Indian Army: ఆర్మీలో విధులు నిర్వహిస్తూ మరణించిన భర్త కలలు తీర్చిన భార్యలు.. ఒడిలో చిన్నారి బిడ్డలతో ఆర్మీ ఆఫీసర్లుగా ఎంపిక..

తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (ఓటీఏ) నుంచి శనివారం 151 మంది జెంటిల్‌మెన్ క్యాడెట్లు, 35 మంది మహిళా క్యాడెట్లు ఉత్తీర్ణులయ్యారు. మహిళా క్యాడెట్‌లలో ఇద్దరు ప్రస్తుతం వార్తల్లో నిలిచారు.

Indian Army: ఆర్మీలో విధులు నిర్వహిస్తూ మరణించిన భర్త కలలు తీర్చిన భార్యలు.. ఒడిలో చిన్నారి బిడ్డలతో ఆర్మీ ఆఫీసర్లుగా ఎంపిక..
Rigzin Chorol Harveen Kaur Kahlon
Follow us
Surya Kala

|

Updated on: Oct 30, 2022 | 9:32 PM

తరం మారుతోంది..మనుషుల ఆలోచనలు మారుతున్నారు. దేశ సేవ చేయడం కోసం మగవారితో మేము సమానం అంటున్నారు అతివలు.. ఇప్పటికే పలు విభాగాల్లో తమ సేవలను అందిస్తున్నారు. తాజాగా తమిళనాడు రాజధాని చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA ) నుంచి శనివారం 151 మంది జెంటిల్‌మెన్ క్యాడెట్లు, 35 మంది మహిళా క్యాడెట్లు ఉత్తీర్ణులయ్యారు. మహిళా క్యాడెట్‌లలో ఇద్దరు ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఆ ఇద్దరి మహిళా క్యాడెట్ లో ఒకరు రిగ్జిన్ చోరోల్ (Rigzin Chorol).  ఆమె లడఖ్ ప్రాంతం నుండి భారత సైన్యంలో అడుగు పెడుతున్న మొదటి మహిళా అధికారి. మరొకరు హర్వీన్ కౌర్ కహ్లోన్. ఆమె ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. పాసింగ్ ఔట్ పరేడ్ తర్వాత  తీసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలో ఈ ఇద్దరు మహిళా అధికారులు తమ పిల్లలను తమ ఒడిలో పెట్టుకున్నారు.

ఆడవాళ్లిద్దరి ముఖాల్లో భిన్నమైన ఆత్మవిశ్వాసం కనిపించింది. ఈ మహిళలు తమ భర్తల మరణం తర్వాత సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆర్మీ అధికారి రిగ్జిన్ చోరోల్ భర్త లడఖ్ స్కౌట్స్‌లోని జెడాంగ్ సంపా బెటాలియన్‌లో రైఫిల్‌మెన్. విధుల్లో ఉండగా ప్రమాదంలో మృతి చెందాడు.

ఇవి కూడా చదవండి

భర్త కలను నిజం చేసిన చోరోల్:

చోరోల్ మాట్లాడుతూ..  ‘నా భర్త లడఖ్ స్కౌట్స్‌లో విధులను నిర్వహించారు. ఆర్మీ ఆఫీసర్ కావాలనుకున్నారు. అతను మరణించిన తర్వాత తాను తన భర్త కోరికను నెరవేర్చలేని భావించాను.. అందుకనే సైన్యంలో చేరాలనుకున్నానని చెప్పారు. ఇప్పుడు తన భర్త కలతో పాటు.. తన కలను నిజం చేసుకున్నానని పేర్కొన్నారు. తన కొడుకుని హత్తుకుని.. తన బాల్యంలో 11 నెలలు చాలా మిస్ అయ్యానని చెప్పారు. అంతేకాదు ఇప్పుడు నేను సైన్యంలో అధికారిగా ఎంపికయ్యాను కనుక.. నన్ను చూసి నా భర్త గర్వపడతాడని నేను ఖచ్చితంగా భావిస్తున్నానని చెప్పారు.

సైన్యంలో చేరాలని చోరల్ నిర్ణయం  తీసుకున్న అనంతరం.. ఆర్మ్ నార్తర్న్ కమాండ్ సీనియర్ అధికారులు కలుసుకున్నారు. ఆ అధికారికి తన కోరికను వెల్లడించారు.  ఆర్మీ కార్ప్స్ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో డిసెంబర్ 2021లో పోస్ట్ కి అప్లై చేశారు. ఇప్పుడు ‘లడఖ్‌లో  అనేక మందికి రిగ్జిన్ చోరోల్ ఆదర్శంగా న నిలిచారు.  చెన్నైలోని OTAలో శిక్షణ పొందిన భారత సైన్యానికి చెందిన మొదటి మహిళా లడఖీ అధికారిగా ఖ్యాతిగాంచారు.

 టీచర్ నుంచి ఆర్మీ ఆఫీసర్ గా హర్వీన్ కౌర్ కహ్లాన్: 

అదే సమయంలో, హర్వీన్ కౌర్ కహ్లాన్ జలంధర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. హార్వీన్  భర్త కెప్టెన్ కన్వల్పాల్ సింగ్ కహ్లాన్ విధి నిర్వహణలో  మరణించారు. అయితే హర్వీన్ మాట్లాడుతూ, ‘ఆర్మీలో చేరాలనే నా ఉత్సాహాన్ని చూసి నా భర్త నన్ను ప్రోత్సహించారు. తన భర్త  కలను నిజం చేయాలనుకున్నానని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..