AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiring Story: కరోనా మహమ్మారి పెట్టిన పరీక్ష.. కుటుంబ పోషణకు క్యాబ్ డ్రైవర్‌గా మారిన మహిళ..

నందిని కరోనా సమయంలో తన జీవనోపాధిని కోల్పోయింది. అయితే తాను ఓడిపోయానని నిరాశపడలేదు.. దారిని మార్చుకుంది.. తన జీవితాన్ని మళ్ళీ  పునర్మించుకోవడం కోసం కృషి చేస్తోంది. చాలా మంది ప్రజలు నందిని సంకల్పాన్ని చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు.

Inspiring Story: కరోనా మహమ్మారి పెట్టిన పరీక్ష.. కుటుంబ పోషణకు క్యాబ్ డ్రైవర్‌గా మారిన మహిళ..
Woman drives Uber in Bengaluru
Surya Kala
| Edited By: Janardhan Veluru|

Updated on: Nov 04, 2022 | 3:05 PM

Share

కొంతమంది చిన్న చిన్న కష్టాలకు నిరాశపడితే.. మరొకొందరు.. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా నిరాశ పడరు.. తమకు వచ్చిన కష్టాలను ఇష్టంగా ఎదుర్కోవడానికి మరింత కష్టపడి పనిచేయడానికి ప్రయత్నిస్తారు.  తాజాగా ఓ మహిళకు చెందిన స్ఫూర్తివంతమైన కథను లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ షేర్ చేశారు..  ఒక వ్యక్తి తాను బెంగుళూరులో ఉబెర్‌ను బుక్ చేసుకున్న సమయంలో ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తాను క్యాబ్ ను బుక్ చేసుకుంటే.. తనను పికప్ చేసుకోవడానికి ఒక మహిళా డ్రైవర్ వచ్చింది. ఆ మహిళ ముందుగా ఫుడ్ బిజినెస్ చేసేదని.. అందులో నష్టాలు రావడంతో  ఉబర్‌ డ్రైవర్ గా మారిందని పేర్కొన్నారు.

రాహుల్ శశి కొన్ని వారాల క్రితం లింక్డ్‌ఇన్‌లో మహిళ కథను పంచుకున్నారు. తన స్నేహితుడు తన కోసం ఉబర్‌ను బుక్ చేశాడని.. అప్పుడు నందిని అనే మహిళ తనను తీసుకెళ్లేందుకు వచ్చిందని చెప్పారు. అప్పుడు ఆ మహిళ ముందు సీటులో నిద్రిస్తున్నచిన్నారి బాలికను తాను గమనించానని.. ఆ పాపా  మీ  కూతురేనా అని అడగకుండా ఉండలేకపోయినట్లు తన ఆత్రుత గురించి వివరించారు. నందిని తన పాపాఅని .. ప్రస్తుతం బేబీ సిట్టింగ్‌ సెంటర్ కు సెలవులు ఉన్నందున తనతో పాటు తీసుకుని రావాల్సి వచ్చిందని చెప్పినట్లు రాహుల్ పేర్కొన్నారు.

నిజానికి నందిని మహిళ వ్యాపారవేత్త కావాలనుకుందని.. అందుకోసం తాను పొదుపు చేసిన డబ్బులతో కొన్నేళ్ల క్రితం ఫుడ్ ట్రక్‌ను ప్రారంభించిందని పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే, కోవిడ్ వెలుగులోకి వచ్చిన తర్వాత.. తన బిజినెస్ పై తీవ్ర ప్రభావం చూపించిందని.. పెట్టిన పెట్టుబడి డబ్బు మొత్తాన్ని కోల్పోయినట్లు నందిని తెలిపింది. అందుకనే ఆమె ఉబెర్ క్యాబ్ డ్రైవింగ్ వృత్తిని ప్రారంభించింది. రోజుకు 12 గంటలు పని చేస్తుంది. “మళ్ళీ తాను డబ్బును ఆదా చేసి.. తాను కోల్పోయిన ప్రతిదానిని తిరిగి పొందాలని నందిని కోరుకుంటుందని రాహుల్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

రాహుల్ చేసిన పోస్ట్ తో నందిని పట్టుదలకు మద్దతు, ప్రశంసలు లభిస్తున్నాయి. అంతేకాదు రాహుల్ శశి మహిళా డ్రైవర్ తో ఉన్న ఫోటోని కూడా షేర్ చేశాడు. చాలా మంది నెటిజన్లు కష్టపడి పనిచేస్తున్న నందిని ప్రశంసిస్తున్నారు.  మరికొందరు చిన్నారి బాలిక భద్రత, శ్రేయస్సు గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నందిని కరోనా సమయంలో తన జీవనోపాధిని కోల్పోయింది. అయితే తాను ఓడిపోయానని నిరాశపడలేదు.. దారిని మార్చుకుంది.. తన జీవితాన్ని మళ్ళీ  పునర్మించుకోవడం కోసం కృషి చేస్తోంది. చాలా మంది ప్రజలు నందిని సంకల్పాన్ని చూసి నేర్చుకోవాలని సూచిస్తున్నారు. నేను కూడా నా పిల్లల కేరింగ్ తీసుకోవాల్సి వస్తే.. తనతో పాటు తన పిల్లల్ని తీసుకుని వెళ్తానని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. నందిని చేస్తోన్న పని గురించి జడ్జిమెంట్లు కాదు ప్రోత్సాహం ఇద్దాం” అని మరొకరు కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..