగరలో నాలుగు నెలల యోగపాటు నిద్రలో ఉన్న విష్ణువు మేల్కొంటాడు. అంతేకాదు తులసి అనే యువతి పూర్వ జన్మలో ప్రసాదించిన వర ప్రభావంతో శాలిగ్రామం ను వివాహం చేసుకుంది. కనుక ద్వాదశి తిథి రోజున తులసికి వివాహ వేడుకను నిర్వహిస్తారు. తులసి మొక్క శాలిగ్రామను వధూవరులుగా భావించి అలంకరిస్తారు. హిందూ వివాహ ఆచారాలను అనుసరిస్తూ వివాహాది కార్యక్రమాలను నిర్వహిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
కల్తీ నెయ్యి కథ తేలే సమయం వచ్చేసింది.. తిరుమల లడ్డు విచారణలో
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
నెయ్యిలో వేయించిన వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్నిఆరోగ్యప్రయోజనాలు
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
మెగా వేలంలో రికార్డ్ ప్రైజ్ పొందే ముగ్గురు అన్‌క్యాప్డ్ ప్లేయర్లు
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
పోస్టాఫీసులు అద్భుతమైన స్కీమ్‌.. నెలకు రూ.20,500
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
సిద్ధార్థ్‌ హిట్ కొట్టేలా ఉన్నాడే.. ఆసక్తికరంగా 'మిస్‌ యూ' ట్రైలర
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
డస్ట్‌ అలర్జీ బాధిస్తోందా..? ఈ ఆయుర్వేద ఇంటి చిట్కాలు మీకోసం..!
రూ. 4 వేల పెన్షన్‌కు ముహుర్తం ఖరారు? తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..
రూ. 4 వేల పెన్షన్‌కు ముహుర్తం ఖరారు? తెలంగాణ ప్రభుత్వం కసరత్తు..
చరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్.. 3 ఏళ్ల రికార్డు బద్దలు
చరిత్ర సృష్టించిన ఎలోన్ మస్క్.. 3 ఏళ్ల రికార్డు బద్దలు
హైదరాబాద్‌లో మరో దారుణం.. బిర్యానీలో బొద్దింక, ఎక్కడంటే..
హైదరాబాద్‌లో మరో దారుణం.. బిర్యానీలో బొద్దింక, ఎక్కడంటే..
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!
గంటన్నరపాటు ఆగిపోయిన సైనికుడి గుండె.. అద్భుతం చేసిన వైద్యులు.!