నీకేం పోయేకాలం రా.. కారు ముట్టుకున్నందుకు చిన్నారిని కాలితో తన్నాడు.. పోలీసులపై ఫైర్ అవుతున్న నెటిజన్స్..

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Nov 04, 2022 | 1:49 PM

రోడ్డుపై పార్కు చేసిఉన్న కారును తాకాడని ఓ మైనర్‌ బాలుడిని విచక్షణా రహితంగా కాలితో తన్నాడు ఓ వ్యక్తి. ఈ ఘటన తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు

నీకేం పోయేకాలం రా.. కారు ముట్టుకున్నందుకు చిన్నారిని కాలితో తన్నాడు.. పోలీసులపై ఫైర్ అవుతున్న నెటిజన్స్..
Migrant Boy

రోడ్డుపై ఆడుకుంటున్న ఓ బాలుడు పక్కనే ఉన్న ఓ ఖరీదైన కారుపై వాలాడు..అదే వాడి నరకప్రాయంగా మారింది. కారుపై సరదాగా వాలినందుకు ఆరేళ్ల బాలుడిని అతి దారుణంగా తన్నాడు ఆ కారు యజమాని. ఇలాంటి అమానవీయ ఘటన కేరళలోని కన్నూరు జిల్లాలో చోటుచేసుకున్నది. రోడ్డుపై పార్కు చేసిఉన్న కారును తాకాడని ఓ మైనర్‌ బాలుడిని విచక్షణా రహితంగా కాలితో తన్నాడు ఆ వ్యక్తి. గురువారం సాయంత్రం కన్నూరు జిల్లాలోని తలస్సేరి పట్టణంలో మొహమ్మద్‌ షిహషాద్‌ అనే వ్యక్తి తన కారును రోడ్డుకు పక్కగా ఆపాడు. అదేసమయంలో అక్కడ ఉన్న ఆరేళ్ల బాలుడు దానికి ఆనుకొని నిలబడ్డాడు. అదే ఆ చిన్నారి చేసిన పాపం.

బాలుడిని గమనించిన మొహమ్మద్‌.. కారును తాకుతావా అంటూ ఆవేశంతో ఊగిపోయాడు. వీరావేశంతో బాలుడి నడుముపై బలంగా తన్నాడు. దీనిని చూసిన స్థానికులు కారు యజమానిని నిలదీశారు. అతనితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ పిల్లవాడు తన కారు డోరు తీయడానికి ప్రయత్నించాడని తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించాడు. కిందపడిపోయిన బాలుడిని స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ఇదంతా ట్రాఫిక్‌ సిగ్నళ్ల వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

ఇవి కూడా చదవండి

కాగా, జరిగిన ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని రక్షించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని సోషల్‌ మీడియాలో విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ ఈ ఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అతడికి శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కాగా, ఈ ఘటన తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వి. శివన్‌కుట్టి స్పందించారు. మనుషుల్లో మానవత్వం నశించిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బాలుడిపై ఈ రకంగా దాడిచేసిన సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని మంత్రి ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu