షాకింగ్‌ ఘటన: ముగ్గురి ప్రాణాలు మింగేసిన రిఫ్రిజిరేటర్‌.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితిలో ఇరుగు పొరుగు వారు తలుపులు పగులకొట్టుకుని వచ్చారు. ఈ లోగానే రిఫ్రిజిరేటర్ పేలుడుతో వ్యాపించిన పొగ కారణంగా ఊపి రాడక గిరిజ ,ఆమె చెల్లెలు రాధ, బంధువు రామ్ కుమార్ మృతి చెందాడు.

షాకింగ్‌ ఘటన: ముగ్గురి ప్రాణాలు మింగేసిన రిఫ్రిజిరేటర్‌.. మరో ఇద్దరి పరిస్థితి విషమం
Fridge
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 04, 2022 | 12:59 PM

గ్యాస్‌ సిలిండర్‌ పేలుడు తెలుసు. ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్‌ బైకులు పేలుతున్న ఘటనలు అనేకం చూస్తున్నాం. అప్పుడప్పుడు మరికొన్ని రకాల బైకులు, కార్లు సైతం పేలుతుంటాయి. మొబైల్‌ ఫోన్లు కూడా అప్పుడప్పుడు పేలిన సంఘటనలు అనేకం చూశాం. ఇటీవల యాపిల్‌ వాచ్‌ పేలిందనే వార్త కూడా చూశాం. అయితే, తాజాగా మరో షాకింగ్‌ పేలుడు విధ్వంసం సృష్టించింది. సాధారణంగా అందరి ఇళ్లలో ఉండే రిఫ్రిజిరేటర్‌ పేలుడుతో ముగ్గురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటన తమిళనాడురాష్ట్రంలోని చెంగల్పట్టు జిల్లా కోదండరామ్ నగర్ లో చోటు చేసుకుంది. ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలి ముగ్గురు మృతి చెందారు. ఇంట్లో నిద్రిస్తున్న గిరిజ,రాథ, రాజ్ కుమార్ లు మరణించారని పోలీసులు చెప్పారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందజేస్తున్నారు.

చెంగల్పట్టు జిల్లాలోని ఉరుపాక్కం రైల్వేస్టేషన్ సమీపంలోని ఆర్ఆర్ బృందావన్ అపార్ట్మెంట్ ఫ్లాట్‌లో రిఫ్రిజిరేటర్ ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో ఇళ్లంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఏం జరిగిందో అర్థంకాని పరిస్థితిలో ఇరుగు పొరుగు వారు తలుపులు పగులకొట్టుకుని వచ్చారు. ఈ లోగానే రిఫ్రిజిరేటర్ పేలుడుతో వ్యాపించిన పొగ కారణంగా ఊపి రాడక గిరిజ ,ఆమె చెల్లెలు రాధ, బంధువు రామ్ కుమార్ మృతి చెందాడు. రామ్ కుమార్ భార్య భార్గవి, కూతురు ఆరాధన తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికంగా ఉన్న క్రోమ్ ఆసుపత్రికి తరలించారు. వీరంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే పేలుడు సంబవించిందని స్థానికులు చెబుతున్నారు.

గత ఏడాది నవంబర్‌లో అనారోగ్యంతో మరణించిన వారి బంధువుకు నివాళులర్పించేందుకు వచ్చి రిఫ్రిజిరేటర్ పేలుడుతో మరణించారు. గుడువాంచెరి పోలీసులు, మరైమలై నగర్ అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
విద్యార్థులకు శుభవార్త.. జనవరి 1 నుంచి 15 వరకు పాఠశాలలకు సెలవులు!
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
ప్రభాస్ ను ఫాలో అవుతున్న చరణ్, ఎన్టీఆర్
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!
లిప్ స్టిక్ తీసుకెళ్లడానికి రూ.27 లక్షల బ్యాగ్.. పిచ్చి పీక్స్!