AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Success Mantra: జీవితంలో లక్ష్యం కోసం చేసే పోరాటం ఎంత కష్టమో ఫలితం అంత గొప్పది.. మహానుభావులు చెప్పిన ప్రేరణాత్మక వ్యాఖ్యలు మీకోసం

చరిత్ర పుటల్లో పేరుగాంచిన మహానుభావులందరూ తమ లక్ష్యాలను అందుకోవడం చేసిన  పోరాటాల ఆధారంగానే ప్రపంచంలో భిన్నమైన గుర్తింపు తెచ్చుకోగలిగారు. జీవితానికి సంబంధించిన పోరాటం ఆధారంగా 5 ప్రేరణాత్మక వాక్యాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

Success Mantra: జీవితంలో లక్ష్యం కోసం చేసే పోరాటం ఎంత కష్టమో ఫలితం అంత గొప్పది.. మహానుభావులు చెప్పిన ప్రేరణాత్మక వ్యాఖ్యలు మీకోసం
Motivational Thoughts
Surya Kala
|

Updated on: Nov 05, 2022 | 1:58 PM

Share

జీవితం ఒక పోరాటం.. మనం జీవించి ఉన్నంత వరకు.. మన కలలను నిజం చేసుకోవడానికి ప్రతి క్షణం ఏదో ఒకదాని కోసం కష్టపడాలి. పోరాటం లేకుండా జీవితంలో కనీసం తిండి తినలేము.. సక్సెస్ సాధించలేము. సామాన్యుడే కాదు జంతువులు, పక్షులు కూడా కడుపు నింపుకోవడానికి కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. జీవితంలో ఎన్ని రకాల అవరోధాలు, సవాళ్లు ఎదురైనా, పరిస్థితులతో ఎదురీదుతూ.. జీవితంలో ముందుకు వెళ్లడాన్ని పోరాటం అంటారు. వాస్తవానికి  మన లక్ష్యాన్ని సాధించడానికి  మనల్ని నిత్యం చేసేది పోరాటమే. చరిత్ర పుటల్లో పేరుగాంచిన మహానుభావులందరూ తమ లక్ష్యాలను అందుకోవడం చేసిన  పోరాటాల ఆధారంగానే ప్రపంచంలో భిన్నమైన గుర్తింపు తెచ్చుకోగలిగారు. జీవితానికి సంబంధించిన పోరాటం ఆధారంగా 5 ప్రేరణాత్మక వ్యాఖ్యల గురించి ఈరోజు తెలుసుకుందాం.

  1. జీవితంలో ప్రతి వ్యక్తి పోరాటానికి తన సొంత మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.. ఒకొక్కసారి ఆ మార్గం పుస్తకాల ద్వారా తెలుస్తుంది. ఎంచుకున్న మార్గంలో లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తే.. అద్భుతమైన ముగింపు దక్కుతుంది.
  2. జీవితంలో నిత్యం జరిగే పోరాటాన్ని భగవంతుని అర్పణగా పరిగణించాలి. ఎందుకంటే లక్ష్యాన్ని అందుకునే సమయంలో కొంచెం బాధ కలిగినా.. దానిని లెక్కచేయకుండా ముందుకు వెళ్తే.. పోరాడినందుకు ప్రతిఫలం కూడా దక్కుతుంది.
  3. జీవితంలో సత్పలితాలను అందుకోవడానికి చేసే పోరాటాలు మిమ్మల్ని విఫలం చేయడానికి లేదా కష్టాలకు కారణం కాదు.. విజయం కోసం చేసే పోరాటం.. మీలో దాగి ఉన్న శక్తిని, తెలివి తేటలను బయటకు తీసుకురావడానికి ఒక సాధనం.
  4. మనం జీవితంలో విజయం కోసం చేసే పోరాటంలో అలసినట్లు భావించి.. వెనుదిరిగిన క్షణం.. మనం మన విలువను కోల్పోతాము. నిజానికి వర్తమానంలో చేయాల్సిన పోరాటం మనల్ని తదుపరి దశకు సిద్ధం చేస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. జీవితానికి సంబంధించిన పోరాటం మనకు మరింత  ఓపికను, సున్నితత్వాన్ని, మరింత బలంగా మారుస్తుంది. దుఃఖంతో నిండిన ప్రపంచంలో సంతోషానికి, విజయానికి ప్రత్యామ్నాయాలు ఉన్నాయని పోరాటం మనకు బోధిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)